Best Web Hosting Provider In India 2024
Minister RK Roja Getup Srinu: జబర్దస్త్ (Jabardasth) కామెడీ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు గెటప్ శ్రీను. వివిధ రకాల గెటప్పులు వేసి గెటప్ శ్రీనుగా.. బుల్లితెర కమల్ హాసన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ షో సమయంలో జడ్జ్‌గా ఉన్న సీనియర్ హీరోయిన్ రోజా, ప్రస్తుత ఏపీ మంత్రి రోజా, గెటప్ శ్రీను మధ్య మంచి రాపో ఉండేది. కానీ, ఇటీవల పరిస్థితులు మారాయి.
స్పందించిన గెటప్ శ్రీను
ఇటీవల జనసేన తరఫున గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), ఆటో రామ్ ప్రసాద్ (Auto Ramprasad) ప్రచారం చేశారు. దీనిపై మంత్రి ఆర్కే రోజా పలు కామెంట్స్ చేశారు. అయితే, తాజాగా గెటప్ శ్రీను హీరోగా చేస్తోన్న రాజు యాదవ్ (Raju Yadav Movie) ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా మంత్రి రోజా కామెంట్లపై గెటప్ శ్రీను స్పందించాడు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.
లక్ష మెజారిటీ వస్తుంది
“కొన్ని సందర్భాల్లో ఇలాంటివి తప్పవు. ఏ మనిషి కూడా అందిరికీ నచ్చడు. పవన్ కల్యాణ్‌పై అభిమానం ఉంది కాబట్టే జనసేన తరఫున ప్రచారం చేశాను. పవన్ కల్యాణ్ గారికి లక్ష మెజారిటీ వస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల స్పందన బాగుంది” అని గెటప్ శ్రీను చెప్పాడు.
మేమే వెళ్లాం
జనసేన పార్టీ వర్గాలు ఆహ్వానిస్తే వెళ్లారా? స్వయంగా వెళ్లారా? అని అడిగిన ప్రశ్నకు.. “మా అంతట మేమే (సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్) ఫోన్ చేసి మరి ప్రచారానికి (Janasena Campaign) వెళ్లాం. అంతే తప్పా వాళ్లు మమ్మలిని రమ్మని అడగలేదు” అని గెటప్ శ్రీను రియాక్ట్ అయ్యాడు.
వారిని అనడం వేస్ట్
కాగా గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ జనసేన ప్రచారానికి వెళ్లడంపై.. “వాళ్లెంతండీ.. వాళ్ల ప్రాణమెంత.. వీరితో ఎవరు మాట్లాడిస్తున్నారో వారి గురించి ఆలోచించాలి గానీ, వీరిని అనడం వేస్ట్. వీళ్లంతా చిన్న షోలు చేసుకుంటూ చిన్న పాత్రలు పోషించేవారు” అని మంత్రి రోజా అన్నారు.
ప్రేమతో ఎవరు లేరు
“మీకు తెలియంది ఏముంది.. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతో వారు ఆ కుటుంబంతో ఉన్నారు. ప్రేమతో ఎవరు ఏం లేరు. నిజంగానే ప్రేమ ఉంటే వాళ్లు మా ఎలక్షన్స్‌లో ప్రకాశ్ రాజ్‌కి సపోర్ట్ చేసినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయారు. ప్రేమ వేరు, భయం వేరు” అని రోజా వివరించారు.
తేజ ఎంతో ప్రోత్సహించారు
ఇదిలా ఉంటే రాజు యాదవ్ సినిమా ట్రైలర్‌ను సూపర్ హీరో తేజా సజ్జా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా గురించి గెటప్ శ్రీను స్పీచ్ ఇచ్చాడు. “నన్ను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఈ వేడుకు విచ్చేసిన తేజా గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా జర్నీలో తేజా గారు ఎంతగానో ప్రోత్సహించారు” అని గెటప్ శ్రీను తెలిపాడు.
మీ దీవెనలు కావాలి
“దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా దొరుకుతుంది. మే17న మీ అందరి దీవెనలు కావాలి. ఉదయ్ చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. సురేష్ బొబ్బిలి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు” అని గెటప్ శ్రీను చెప్పుకొచ్చాడు.
చాలా పాషన్‌తో
“నిర్మాత ప్రశాంత్ గారు చాలా పాషన్‌తో రాజు యాదవ్ సినిమా చేశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే17న అందరూ రాజు యాదవ్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అని గెటప్ శ్రీను ఆకాంక్షించాడు.