Best Web Hosting Provider In India 2024
Parthu Telugu OTT: ఈ వారం ఓటీటీ ద్వారా సైకో థ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. పార్థు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్‌చేసింది. మే 9 నుంచి ఈటీవీ విన్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. పార్థు మూవీలో మైఖేల్ తంగదురై, సనమ్‌శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఎకలవ్యన్ పార్థు మూవీకి దర్శకత్వం వహించాడు.
ఓమై సెన్నై డబ్ వె ర్షన్….
తమిళ మూవీ ఓమై సెన్నై మూవీకి తెలుగు డబ్ వెర్షన్‌గా పార్ధు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓమై సెన్నై మూవీ 2021లో థియేటర్లలో రిలీజైంది. సైకో కిల్లర్ మూవీలో మైఖేల్ తంగదురై, సనమ్ శెట్టి యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్‌పై ప్రశంసలొచ్చాయి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
పార్థు మూవీ కథ ఇదే…
పార్తిబన్ (మైఖేల్ తంగదురై) ఓ డిటెక్డివ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తుంటాడు. క్రైమ్ ఇన్వేస్టిగేషన్ పేరుతో అందరిని బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు పార్తిబన్ బాస్ రత్నం. అజగప్పన్ అనే వ్యక్తితో మొదలైన గొడవల కారణంగా పార్తిబన్ జీవితం చిక్కుల్లో పడుతుంది. ప్రాణాలను నిలుపుకోవడానికి ఓ వైపు పోలీసులు, మరోవైపు గ్యాంగ్‌స్టర్స్‌తో పార్తిబన్ ఎలాంటి పోరాటం చేశాడు? ఈ పోరాటంలో పార్తిబన్‌కు అతడి ప్రియురాలు అముద (సనమ్‌శెట్టి) ఎలా అండగా నిలిచింది? పార్తిబన్, అముదల జీవితాలు చివరకు ఎలా ముగిశాయి అన్నదే పార్థు మూవీ కథ.
డీ గ్లామర్ పాత్రలో…
పార్ధు సినిమాలో సనమ్‌శెట్టి డీ గ్లామర్ పాత్రలో కనిపించింది. తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సనమ్ శెట్టి 63వ రోజు ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్‌లో గ్లామర్, లవ్ ఎఫైర్స్‌తో పాపులర్ అయిన సనమ్ శెట్టి హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఓమై సెన్నైతో రీ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి సినిమాలోనే బోల్డ్ రోల్‌లో కనిపించి అలరించింది.
తెలుగులో సంపూర్ణేష్ బాబుతో…
ఓమై సెన్నై మూవీ కంటే ముందు తమిళంలో ఇరవైకిపైగా సినిమాలు చేసింది సనమ్ శెట్టి. అంబులితో కోలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సనమ్‌శెట్టి. తోట్టల్ విడత్తు, కాథమ్ కాథమ్, థగాదు, టికెట్, అథర్వతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. తెలుగులో సంపూర్ణేష్ బాబు సింగం 123తో పాటు బ్రహ్ముమడి మానస్‌తో ప్రేమికుడు సినిమాలు చేసింది. మైఖేల్ తంగదురై హీరోగా, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్‌గా పలు తమిళ సినిమాలు చేశాడు.