Fahadh Faasil: పుష్ప వల్ల నాకు ఒరిగిందేమీ లేదు.. మలయాళం సినిమానే నాకు అన్నీ: ఫహాద్ ఫాజిల్

Best Web Hosting Provider In India 2024

Fahadh Faasil: పుష్ప మూవీతో తెలుగు ప్రేక్షకులకే కాదు పాన్ ఇండియా లెవల్లోనూ పరిచయమైన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. అప్పటికే కేరళలో అతడో పెద్ద స్టార్ అయినా.. ఈ సినిమా ద్వారా అతని రేంజ్ పాన్ ఇండియా రేంజ్ కు చేరింది. అయితే ఈ సినిమా వల్ల తనకు పెద్దగా ఒరిగిందేమీ లేదని, తానేమీ పాన్ ఇండియా స్టార్ కాదని అతడు అనడం విశేషం.

పుష్ప వల్ల వచ్చిందేమీ లేదు: ఫహాద్

తాజాగా ఫిల్మ్ కంపానియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫహాద్ ఫాజిల్ ఈ పుష్ప మూవీపై స్పందించాడు. పుష్ప సినిమా వచ్చిన తర్వాత మీకు మీరు చాలా పెద్ద నటుడిగా, కేరళ హద్దులు దాటి కూడా పాన్ ఇండియా నటుడిగా మారారని అనుకుంటున్నారని అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఫహాద్ ఇచ్చిన సమాధానం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

“అలాంటిదేమీ లేదు. పుష్ప నాకు చేసిందేమీ లేదు. ఇదే విషయం సుక్కు సర్ (సుకుమార్)కు కూడా చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలో సినిమాలు చేస్తున్నాను. ఎవరినీ అగౌరవపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ ఇది నిజం. పుష్పతో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని అనుకోవడం లేదు.

పుష్ప కేవలం సుకుమార్ పై ఉన్న ప్రేమ మాత్రమే. కానీ ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళం సినిమాలు చూస్తున్నారు. అది నాలో ఉత్సాహం నింపుతోంది. అంతే తప్ప పుష్ప నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అని మాత్రం నేను అనుకోవడం లేదు” అని ఫహాద్ స్పష్టం చేశాడు.

ఫహాద్ తో కలిసి ఇంటర్వ్యూలో కూర్చోవడానికి ఓ బాలీవుడ్ నటుడు వెనుకడుగు వేశాడని, మీ రేంజ్ అదీ అని, ముఖ్యంగా పుష్ప తర్వాత మీరు ఆ స్థాయికి చేరారని అనుకుంటున్నారా అని సదరు యాంకర్ ప్రశ్నించినప్పుడు ఫహాద్ ఇలా స్పందించాడు.

రాజ్ కుమార్ రావ్, రణ్‌బీర్ బెస్ట్ యాక్టర్స్

తాను పాన్ ఇండియా స్టార్ ను కాదు అని, తాను కేవలం నటుడినే అని కూడా ఈ సందర్భంగా ఫహాద్ తేల్చి చెప్పాడు. తన వరకు రాజ్ కుమార్ రావు మంచి నటుడు అని, రణ్‌బీర్ కపూర్ దేశంలోనే అత్యుత్తమ నటుడు అని ఫహాద్ అనడం గమనార్హం. ప్రస్తుతం తాను నటించిన ఆవేశం మూవీ సక్సెస్ ను ఫహాద్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ కామెడీ యాక్షన్ డ్రామా రూ.150 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇప్పుడు అతడు పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. పుష్ప తొలి పార్ట్ సెకండాఫ్ లో ఫహాద్ ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మాత్రం అతనిది పూర్తి స్థాయి పాత్ర కానుంది.

ఫహాద్ నటనను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్, ఫహాద్ ఫేస్ టు ఫేస్ తలపడితే ఎలా ఉంటుందన్న ఆసక్తి అంతటా నెలకొంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024