Best Web Hosting Provider In India 2024
Brahmamudi May 7th Episode: కావ్యపై నోరు జారుతుంది రుద్రాణి.ఆమెను అవమానిస్తుంది. రుద్రాణిపై సుభాష్ ఫైర్ అవుతాడు. ఆస్తి కోసమే పడుంటుందని అపనిందవేస్తావా? నా కోడలిని పల్లెత్తు మాట కూడా అనే హక్కు కూడా నీకు లేదని రుద్రాణికి క్లాస్ ఇస్తాడు.
అపర్ణ అలక…
తల్లి మాటకు కట్టుబడి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు రాజ్. దాంతో రాజ్‌పై కోపం పెంచుకున్న అపర్ణ అతడితో డిన్నర్ చేయడానికి అంగీకరించదు. తాను ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి రెండు రోజులే గడువు ఉంటుంది. ఈ గడువు పూర్తయ్యేలోపు నీ మనసును కష్టపడితే నువ్వు ఎంతలా బాధపడతావో నేను ఊహించగలను. ఆ బాధ నీకు ఉండకూడదంటే నువ్వు నాతో కలిసి ఇప్పుడు డిన్నర్ చేయాలని అపర్ణను రిక్వెస్ట్ చేస్తాడు రాజ్.
బిడ్డను వదిలేస్తేనే…
ఎప్పటిలా మన సంతోషంగా ఉండాలంటే నువ్వు ఆ బిడ్డను వదిలేయాలని రాజ్‌తో అంటుంది అపర్ణ. అప్పుడే మునుపటిలా నీతో సంతోషంగా ఉండగలనంటుంది. తల్లి మాటలకు రాజ్ హర్ట్ అవుతుంది. డిన్నర్ చేయకుండానే డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు. నాకు ఆకలి చచ్చిపోయిందని అంటాడు. నీకు ఆకలి మాత్రమే చచ్చిపోయింది…నాకు అమ్మతనం కూడా చచ్చిపోయిందని కోపంగా అపర్ణ కూడా డిన్నర్ చేయకుండానే వెళ్లిపోతుంది.
సీక్రెట్ రివీల్…
రాజ్ డిలేట్ చేసిన ఆఫీస్ వీడియోలను సంపాదించి రాజ్ దాచిపెట్టిన బిడ్డ తాలూకు రహస్యం అందరి బయటపెట్టాలని కావ్య ఎదురుచూస్తుంటుంది. రాజ్ డిలేట్ చేసిన వీడియోలను అప్పు రికవరీ చేసి వాటిని కావ్యకు పంపిస్తుంది. అప్పు పంపించిన ఈ వీడియోల్లో ఏముందో చూడాలని కావ్య ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.
సుభాష్ ఆవేదన…
ఇంటి నుంచి వెళ్లిపోకుండా రాజ్‌కు సర్ధిచెప్పేందుకు సుభాష్ ప్రయత్నిస్తాడు. అమ్మకు నిజం చెప్పి తప్పుచేయడం కంటే తాను ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే మంచిదనిపిస్తుందని తండ్రితో అంటాడు రాజ్.
ఇదంతా నా వల్లే వచ్చిందని, మీ పెళ్లిరోజు నువ్వు నా క్యాబిన్‌వైపుకు రాకుండా ఉండి ఉంటే ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండేవారని రాజ్‌తో బాధంగా అంటాడు రాజ్. నేను రాకుండా ఉండి ఉంటే మీరు ఈ రోజు ప్రాణాలతో ఉండేవారు కాదని రాజ్ బదులిస్తాడు. ఇంట్లో అందరి బాధకు నేనే కారణం అని గుర్తొచ్చినప్పుడల్లా ఆ చావును అనుభవిస్తున్నానని సుభాష్ ఎమోషనల్ అవుతాడు.
సుభాష్ ఆత్మహత్య ప్రయత్నం…
అప్పు పంపించిన వీడియోను కావ్య ఓపెన్ చేస్తుంది. ఆ వీడియోలో ఆఫీస్‌లోనే సుభాష్ ఉరివేసుకోవడానికి ప్రయత్నించడం చూసి కావ్య షాకవుతుంది. రాజ్ వచ్చి సుభాష్‌ను కాపాడుతాడు. ఎందుకు ఉరివేసుకోవాలని అనుకుంటున్నారో చెప్పమని సుభాష్‌ను రాజ్ అడగటం ఆ వీడియోలో వినిపిస్తుంది. మీ కష్టం తీర్చడానికి నేను ఉన్నానని తండ్రితో అంటాడు రాజ్.
మీరు ప్రాణాలు తీసుకునేంత పెద్ద సమస్య అయితే..నా ప్రాణాలు అడ్డువేసి మిమ్మల్ని నేను కాపాడుకుంటానని తండ్రికి సర్ధిచెప్పి జరిగింది రాబడుతాడు రాజ్. తాను తప్పు చేశానని, ఆ తప్పును సరిదిద్దుకోలేక ఊబిలో కూరుకుపోతున్నానని, మీ అమ్మకు అన్యాయం చేసిన తనకు దుగ్గిరాల ఇంట్లో తలెత్తుకొని బతికే అర్హత లేదని బాధపడతాడు సుభాష్.
మాయ పరిచయం…
వైజాగ్ బ్రాంచ్‌లో పనిచేసే పర్సనల్ సెక్రటరీ మాయతో పరిచయం ఏర్పడింది. ఆమెతో ఒక్క రోజు ఏర్పడిన సాన్నిహిత్యం తన జీవితాన్ని తలక్రిందులు చేసిందని సుభాష్ బాధపడతాడు. తన వల్ల మాయకు ఓ బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను దుగ్గిరాల ఇంటి వారసుడిగా పెంచకపోతే మీడియా ముందుకు వచ్చి సాక్ష్యాలతో తనతో ఉన్న రిలేషన్‌షిప్‌తో పాటు బిడ్డకు సంబంధించిన నిజం బయటపెడతానని మాయ బెదిరిస్తుందని రాజ్‌తో అంటాడు సుభాష్.
ఈ నిజం బయటపెడితే ఇంట్లో ఎవరూ తట్టుకోలేరని, ఇటు మాయకు న్యాయం జరగదని సుభాష్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. నేను చచ్చిపోతే నాతోనే ఈ నిజం సమాధి అయిపోతుందని అందుకే ఉరివేసుకోవాలని అనుకుంటున్నట్లు రాజ్‌కు చెబుతాడు సుభాష్.
తండ్రి కోసం సుభాష్ త్యాగం…
తండ్రి వ్యక్తిత్వంపై ఎలాంటి మచ్చ పడకుండా మాయ బిడ్డను తన కొడుకుగా ఇంటికి తీసుకురావాలని రాజ్ అనుకుంటాడు. తండ్రి కోసం ఆ నిందను తానే మోయడానికి సిద్ధపడతాడు. తప్పు నేను చేస్తే నువ్వు శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదని రాజ్‌కు సుభాష్ సర్ధిచెబుతాడు.
కానీ రాజ్ మాత్రం వినడు. ఏం జరిగిన తనకు ఎలాంటి అవమానాలు ఎదురైన మాయ బిడ్డకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టొద్దని తండ్రి దగ్గర మాట తీసుకుంటాడు రాజ్. ఆ వీడియో ద్వారా రాజ్ దగ్గర ఉన్న బిడ్డ తండ్రి సుభాష్ అని తెలుసుకొని కావ్య షాకవుతాడు.
తండ్రి తప్పు చేశాడని తెలిస్తే…
రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సుభాష్ అంగీకరించడు. అందరికి నిజం చెబుతానని అంటాడు. నేను తప్పు చేశానని తెలిసి అమ్మ అరిచి ఊరుకుంది. అదే మీరు తప్పు చేశారని తెలిస్తే అమ్మ గుండె ఆగిపోతుందని సుభాష్‌తో అంటాడు రాజ్. అమ్మకు నిజం చెప్ప ఆమె ప్రాణాలను తీసి జ్ఞాపకాలతో బతకడం కంటే ఆమెకు దూరంగా ఉంటూ కళ్లారా చూస్తూ ఉండటమే మంచిదని తండ్రికి సర్ధిచెబుతాడు రాజ్.
నువ్వు చేసిన త్యాగాన్ని అందరూ మోసం అని అంటారు, నీ తల్లి పెంపకాన్ని తప్పు పడతారని రాజ్‌కు సర్ధిచెప్పడానికి సుభాష్ ప్రయత్నిస్తాడు. తప్పు చేసిన కొడుకునే తల్లి దూరంగా పెట్టిందని అందరూ అపర్ణ గురించి గొప్పగా చెబుతారని, తనకు ఏం జరిగిన పరవాలేదని తండ్రికి బదులిస్తాడు రాజ్. నీకు ఇంతటి ద్రోహం చేసిన ఈ తండ్రిని ఎప్పటికీ క్షమించవద్దని రాజ్‌ను కన్నీళ్లతో వేడుకుంటాడు సుభాష్.
కావ్య కన్నీళ్లు…
రాజ్ దగ్గర పెరుగుతోన్న బిడ్డ పుట్టుక వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాలని అనుకున్న కావ్యకు అసలు నిజం తెలిసినా దానిని బయటపెట్టలేని పరిస్థితి ఎదురవుతుంది. నిజం చెప్పి తప్పు చేయడం కంటే అపర్ణ నిర్ణయానికి కట్టుబడి భర్తతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికే సిద్ధమవుతుంది. అదే మాట అపర్ణకు చెబుతుంది. కావ్య త్యాగం చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు.