Krishna mukunda murari april 4th: తన కూతురు బతికే ఉందన్న శ్రీనివాస్.. పరాకాష్టకు చేరిన ముకుంద శాడిజం

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial april 4th episode: రేవతి ముకుందకి పిండ ప్రదానం చేయడం గురించి భవానీతో మాట్లాడుతుంది. ఉన్నప్పుడు తను మనశ్శాంతిగా ఉండలేదు, ఎవరిని ఉండనివ్వలేదు చేసేద్దామని చెప్తుంది. కార్యక్రమానికి వాళ్ళ నాన్న శ్రీనివాస్ ని కూడా రమ్మని పిలవమని చెప్తుంది. ఆయన్ని పిలవడం ఎందుకని మధు, నందిని అంటారు. మనసులో కోరిక నెరవేరకుండా పోయింది అయిన వాళ్ళు ఉంటే శాంతిస్తుందని అంటుంది.

 

ముకుంద ప్లాన్ బెడిసికొడుతుందా?

కృష్ణ తాము రాలేమని చెప్తుంది. ముకుంద ప్రాణాలతో ఉన్నప్పుడే శ్రీనివాస్ కు ఈ ఇంటికి అంతగా సంబంధం లేదని తన జోలికి ఎవరు వెళ్లొద్దని భవానీ అంటుంది. ఒక్కోసారి గతం గుర్తుకు వస్తే చాలా బాధగా ఉంటుంది. ముకుందకు సంబంధించిన విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కృష్ణ బాధగా చెప్తుంది. ఆ మాటలు విని ఆదర్శ్ సీరియస్ గా తిట్టేసి వెళ్ళిపోతాడు.

ఆదర్శ్ కూడా రానని చెప్పాడని రేవతి అంటుంది. ఇష్టం లేకపోతే వద్దులే శ్రీనివాస్ వస్తాడుగా ఆయన పెడతాడులే లేదంటే పంతులే పెడతాడని భవానీ అంటుంది. ముకుంద అంతరాత్మ అద్దంల్లో ప్రత్యక్షం అవుతుంది. ఛీ ఏం బతుకే నీది నీ పిండ ప్రదానానికి నువ్వు వెళ్ళడం ఏంటి? ఈ చావు ఆలోచన ఎలా వచ్చిందే నీకు. మురారితో కథ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడుతున్నావ్. ఒకప్పుడు నీ అసలు రూపం ఇష్టపడిన మురారి కృష్ణ వచ్చిన తర్వాత నిన్ను పట్టించుకోవడమే మానేశాడు. ఇప్పుడు ఈ రూపాన్ని ఇష్టపడతాడా? నాకు డౌటే నీ ప్లాన్ బెడిసికొట్టేలా ఉందని అంటుంది.

 

భవానీ శ్రీనివాస్ పోట్లాట 

పిండ ప్రదానం చేసినా పట్టించుకోకు. ఇలాంటి సెంటిమెంట్స్ పక్కన పెట్టేసెయ్. మురారి కోసం చావడం తప్ప దేనికైనా నువ్వు సిద్దపడాలి. అప్పుడే వాడు నీవాడు అవుతాడని మళ్ళీ తనని తాను సమర్థించుకుంటుంది. భవానీ ఎందుకు రమ్మనదని శ్రీనివాస్ ఆలోచిస్తూ వాళ్ళు ఉన్న దగ్గరకు చేరుకుంటాడు. ఎందుకు పిలిపించారని అడుగుతాడు.

పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఉన్న శ్రద్ధ మిగతా వాటి మీద ఉండదని అంటుంది. మీరు గొడవ పడటానికి పిలిపించారని అర్థం అయ్యింది. రెండు రోజులు మీ కొడుకు జైల్లో ఉంటే ఇంతగా బాధపడుతున్నారు. నాకు కూతురినే లేకుండా చేశారు నేనెంత బాధపడాలని నిలదీస్తాడు. ముకుంద ఫోటోకి దండ వేసి పిండం పెట్టి ఉండటం చూసి శ్రీనివాస్ షాక్ అవుతాడు. వెంటనే ముకుంద వైపు చూస్తాడు.

నా కూతురు బతికే ఉంది 

ముకుందకు మంచి జరగాలని మా కుటుంబం ఆలోచించింది. కానీ అది అర్థం చేసుకోలేక నీ కూతురు దూరం అయిపోయింది. నువ్వు నా కొడుకు మీద పగ తీర్చుకోవాలని అనుకున్నావ్. జరిగింది ఏదో జరిగిపోయింది కార్యక్రమం చేయమని చెప్తుంది. శ్రీనివాస్ కోపంగా తాను చేయలేనని చెప్తాడు. భవానీ ఏమైందని అంటే నా వల్ల కాదని తెగేసి చెప్తాడు. సైలెంట్ గా పిండం పెట్టేసి పోకుండా ఎందుకు గొడవ చేస్తున్నాడు నాన్న. నేను బతికే ఉన్నానని ఆవేశంలో చెప్పేస్తారు ఏమోనని ముకుంద మనసులో టెన్షన్ పడుతుంది.

 

చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ఇలా చేయాలని రేవతి అంటుంది. ఆపవమ్మా ఎవరు చెప్పారు ముకుంద చనిపోయిందని, నా కూతురు చనిపోలేదు ఇంకా బతికే ఉందని నోరు జారతాడు. మీరా వెంటనే అవును ముకుంద బతికే ఉంది చనిపోయిందని ఎవరు అన్నారు. మన ఆలోచనల్లో చేసే పనుల్లో ముకుంద బతికే ఉందని కవర్ చేస్తుంది. ఎప్పటికీ అలాగే బతికే ఉండాలంటే జరగాల్సిన కార్యక్రమం చూడమని చెప్తుంది.

తనకి పిండం పెట్టేయమన్న ముకుంద 

నువ్వు ఎక్కడ నిజం చెప్పేస్తావోనని టెన్షన్ తో చనిపోయేలా ఉన్నాను. చిన్నప్పుడు గోరు ముద్దలు పెట్టావ్ కదా ఇప్పుడు అలాగే అనుకుని చేయమని తండ్రికి సర్ది చెప్తుంది. దీంతో శ్రీనివాస్ ఒప్పుకుంటాడు. ముకుంద మాటలు గుర్తు చేసుకుంటూ రేవతి తనని తిట్టుకుంటుంది. ఉన్నప్పుడు ప్రశాంతంగా లేదు పోయాక కూడా ప్రశాంతంగా లేకుండా చేస్తుందని అనుకుంటుంది.

బతికున్న కూతురికి పిండం పెడుతూ శ్రీనివాస్ అల్లాడిపోతాడు. దీని పిచ్చి ప్లాన్ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుందని శ్రీనివాస్ కూతురిని తిట్టుకుంటాడు. పిండం తినేందుకు ఒక్క కాకి కూడా రాలేదని పంతులు అంటాడు. బతికున్నప్పుడు ఏమంత మంచి పనులు చేసింది కాకులు రావడానికని సుమలత అంటుంది.

 

ముకుంద కోరిక తీర్చేయండి 

ఏదో బలమైన కోరిక తీరకుండా చనిపోయినట్టు ఉంది ఆ కోరిక ఏదో తీర్చమని పంతులు భవానీకి సలహా ఇస్తాడు. అది తీరే కోరిక కాదు, తీరదని తెలిసే ఆవిడ పోయిందని మధు అంటాడు. పోలేదు ఇక్కడే ఉన్న అనుకున్నది సాధించకుండా నేనెక్కడికి పోతానని ముకుంద మనసులో అనుకుంటుంది.

ఆదర్శ్ గోడకు తగిలించిన ముకుంద ఫోటో తీసేస్తాడు. ముకుంద తండ్రి దగ్గరకి వెళ్ళి తనని పట్టుకుని ఏడుస్తుంది. చేయాల్సింది అంతా చేసి మళ్ళీ ఇదంతా ఎందుకు? నా కూతురికి నాతోనే పిండం పెట్టించావ్. నిన్ను ముట్టుకోవాలంటేనే చిరాకుగా ఉంది ఓవర్ యాక్షన్ తగ్గించి వెళ్లిపొమ్మని చిన్నగా చెప్తాడు. నా పరిస్థితికి నిజంగానే ఏడవాలని ఉంది ఎవరికీ అనుమానం రాకుండా ఓదార్చమని చెప్తుంది.

ఈరోజు నుంచి నా కూతురిని నీలోనే చూసుకుంటానని అంటాడు. తెలిసో తెలియకో అద్భుతమైన ఐడియా ఇచ్చావ్ దీన్ని ఉపయోగించుకుని ఆట ఆడించాలని అనుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఆదర్శ్ మీరా పేరుని ముకుందగా మారుస్తున్నట్టు చెప్తాడు.

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024