చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

Best Web Hosting Provider In India 2024

 వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి  

తాడేప‌ల్లి:  ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను అడ్డుకుంటున్న చంద్ర‌బాబు తక్ష‌ణ‌మే ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని  వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి  డిమాండు చేశారు. రైతులకు  ఇచ్చే  ఇన్పుట్  సబ్సిడీ,చేయూత,ఆసరా,విద్యాదీవెన పధకాలను  చంద్రబాబు  ఆపించారని మండిప‌డ్డారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో  వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి  మీడియాతో మాట్లాడారు.

  • గత  ఐదేళ్లుగా  జగన్ గారు ఇన్ పుట్ సబ్సిడీ  ఇస్తుంటే బాబు అడ్డుకున్నారు.
  • వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు….రైతు  వ్యతిరేకి  అని  మరోసారి  రుజువు  చేసుకున్నారు 
  • ప్రజలకు ఈ పధకాలను అడ్డుకోవడంపై చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
  • అదికారం కోసం మళ్ళీ   కుట్రలకు  చంద్రబాబు తెర  తీశారు.
  • చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా దిగజారతాడు.
  • ప్రజలు చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల నాటకాలను గమనిస్తున్నారు.
  • ఎన్నికలలో వారికి తగిన బుధ్ది చెప్పేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
  • చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ఓటమి ఖాయం అవడంతో ప్రస్టేషన్ లో ఏం చేస్తున్నారో అర్దం కాకుండా ఉంది.
  •  

Best Web Hosting Provider In India 2024