Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ సినిమా కలెక్షన్ల జోరు.. తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా..

Best Web Hosting Provider In India 2024

Krishnamma Day 3 Collections: టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన కృష్ణమ్మ సినిమా ముందు నుంచి మంచి హైప్ తెచ్చుకుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టీజర్, ట్రైలర్ మంచి క్యూరియాసిటీని పెంచాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి హాజరవడం కూడా ఈ చిత్రానికి మంచి ప్రమోషన్లను తెచ్చిపెట్టింది. మే 10వ తేదీన కృష్ణమ్మ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లను సాధించి దూకుడు చూపింది.

మూడు రోజుల కలెక్షన్లు ఇవే

కృష్ణమ్మ సినిమా మూడో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.3.6 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మే 13) అధికారికంగా వెల్లడించింది. “కృష్ణమ్మ బాక్సాఫీస్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‍గా రూ.3.6 కోట్ల గ్రాస్ వచ్చింది” అని ఈ చిత్రాన్ని నిర్మించిన అరుణాచల క్రియేషన్స్ ట్వీట్ చేసింది.

కృష్ణమ్మ మూవీకి తొలి రోజు రూ.కోటి గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే, టాక్ బాగుండటంతో రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. రెండో రోజు ఈ చిత్రానికి రూ.1.24 కోట్ల వసూళ్లు దక్కాయి. మూడో రోజు రూ.1.36 కోట్ల కలెక్షన్లు దక్కాయి. దీంతో ఓపెనింగ్ డే కంటే మూడో రోజే ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చాయి.

కృష్ణమ్మ సినిమాకు వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. విజయవాడ బ్యాక్‍డ్రాప్‍లో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని సమర్పించడం కూడా ఇంట్రెస్ట్ కలిగించింది.

కృష్ణమ్మ మూవీలో సత్యదేవ్ హీరోగా నటించగా లక్ష్మణ్ మీసాల, అర్చన, అతీరా రాజ్, కృష్ణ బురుగుల, రఘు కుంచె, నందగోపాల్, సత్యం కీలకపాత్రలు పోషించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాలభైరవ ఈ మూవీకి సంగీతం అందించారు.

కృష్ణమ్మ సినిమా చాలాసార్లు వాయిదాలు పడుతూ వస్తోంది. సుమారు రెండేళ్ల పాటు ఈ చిత్రం రూపొందింది. అయితే, ఎట్టకేలకు మే 10న రిలీజై మంచి కలెక్షన్లను దక్కించుకుంది.

కృష్ణమ్మ స్టోరీ లైన్

భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్), శివ (కృష్ణ బురుగుల) అనాథలుగా పెరుగుతూ.. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. విజయవాడలో భద్ర, కోటీ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అయితే, ఓసారి పోలీసులకు పట్టుబడతారు. అలాగే.. ఓ పెద్ద తీవ్రమైన కేసులో ఇరుక్కుంటారు. దీంతో ఏకంగా వారికి 14ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. వారు ఇరుక్కున్న కేసు ఏంటి.. వారిని ఎవరు టార్గెట్ చేశారన్న అంశాలు కృష్ణమ్మ మూవీలో ప్రధానంగా ఉంటాయి. యాక్షన్ రోల్‍లో సత్యదేవ్ యాక్టింగ్‍కు ప్రశంసలు దక్కాయి. మిక్స్డ్ టాక్ వచ్చిన పెద్దగా పోటీ లేకపోవటం, యాక్షన్ ఆకట్టుకునేలా ఉండటంతో తొలి మూడు రోజులు ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024