ఓటు అనే అస్త్రంతో బాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలి

Best Web Hosting Provider In India 2024

ఇచ్చాపురం ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు

59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 2లక్షల 70 వేల కోట్లు అందించాం

2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం

మేనిఫెస్టోని 99 శాతం హామీలను నెరవేర్చాం

నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం

3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు 

విద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?

అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ,చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం

అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం

అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌

ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు

సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం

విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం

గ్రామస్థాయిలోనే రైతులను చేయి పట్టుకొని నడిపించే ఆర్‌బీకే వ్యవస్థ

స్వయం ఉపాధికి అండగా వాహనమిత్ర, నేతన్న నేస్తం,మత్స్యకార భరోసా

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచాం.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాం

మూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశాం

ఎగ్జిక్యూటివ్‌క్యాపిటల్‌గా విశాఖనుఉద్దాన సమస్యను పరిష్కరించాం

కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం

జూన్‌ 4న మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు

మీ బిడ్డ అధికారంలో వెంటనే మళ్లీ మొత్తం అందిస్తాం

దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ఓటర్లను ప్రలోభపెడతాడుబాబు డబ్బులిస్తే తీసుకోండి.. కానీ ఓటేసే ముందు ఆలోచించండి.

ఎవరి వల్ల మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి.

మీరు వేసే ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

 శ్రీ‌కాకుళం: సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నార‌ని, ఓటు అనే అస్త్రంతో ఆయ‌న‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యబట్టారు. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. ఈ పథకాలకు బడ్జెట్‌లో ఆమోదం కూడా తెలిపామని తెలిపారు. పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్నామ‌ని, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, భోగాపురం ఎయిర్‌పోర్టు విస్తరన పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్‌ కాలేజీలు కడుతున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ కనెక్టవిటీ పెంచామని అన్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం వైయ‌స్ జగన్‌  భారీ బహిరంగ సభ నిర్వహించారు.  

ఈ సందర్భంగా  సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే.

సమయం 3.10.. 
ఎండాకాలం..మిట్టమధ్యాహ్నం అయినా కూడా ఏమాత్రం ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతో ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్న నా ప్రతి అక్కకూ,  ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ ముందుగా మీ బిడ్డ.. మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. 

ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
మరో 5 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఈ ఎన్నికలు.నేను ప్రతిఒక్కరినీ కూడా గుర్తు గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు.. మళ్లీ మోసపోవడమే. ప్రతిఒక్కరినీ కూడా ఈ విషయాలపై ఆలోచన చేయమని కోరుతున్నాను. చంద్రబాబు చరిత్ర చెబుతున్న సత్యం ఇది అని గుర్తించమని కోరుకుంటున్నాను. సాధ్యాంకాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇది అన్నది ప్రతి ఒక్కరినీ ఆలోచించమని కోరుతున్నాను.

చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే
చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని మళ్లీ నిద్రలేపడమే. చంద్రముఖిని మళ్లీ నిద్రలేపితే ఏమవుతుంది? గతంలో జరిగినట్లు మళ్లీ ఇంటింటికీ లకలక లకలక అంటూ మీ రక్తం తాగేందుకు మళ్లీ వస్తుంది. ప్రతిఒక్కరినీ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని కోరుతున్నాను.

గ‌తంలో ఈ మాదిరిగా బ‌ట‌న్లు నొక్క‌డం చూశారా?

చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా?.
మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. దేవుడి దయతో మీరు నమ్మి మీ జగన్‌కు మీ బిడ్డకు అధికారం ఇచ్చినందువల్ల గత ఐదేళ్లలో ప్రతిఒక్క రంగంలోనూ కూడా విప్లవాత్మక మార్పులు తీసుకునిరాగలిగాం. గతంలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా, గతంలో మన రాష్ట్రంలో జరగనివిధంగా ఈ 59 నెలల కాలంలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మీ బిడ్డ నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు బటన్లు నొక్కిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగింది.

ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా ఈ 59 నెలలకాలంలోనే భర్తీ చేయడం జరిగింది. నా అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేశాం. వారి పేరుమీదనే అందులో ఏకంగా 22 లక్షల ఇళ్లుకూడా ఈ 59 నెలలకాలంలోనే కడుతున్నాం.  

గతంలో ఎప్పుడు కూడా జరగనివిధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు.. మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, ఒక భగవద్గీత, ఒక బైబిల్ అని ఆ భగవద్గీతకు విశ్వసనీయత తెచ్చి ఏకంగా 99 శాతం అమలు జరిగింది కూడా మీ బిడ్డ కాలంలోనే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

లంచాలు, వివక్ష లేని పాలన కోసం
అన్నిరకాలుగా ప్రభుత్వ బడులు మారాయి. పిల్లల చదువులు మారాయి. చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడనివిధంగా లంచాలు లేని వివక్ష లేని ఇంటివద్దకే పాలన, ఇంటివద్దకే అందిన పెన్షన్, ఇంటివద్దకే అందిన పౌర సేవలు, ఇంటివద్దకే అందిన పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే చేయిపట్టుకుని నడిపిస్తున్న వైద్యం, చేయిపట్టుకుని నడిపిస్తున్న వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని సామాజిక న్యాయం, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని మహిళా సాధికారత.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవాళ నేను ఇప్పుడు చెబుతున్న ఈ మాటలు గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా కేవలం ఈ 59 నెలలకాలంలోనే మీ బిడ్డ పాలనలో జరిగిన మార్పులు.

ఎప్పుడైనా మీరు చూశారా?
ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని కోరుతున్నాను. ఇప్పుడు నేను గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు గతంలో చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా జరిగాయా?, ఎప్పుడైనా చూశారా? అని మీరే ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎప్పుడైనా మీరు చూశారా? పిల్లల చేతుల్లో ట్యాబులు, ఎప్పుడైనా మీరు చూశారా? పిల్లల చేతుల్లో విద్యాకానుక, ఎప్పుడైనా మీరు చూశారా? పిల్లలకు గోరుముద్ద, ఎప్పుడైనా మీరు చూశారా? తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్లు, ఓ ఇంటికే రూ.3 వేల పెన్షన్ కానుక, ఓ రైతుభరోసా, ఓ ఉచిత పంటబీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఓ వాహనమిత్ర, ఓ నేతన్ననేస్తం, ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తం, 25 లక్షలదాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఓ ఆరోగ్యఆసరా, ఓ ఫ్యామిలీ డాక్టర్, ఓ ఆరోగ్య సురక్ష వంటి పథకాలు గతంలో మీరు చూశారా?.

వీటన్నింటితో పాటు ఎప్పుడైనా మీరు గతంలో చూశారా? మీ గ్రామంలోనే ఓ గ్రామ సచివాలయం, మీ గ్రామంలోనే ఓ నాడు-నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి, మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే, మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మీ గ్రామంలోనే మహిళా పోలీస్.. ఇవన్నీ రావడమే కాకుండా చెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్ నేను చెప్పినవన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా? మిమ్మల్నే అడుగుతున్నాను.

రైతన్నకు అండగా మీ బిడ్డ.
గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలను చేయిపట్టుకు నడిపిస్తూ రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఓ రైతుభరోసా, రైతన్నలకు ఉచితంగా పంటలబీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్‌పుట్ సబ్సిడీ, పగటిపూటనే రైతన్నలకు 9 గంటల ఉచిత విద్యుత్, రైతనన్ను చేయి పట్టుకుని నడిపిస్తూ ఆ గ్రామంలోనే రైతన్నకోసమే ఓ ఆర్బీకే వ్యవస్థ. ఈ మార్పులన్నీ కూడా గతంలో ఎప్పుడైనా జరిగాయా?, ఎప్పుడైనా కనబడ్డాయా? అని అడుతున్నాను. 


స్వయంఉపాధికి తోడు నిలుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం
స్వయం ఉపాధికి ఏ ప్రభుత్వమూ ఎప్పుడూ తోడు నిలవనంతగా మీ బిడ్డ ప్రభుత్వం స్వయం ఉపాధికి అండగా నిలబడుతూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్ననేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ ఓ తోడు, ఓ చేదోడు,  లాయర్లకు కూడా లానేస్తం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయా? చూసారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

వీటన్నింటికీ తోడు ఏగ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తూ ఓ గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది.  60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అక్కడే కనిపిస్తాయి. అదే గ్రామంలోనే ఒక ఆర్బీకే. ఆ పక్కనే  ఆర్బీకే నుంచి నాలుగు అడుగులు వేస్తే ఓ విలేజ్‌ క్లినిక్‌, అక్కడి నుంచి మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు  నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి.  గ్రామానికే  ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఓ దిశ యాప్.. ఇటువంటివన్నీ గతంలో ఉన్నాయా? ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  

ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి..
మూడు జిల్లాల‌ను ఆరు జిల్లాల‌ను చేసింది మీ బిడ్డ ప్ర‌భుత్వ‌మే. పేద‌వాడి వ‌ద్ద‌కు ప‌రిపాల‌న తీసుకువ‌చ్చింది మీ బిడ్డ పాల‌న‌లోనే. మూడు రాజధానుల్లో విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేస్తున్నాం. జూన్‌4న మీ బిడ్డ విశాఖ‌లోనే ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని గ‌ర్వంగా చెబుతున్నాను. ఇదే శ్రీ‌కాకుళంలో గ‌తంలో ఎప్పుడు జ‌ర‌గ‌ని విధంగా, చూడ‌ని విధంగా రూ.4400 కోట్ల‌తో  పోర్టు నిర్మాణం జ‌రుగుతుంది. రెండు ఫిషింగ్ హార్జ‌ర్లు వ‌స్తున్నాయి. షిష్ ల్యాండింగ్ సెంట‌ర్ వ‌స్తుంది. భోగాపురం ఎయిర్‌పోర్టు ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఆదాని డేటా సెంట‌ర్‌, ఇన్ఫోసిస్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ద‌శాబ్ధాలుగా ఉన్న ఉద్ధానం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తూ ఏకంగా రూ.780 కోట్లు ఖ‌ర్చు చేస్తూ ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చింది మీ బిడ్డ కాదా? ఏకంగా రూ.80 కోట్ల‌తో కిడ్నీ ఆసుప‌త్రి రిసెర్చ్ సెంట‌ర్ నిర్మించింది మీ బిడ్డ కాదా?. కొత్త‌గా ఉత్త‌రాంధ్ర‌లో 4 మెడిక‌ల్ కాలేజీలు క‌డుతున్నాం. జెన్‌టీయూ విజ‌య‌న‌గ‌రంలో విశ్వ‌విద్యాల‌యం, సాలూరులో యూనివ‌ర్సిటీ, కురుపాంలో ఐటీడీఏ నిర్మిస్తున్నాం. ఇదంతా మీ బిడ్డ పాల‌న‌లో కాదా?. 

మారుమూల గిరిజ‌న ప్రాంతాల్లో ఏకంగా 400 ట‌వ‌ర్లు ఏర్పాటు చేసి సెల్‌ఫోన్ల క‌నెక్టివిటీ ఇచ్చింది మీ బిడ్డే. ఏకంగా 1.03 ల‌క్ష‌ల మందికి మేలు చేస్తూ డీకేటీ ప‌ట్టాలు ఇస్తూ వారంద‌రికీ రైతు భ‌రోసా సొమ్ము ఇస్తూ జీవ‌నోపాధి క‌ల్పిస్తున్న‌ది మీ బిడ్డ పాల‌న‌లోనే అని గ‌ర్వంగా చెబుతున్నాను.విద్యా, వైద్య రంగంలో తీసుకువ‌చ్చిన మార్పుల‌తో ప‌దికాల‌ల పాటు అభివృద్ధికి బాట‌లు వేస్తోంది. ఈ రోజు నుంచి 15 ఏళ్ల త‌రువాత ఎలా ఉంటుందో ఆలోచ‌న చేయండి. ఈ రోజు 1వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న మ‌న పిల్లాడు ఐబీ సిల‌బ‌స్‌తో ఇంగ్లీష్ మీడియంతో డిజిట‌ల్ పాఠాల‌తో 2035లో ఐబీ ప‌రీక్ష‌లు రాస్తాడు. డిగ్రీల్లో 30 శాతం కోర్సులు ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీల నుంచి స‌ర్టిఫికెట్లు తీసుకుంటాడు. అన‌ర్గ‌ళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉద్యోగాల‌కు వెళ్తే ఎలా ఉంటుందో ప‌రిస్థితి ఆలోచ‌న చేయండి.  ప్రతిఒక్కరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించి గమనించమని కోరుతున్నాను. 

చంద్ర‌బాబు పేరు చెబితే గుర్తుకు వ‌చ్చే ఒక్క మంచైనా ఉందా?
14 ఏళ్లు సీఎంగా ప‌ని చేసిన వ్య‌క్తి చంద్ర‌బాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ గుర్తుకు వ‌స్తుందా? . ఏ పేద‌వాడికి కూడా చంద్ర‌బాబు చేసిన ఒక మంచి కూడా గుర్తుకు రావ‌డం లేదు. ఆయ‌న ఏ స్థాయిలో మోసం చేశాడో గ‌మ‌నించండి. అధికారంలోకి వ‌చ్చేదాకా అబ‌ద్ధాలు
2014లో ఒకసారి చంద్రబాబును నమ్మారు, ఆ కూటమిని నమ్మారు, వారి మేనిఫెస్టోను నమ్మారు, వారికి ఓటు వేశారు. మరి చంద్రబాబు నాయుడి గారి మేనిఫెస్టో మాయలు, మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఆ 2014లో ఏం చెప్పాడో? 2014 నుంచి 2019 మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసం, ఎంతటి దగా చేశాడో మీరే చూడండని ఈ సందర్భంగా అడుగుతున్నాను. 

ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) అక్కా ఇది గుర్తుందా? అన్నా ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి 2014లో ఎన్నికలవేళ పంపించాడు. నేను మిమ్మల్నే అడుగుతున్నా. ఈ ముఖ్యమైన హామీలను ఈయన సంతకం పెట్టి పంపించిన హామీలను ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఆయన చేశాడా అని అడుగుతున్నాను. మీరే సమాధానం చెప్పండని అడుగుతున్నాను. అప్పట్లో గుర్తున్నాయా? వారి ఈ హామీలను ఇవ్వడమే కాకుండా, వారు సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపించడమే కాకుండా అప్పట్లో వారి ఈటీవీలో, వారి ఏబీఎన్‌లో, వారి టీవీ5లో అడ్వర్టైజ్‌ మెంట్‌లు ఊదరగొట్టారు గుర్తుందా?.

అప్పట్లో వారు చెప్పినమాటలు రైతురుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతున్నాను. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ఇందులో ముఖ్యమైన హామీ అంటూ.. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి పంపించిన ఈ ఫాంప్లెట్‌లో రెండోది.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను ప్రతి అక్కచెల్లెమ్మను, వారి కుటుంబాలను అడుగుతున్నా.. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయైనా రద్దు అయ్యిందా? అని అడుగుతున్నా. మూడో హామీ.. ఇవన్నీ ముఖ్యమైన హామీలు.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతున్నాను.. మీలో ఏ ఒక్కరిలో అయినా కూడా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా? అని అడుగుతున్నాను. 

నాలుగో హామీ.. ఇంటింటికీ ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెలా రూ.2,000 నిరుద్యోగ భృతి అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఎవ్వరికైనా ఇచ్చాడా? రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు, చేనేత పవర్‌ లూమ్‌ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు.

ఇక్కడున్న ప్రజలందరినీ అడుగుతున్నా…మీలో ఎవ్వరికైనా ఒక్క సెంటు స్థలం అయినా చంద్రబాబు ఇచ్చాడా? విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు అన్నాడు, సింగపూరుకు మించి అభివృద్ధి అన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ అన్నాడు, ఇచ్చాపురంలో కనిపిస్తోందా? ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ఇంటింటికీ పంపిన వీటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మవచ్చా అని ప్రజలు చెప్పాలి. ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురూ మళ్లీ మేనిఫెస్టో అని, ఈసారి సూపర్‌ సిక్స్‌ అని, సూపర్‌ సెవెన్‌ అని అంటున్నాడు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం, ఇంటింటికీ బెంజికారు కొనిస్తాం అంటున్నాడు..నమ్ముతారా? ఇలాంటి అన్యాయమైన మోసాలతో, అబద్ధాలతో మనం యుద్ధం చేస్తున్నాం. 

ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్రలు.
మామూలుగా     ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు ఢిల్లీతో కలిసి ఏ స్ధాయిలో కుట్రలు పన్నుతున్నారో మీరే చూడండి.
అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ ను దగ్గరుండి వీళ్లే రాకుండా చేశారు. ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు నేరుగా ఇంటికి పెన్షన్ పంపిస్తున్నాడు. ఎన్నికలకు రెండు నెలలు ముందు చంద్రబాబు కుట్రలు పన్ని.. అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా చేస్తే.. ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే చివరలో బటన్లు నొక్కాడో.. ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్కచెల్లెమ్మలకు రాకుండా ఢిల్లీ వాళ్లలో వీళ్లంతా కుట్రలు చేస్తూ… అడ్డుకునే కార్యక్రమం చేస్తుంటే.. సాక్షాత్తూ మీ జగన్ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్ధితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి.

ఇవాళ మీ జగన్ బటన్ నొక్కిన పథకాలన్నీ కేవలం ఎన్నికలు వస్తున్నాయని  కొత్తగా నొక్కినవి కాదు. జగన్ నొక్కినవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జగన్ బటన్ నొక్కుతూ, నొక్కతూ ఉన్న పథకాలకే మల్లీ బటన్ నొక్కాడు. ఈ స్కీమ్ లు కొత్తగా వచ్చినవి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవి.
మరి అటువంటివి 60 నెలల కథ దేవుడెరుగు.. .587నెలలు కాకముందు జగన్ ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని.. ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థిలలోకి వీళ్లు దిగజారిపోయారు.

నేను ప్రతి అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబ సభ్యులకు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు వస్తుందో, మొట్టమొదటిసారిగా మీ జగన్ ఏకంగా ఒక కేలండర్ ఇచ్చి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పాలన జరిగింది కేవలం మీ బిడ్డ హయాంలోనే. 

మరి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు కేలండర్ లో చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇస్తూ పోతున్న మీ జగన్ ను ఇబ్బంది పెట్టడానికి..  చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరు కుంటారా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
 ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు నాయుడికి ఆయన చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని మీబిడ్డగా గట్టిగా కోరుతున్నాను. 
మీ బిడ్డగా మాట చెబుతున్నాను.. ఆ దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4 న అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వారంలో రోజుల్లోనే ఈ బటన్లు అన్నీ క్లియర్ చేస్తాడు. ప్రతి ఒక్కరినీ ఒక్కటే గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.

కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు మీ జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు. గతంలో చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీ జగన్ కన్నా ముందు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అయినా ఏ రోజూ చంద్రబాబు ప్రజల కోసం, అక్కచెల్లెమ్మల కోసం బటన్లు నొక్కలేదు. ఏ ఒక్క అక్కచెల్లెమ్మకూ డబ్బులిచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏ పథకమూ లేదు. 
కానీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో 130 బటన్లు నొక్కాడు. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపాడు. కాబట్టే మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులేదు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ప్రజలను పేదలను లోబర్చుకునేందుకు ఎన్నికల రోజు రూ.2, రూ.3 కొన్ని కొన్ని చోట్ల రూ.4, రూ.5 వేలు కూడా ఇస్తాడు. ప్రతి ఒక్కరికీ ఒక్కటే చెబుతున్నాను. చంద్రబాబు ఎన్నికల రోజు ఇచ్చే డబ్బంతా మనదే. మన దగ్గర దోచేసిన డబ్బు. కాబట్టి ఆయన ఇస్తే ఓ ఒక్కరూ వద్దుఅనొద్దు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకొండి.

ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. కేవలం క్లాస్ వార్ జరుగుతుంది. పేదవాడు ఒకవైపు పెత్తందార్లు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతుంది. మీరు ఓటే వేసే ముందు మీ ఇంట్లో ఉన్న భార్య, అవ్వాతాతలు, ఆడపడుచులు, పసిపిల్లల అభిప్రాయం కూడా తెలుసుకొండి. ఆ తర్వాత ఎవరి వల్ల, ఏ ప్రభుత్వం 
మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగింది.. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మాత్రమే మీరు వేసే ఓటుని డిసైడ్ చేసేటట్టుగా పెట్టుకోమని కోరుతున్నాను. ఈ విషయం చెప్పడం చాలా అవసరమని కచ్చితంగా చెబుతున్నాను.

 
మీ అందరితో నేను కోరేది ఒక్కటే. జరగబోతున్న కురుక్షేత్రయుద్ధంలో 175 కు 175 అసెంబ్లీ స్ధానాలు, 25 కి 25 ఎంపీ స్ధానాలు గెలవాలి. ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీలు లేదు. సిద్ధమైనా 

ఇక్కడో, అక్కడో, ఎక్కైడో మన గుర్తు తెలియని వాళ్లు ఉంటే.. అన్నా మన గుర్తు ఫ్యాను. చెల్లి మన గుర్తు ఫ్యాను. మంచి చేసే ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసే సైకిల్ ఎక్కడ ఉండాలి. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుడాలి. సింక్ లోనే ఉండాలి.ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. 

 
మన పార్టీ తరపున బరిలో ఉన్న వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను  ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ చేతులు జోడించి పేరు పేరునా ప్రార్దిస్తున్నాను అని చెబుతూ సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. 
 

Best Web Hosting Provider In India 2024