Karthika deepam 2 serial april 4th episode: కార్తీక్ ని అసహ్యించుకున్న వంటలక్క.. తల్లి సుమిత్రను కలుసుకున్న దీప

Best Web Hosting Provider In India 2024

Karthika deepam 2 serial april 4th episode:దీపతో నరసింహ చాలా నీచంగా మాట్లాడతాడు. మొగుడివి అయి బతికిపోయావ్ లేదంటే ఈ మాట అన్నందుకు నీ రక్తం కళ్ళ చూసేదాన్ని. నిన్ను వెధవ అని పిలవడానికి నా సంస్కారం అడ్డు వస్తుంది. లేదంటే చెప్పు తీసుకుని కొట్టే దాన్ని. నువ్వు నన్ను వదిలేసినా నిన్ను నేను వదులుకోలేను. నిన్ను ఇంటికి తీసుకుపోయి నా సంసారాన్ని దారిలో పెట్టుకోవాలని అనుకున్నాను కానీ నా బతుకుని నాశనం చేశావ్ అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది.

 

భర్తని ఛీ కొట్టిన దీప

ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న ఏడని అడిగితే వస్తాడని చెప్తూ వచ్చాను. పొద్దుటి నుంచి తిరుగుతుంటే అది తిండి అడగలేదు నాన్నని అడుగుతుంది. దానికి నాన్న అంటే అంత పిచ్చి. నీ గురించి గొప్పగా ఊహించుకుంది కానీ నువ్వు ఇంత నికృష్టుడివని దానికి తెలియదు. మనిషి విలువ తెలియని నీలాంటి వాడి కోసం కన్నీళ్ళు కార్చడం అనవసరం. ఇన్నాళ్ళూ నా కూతురు తండ్రి లేని వాడిగా బతికింది ఇప్పటి నుంచి అలాగే బతుకుతుంది. నిన్ను నమ్ముకున్నందుకు బాగా న్యాయం చేశావ్ ఇక సెలవు అని చెప్పేసి వెళ్ళిపోతుంది.

కార్తీక్ తను చేసిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటాడు. అతడికి ఇన్స్యూరెన్స్ ఉందో లేదో దీపని చూస్తే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అనిపిస్తుంది. ముత్యాల గూడెం వెళ్ళగానే జరిగింది చెప్పి దీపకి సాయం చేయాలని అనుకుంటాడు. దీప నరసింహ మాటలు, ఊర్లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు నేనెమని చెప్పాలి ఏ మొహం పెట్టుకుని ఊరు వెళ్లాలని ఆలోచిస్తుంది.

చంపేస్తావా?

శౌర్య నాన్న ఎక్కడ త్వరగా తీసుకెళ్లమని అడుగుతుంది. దీప తన బిడ్డతో రోడ్డు మీద నడుస్తుంటే కారు డ్యాష్ ఇవ్వబోతుంది. వెంటనే కారు సడెన్ బ్రేక్ పడుతుంది. కార్తీక్ కంగారుగా కారు దిగి వచ్చి దీపని చూసి ఆశ్చర్యపోతాడు. దీప మాత్రం తన తండ్రికి జరిగిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుని ఎవరిని బతకనివ్వవా అందరినీ చంపుకుంటూ పోతావా? అని తిడుతుంది.

 

నేను కారులో తిరుగుతుంటే శని నా నెత్తి మీద తిరుగుతుంది. ఏ మనిషి కోసం నేను బాధపడుతున్నానో ఆ మనిషిని మరోసారి బాధపెట్టాను. ఇంతకముందు నేరం చేసిన వాడిలా చూసింది ఇప్పుడు మనిషిలా కూడా చూడదు. నన్ను హంతకుడిని చేసేసింది. అసలు దీప సిటీకి ఎందుకు వచ్చింది. బతకలేక వచ్చినట్టు ఉంది తన జీవితానికి ఎలా న్యాయం చేయాలని అనుకుంటాడు.

శౌర్య ప్రశ్నల పర్వం

సుమిత్ర గుడిలో తన మొక్కు చెల్లించుకుంటుంది. పంతులు జ్యోత్స్న కార్తీక్ పెళ్లి గురించి మాట్లాడతాడు. వాళ్ళ పెళ్లి చూడాలని తమకి ఆశగా ఉందని సుమిత్ర చెప్తుంది. ఇంకొంచెం ఉంటే కారు గుద్దేసి చచ్చిపోయే దాన్ని కదాని శౌర్య అంటుంది. ఆ కారు నడిపిన అంకుల్ ని ఎక్కడో చూశాను మనకి సైకిల్ ప్రైజ్ ఇచ్చింది అతనే కదా. మనతో మాట్లాడలేదు ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.

నాన్న దగ్గరకి ఎప్పుడు వెళ్తామని మళ్ళీ అడుగుతుంది. ఆ దరిద్రుడి దగ్గరకు ఇక మనం వెళ్ళేది లేదు. మన బతుకులు రోడ్డు పాలు చేశాడని దీప కోపంతో రగిలిపోతుంది. సుమిత్ర కూతురు గెలిచినందుకు సంతోషంగా గుడిలో అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తుంది. శౌర్య ఆకలిగా ఉందని అనుకుంటూ అన్నదానం జరుగుతున్న గుడికి వస్తారు.

 

తల్లిని కలిసిన దీప

హోటల్ లో భోజనం చేస్తే డబ్బులు అయిపోతాయని ఆలోచించి అన్నదానం జరిగే దగ్గరకు దీప, శౌర్య వెళతారు. దీప మరోసారి తన తల్లి దగ్గరకు చేరుకుంటుంది. సుమిత్రని చూసి ఈమెని ఎక్కడో చూసినట్టు ఉందని దీప ఆలోచిస్తుంది. సుమిత్ర కూడా దీపని చూస్తుంది. తల్లీకూతుర్లు మళ్ళీ కలుసుకున్న సీన్ చాలా బాగుంటుంది. అందుకు తగిన బిజీఎం వేసి సూపర్ గా చూపించారు.

సుమిత్ర దీపని చాలా ప్రేమగా చూసుకుంటుంది. దీపని పట్టుకోగానే సుమిత్ర కన్నపేగు కదులుతుంది. తనని తాను అమ్మమ్మగా శౌర్యకి పరిచయం చేసుకుంటుంది. విధి రాత మళ్ళీ ఆ తల్లీకూతుళ్ళని కలిపింది.

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024