Telangana Temples Tour : తెలంగాణ టెంపుల్స్ టూర్, 24 గంటల్లో 5 ప్రముఖ దేవాలయాల సందర్శన

Best Web Hosting Provider In India 2024

Telangana Temples Tour : తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలను రెండ్రోజుల్లో దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ టూరిజం. కాకతీయుల కాలం నాటి ఆలయాలైన కాళేశ్వరం, రామప్ప, వెయ్యి స్తంభాల గుడి, యాదగిరిగుట్ట, కీసరగుట్ట అతి తక్కువ ధరలో దర్శించుకోచ్చు. తెలంగాణ టెంపుల్ టూర్(కాకతీయ రీజియన్)పేరుతో ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ కోడ్ ద్వారా ప్రతి శనివారం, ఆదివారం టూర్ ప్యాకేజీ అందిస్తున్నారు.

టారిఫ్ :

  • పెద్దలకు- రూ.2999
  • పిల్లలకు- రూ.2399

నాన్-ఏసీ హైటెక్ కోచ్ లో ప్రయాణం, కాళేశ్వరం హరిత హోటల్‌లో ఫ్రెష్ అప్ ఉంటుంది. దర్శనం టికెట్లు, ఆహారం ఈ ప్యాకేజీలో మినహాయింపు ఉంటుంది.

డే 1 – 09:30 PM – సీఆర్వో బషీర్‌బాగ్ నుంచి బస్సు బయలుదేరుతుంది. (ఫోన్:9848540371)

  • 10:00 PM యాత్రి నివాస్ నుంచి కాళేశ్వరం బయలుదేరుతుంది.

డే-2 – 05.00 AM – కాళేశ్వరం చేరుకుంటారు.

  • 05.00 AM నుంచి 07.00 AM వరకు – కాళేశ్వరం ఆలయ దర్శనం
  • 07.00 AM – కాళేశ్వరం నుంచి రామప్పకు బయలుదేరతారు.
  • 09.00 AM నుంచి 11.00 AM వరకు – రామప్ప వద్దకు చేరుకుంటారు. అక్కడ టిఫిన్ చేసి, ఆలయం దర్శనానికి వెళ్తారు.
  • 11.00 AM – రామప్ప నుంచి బస్సు వరంగల్‌కు బయలుదేరుతుంది.
  • 12.30 PM నుంచి మధ్యాహ్నం 02.30 PM వరకు – వరంగల్ చేరుకుని హరిత హోటల్‌లో భోజనం చేస్తారు.
  • 02.30 PM – హన్మకొండ నుంచి యాదగిరిగుట్టకు బస్సు బయలుదేరుతుంది.
  • 04.30 PM నుంచి 06.00 PM – యాదగిరిగుట్ట చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సందర్శనం ఉంటుంది. ట
  • 06.00 PM – యాదగిరిగుట్ట నుంచి కీసరగుట్టకు బయలుదేరతారు.
  • 07.15 PM నుంచి 08.00 PM – కీసరగుట్ట ఆలయం చేరుకుని దర్శనం చేసుకుంటారు.
  • 08.00 PM – కీసరగుట్ట నుంచి హైదరాబాద్‌కు బయలుదేరతారు.
  • 09.00 PM – హైదరాబాద్ చేరుకుంటారు.

తెలంగాణ టెంపుల్ టూర్(కాకతీయ రీజియన్) పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

వరంగల్ రామప్ప హెరిటేజ్ టూర్

తెలంగాణ టూరిజం ప్రతి శనివారం హైదరాబాద్ నుంచి వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్ అందిస్తోంది. ఏసీ మినీ కోచ్ బస్సులో ఈ హెరిటేజ్ టూర్ ఉంటుంది.

టారిఫ్ : పెద్దలకు రూ.3449, పిల్లలకు -రూ.2759

పర్యటన వివరాలు : హైదరాబాద్-వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్

1వ రోజు (శనివారం) :

  • 7:00 AM- సమాచార రిజర్వేషన్ కార్యాలయం, యాత్రి నివాస్, సికింద్రాబాద్ నుంచి ఏసీ బస్సు బయలుదేరుతుంది.
  • 8:30 AM – భువగిరికోట సందర్శన
  • 9:00 AM- యాదగిరిగుట్ట హరిత హోటల్ బ్రేక్ ఫాస్ట్
  • 9:45 AM- యాదగిరిగుట్ట ఆలయంలో లక్ష్మీ నర్సింహ స్వామి దర్శనం చేసుకుంటారు.
  • 10:30 AM – యాదగిరిగుట్ట నుంచి బస్సు బయలుదేరుతుంది
  • 11:00 AM నుంచి 11:30 AM వరకు – జైన దేవాలయం (డ్రెస్ కోడ్ వర్తిస్తుంది), ఆర్కియాలజికల్ సైట్ మ్యూజియం సందర్శిస్తారు.
  • 12:00 PM – పెంబర్తి వద్ద బ్రీఫ్ స్టాప్ – షాపింగ్
  • 1:30 PM -హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు.
  • 1:30 PM నుంచి 4:00 PM వరకు – హోటల్ లో చెక్-ఇన్, భోజన విరామం, విశ్రాంతి సమయం.
  • 4:00 PM నుంచి 8:30 PM వరకు – వెయ్యి స్తంభాల గుడి, భద్రకల్లి ఆలయం, వరంగల్ కోట, ఫోర్ట్ సౌండ్ లైట్ షో సందర్శన
  • 9:00 PM- హోటల్‌కి తిరిగి చేరుకుని డిన్నర్ చేసి, రాత్రి బస ఉంటుంది.

2వ రోజు (ఆదివారం) :

  • 8:00 AM – బ్రేక్ ఫాస్ట్ చేసి, హరిత హోటల్ (వరంగల్ నుంచి పర్యాటకులు ఆదివారం కూడా చేరవచ్చు)
  • 10:00 AM నుంచి 1:00 PM – రామప్ప ఆలయ సందర్శన, బోటింగ్, భోజనం
  • 2:00 PM నుంచి 3:00 PM – బోటింగ్ సహా లఖ్నవరం సందర్శన
  • 3:00 PM- లఖ్నవరం నుంచి బయలుదేరతారు.
  • 3:20 PM నుంచి 3:35 PM – జంగన్‌పల్లి వద్ద టీ బ్రేక్
  • 5:00 PM – హన్మకొండలోని హరిత హోటల్‌కు చేరుకుంటారు. (వరంగల్ లో టీ, స్నాక్స్ ఉంటాయి)
  • 5:30 PM -వరంగల్ నుంచి బయలుదేరుతారు
  • 9:00 PM – సికింద్రాబాద్‌ లోని యాత్రినివాస్, చేరుకుంటారు.

టారిఫ్ : పెద్దలకు రూ.3449, పిల్లలకు రూ.2759

టూర్ ఆహారం, దర్శనం, బోటింగ్ టిక్కెట్‌లను మినహాయింపు ఉంటుంది.

రామప్ప హెరిటేజ్ టూర్ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTourismTourist PlacesTemplesYadadri TempleTelangana TourismHyderabadWarangal
Source / Credits

Best Web Hosting Provider In India 2024