Best Web Hosting Provider In India 2024
Jai Ganesh OTT: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మలయాళం మూవీ జై గణేష్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సూపర్ హీరో మూవీ రెండు ఓటీటీలలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. మనోరమ మ్యాక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జై గణేష్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. మనోరమ మ్యాక్స్‌లోకేవలం మలయాళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కాబోతుండగా….అమెజాన్ ప్రైమ్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో జై గణేష్ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మే 17 లేదా 24న జై గణేష్ ఓటీటీలోకి రానున్నట్లు తెలిసింది.
ఉన్ని ముకుందన్ ప్రొడ్యూసర్…
జై గణేష్ మూవీలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు ఉన్ని ముకుందన్. అతడు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన మూడో మూవీ ఇది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి రంజిత్ శంకర్ దర్శకత్వం వహించాడు. జై గణేష్‌లో మహిమా నంబియార్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు.
జై గణేష్ కథ ఇదే…
గణేషన్ (ఉన్ని ముకుందన్) గ్రాఫిక్స్ ఆర్టిస్ట్. ఓ యాక్సిడెంట్ కారణంగా వీల్‌ఛైర్‌కు పరిమితమవుతాడు. ఎమ్మెల్యే కొడుకు అయాన్ మిస్సవుతాడు. పోలీసులకు సవాల్‌గా ఆ కేసు మారుతుంది. అనుకోకుండా ఆ కేసులో గణేషన్ ఇన్వాల్స్ అవ్వాల్సివస్తుంది. పోలీసులకు సవాల్‌గా మారిన ఈ కేసును గణేషన్ ఎలా సాల్వ్‌చేశాడు. ఎమ్మెల్యే కొడుకును కిడ్నాప్ చేసింది ఎవరు? అవిటితనం కారణంగా గణేషన్ ఎలా ఇబ్బందులు పడ్డాడు? ఈ ప్రయాణంలో అతడికి నిధి (మహిమా నంబియార్) ఎలా అండగా నిలిచింది అన్నదే జై గణేష్ మూవీ కథ.
మిక్స్‌డ్ టాక్…
ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఉన్ని ముకుందన్ యాక్టింగ్‌కు మంచి పేరొచ్చింది.
మలయాళంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చేశాడు ఉన్ని ముకుందన్. 2022లో అతడు హీరోగా నటించిన మాలికాపురం మూవీ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం గెట్ సెట్ బేబీ పేరుతో రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తోన్నాడు ఉన్ని ముకుందన్.
తెలుగులో నాలుగు సినిమాలు…
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఉన్నిముకుందన్. ఈ సినిమాలో మోహన్‌లాల్ కొడుకుగా నెగెటివ్ షేడ్స్ రోల్‌లో కనిపించాడు. అనుష్క భాగమతిలో హీరోగా నటించాడు. రవితేజ ఖిలాడీ, సమంత యశోద సినిమాల్లో విలన్ పాత్రలు చేశాడు. తెలుగులో ఇప్పటివరకు ఉన్ని ముకుందన్ నాలుగు సినిమాలు చేశాడు. హీరోగా, ప్రొడ్యూసర్‌గానే కాకుండా సింగర్‌గా పలు మలయాళం సినిమాల్లో ఉన్ని ముకుందన్ పాటలు పడాడు.