
Best Web Hosting Provider In India 2024

Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఏప్రిల్‍లో రిలీజ్ కావాల్సిన దేవర మూవీ ఏకంగా అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది. మరోవైపు, మార్చిలో గామి సినిమాతో మంచి హిట్ దక్కించుకున్నారు మాస్ కా దాస్ విశ్వక్‍సేన్. రీసెంట్‍గా టిల్లు స్క్వేర్ మూవీతో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ భారీ బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, తాజాగా ఎన్టీఆర్, విశ్వక్‍సేన్, సిద్ధు జొన్నలగడ్డ కలిశారు. ఆ వివరాలివే..
కారణమిదే..
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. డీజే టిల్లుకు సీక్వెల్‍గా వచ్చి అంతకు మించి బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ తరుణంలో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‍సేన్‍తో కలిసి టిల్లు స్క్వేర్ సినిమా చూశారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీ చూసేందుకు వీరు మరోసారి కలిశారు.
ఎన్టీఆర్, విశ్వక్‍సేన్, సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ కలిసి దిగిన ఓ సెల్ఫీ బయటికి వచ్చింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. దేవరతో దాస్, టిల్లు అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.
సిద్ధు చెప్పిన సర్‌ప్రైజ్ ఇదే
ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. బిగ్ సర్‌ప్రైజ్ రానుందంటూ పోస్ట్ చేశాడు. అయితే, ఏప్రిల్ 8వ తేదీన టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్‍ను మూవీ టీమ్ గ్రాండ్‍గా నిర్వహించనుందని, ఆ ఈవెంట్‍కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలుస్తోంది. సిద్ధు చెప్పిన బిగ్ సర్‌ప్రైజ్ అదేనని సమాచారం బయటికి వచ్చింది.
తనను ఎన్టీఆర్ ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫొటోను కూడా విశ్వక్‍సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లవ్ యూ అన్నా అంటూ ఈ ఫొటో షేర్ చేశారు. తనకు విశ్వక్ అంటే ఇష్టమని ఎన్టీఆర్ గతంలోనూ కొన్ని సందర్భాల్లో చెప్పారు.
టిల్లు స్క్వేర్ సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సిద్ధు సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‍గా నటించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 5 రోజుల్లోనే రూ.85 కలెక్షన్లను సాధించి సూపర్ హిట్‍గా దూసుకెళుతోంది.
విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గామి సినిమా గత నెల రిలీజై మంచి హిట్ అయింది. ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రం కమర్షియల్‍గా సక్సెస్ అవటంతో పాటు నటుడిగా విశ్వక్‍కు మంచి పేరు తీసుకొచ్చింది.
ఇక, దేవర సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రానున్న చిత్రం ఇదే కావటంతో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
సంబంధిత కథనం