Shoaib Malik: మొన్నే మూడో పెళ్లి.. అప్పుడే మరో నటిపై కన్నేసిన సానియా మీర్జా మాజీ భర్త

Best Web Hosting Provider In India 2024

Shoaib Malik: హైదరాబాదీ, మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈమధ్యే మూడో పెళ్లి చేసుకున్న అతడు మళ్లీ వ్యక్తిగత జీవితం విషయంలోనే వార్తల్లోకెక్కాడు. సానియాకు విడాకులు ఇచ్చి పాక్ నటి సనా జావెద్ ను ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్న షోయబ్.. ఇప్పుడు మరో నటి వెంట పడుతున్నట్లు తేలింది.

 

ఆ నటికి మెసేజ్‌లు పంపింది షోయబ్ మాలికేనా?

పాకిస్థాన్ కు చెందిన స్టార్ నటి నవల్ సయీద్ ఈ మధ్య లైఫ్ గ్రీన్ హై అనే ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా తనకు పాకిస్థానీ క్రికెటర్ల నుంచి సరసమైన మెసేజ్‌లు వస్తున్నట్లు చెప్పింది. పెళ్లయిన క్రికెటర్ల నుంచి కూడా వస్తున్నట్లు ఆమె చెప్పడంతో పరోక్షంగా షోయబ్ మాలిక్ గురించి ఆమె ప్రస్తావించినట్లు భావిస్తున్నారు.

నవల్ సయీద్ ఈ విషయం చెప్పగానే ఈ షోని హోస్ట్ చేస్తున్న ఐజాజ్ అస్లమ్, నదియా ఖాన్ షాక్ తిన్నారు. మీరు షోయబ్ మాలిక్ గురించే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ తాను పేరు మరచిపోయినట్లు చెప్పడం గమనార్హం. దీంతో ఆ పెళ్లయిన క్రికెటర్లలో షోయబ్ మాలిక్ కూడా ఉన్నట్లు అభిమానులు ఫిక్సయిపోయారు.

క్రికెటర్లు ఇలా చేయడం సరికాదు

మరి ఆ క్రికెటర్లు ఎలాంటి మెసేజ్‌లు పంపిస్తున్నారు అని అడగగా.. తాను వాటి గురించి మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే క్రికెటర్లు ఇలా చేయడం సరికాదని మాత్రం చెప్పింది. “క్రికెటర్లు ఇలా చేయడం సరికాదు అని నాకు అనిపిస్తుంది. యాక్టర్స్ కంటే ఎక్కువగా క్రికెటర్లు, క్రీడాకారులనే ఎక్కువ మంది ఆదర్శంగా తీసుకుంటారు” అని నవల్ చెప్పింది.

 

షోయబ్ మాలిక్ పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. అతడు 2010లో సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లోనే వీళ్లిద్దరి పెళ్లి వివాదాస్పదమైంది. సానియా లాంటి స్టార్ ప్లేయర్ కు పెళ్లి చేసుకోవడానికి ఇండియాలో ఎవరూ దొరకలేదా.. పాకిస్థాన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకోవడమేంటని చాలా మంది విమర్శించారు. వీళ్లిద్దరూ దుబాయ్ లు కలిసి ఉన్నారు.

13 ఏళ్ల పాటు కలిసి ఉన్న వీళ్లు గతేడాది విడిపోయారు. నిజానికి వీళ్ల పెళ్లి పెటాకులు కానుందని చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావెద్ ను మూడో పెళ్లి చేసుకోవడంతో సానియాతో బంధం తెగిపోయిందని స్పష్టమైంది. సనా జావెద్ కూడా అంతకుముందు సింగర్ ఉమైర్ జస్వాల్ ను పెళ్లి చేసుకొని విడిపోయింది.

అయితే మూడో పెళ్లి చేసుకొని మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే షోయబ్ మాలిక్ పక్క చూపులు చూస్తుండటంతో ఫ్యాన్స్ అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నవల్ సయీద్ పేరు చెప్పకుండా నవ్వడంతో ఆమెకు సందేశాలు పంపినవారిలో షోయబ్ మాలిక్ కూడా ఉన్నట్లు తేలిపోయింది. దీంతో ఇప్పుడతడు మూడో పెళ్లిని కూడా పెటాకులు చేసుకుంటాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 
WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024