Aranmanai 4 Collection: యావరేజ్ టాక్‌తో దుమ్ముదులుపుతున్న తమన్నా హారర్ మూవీ అరణ్మనై 4.. ఎన్ని కోట్లో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Aranmanai 4 Worldwide Collection: తమిళ పాపులర్ యాక్టర్, డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించిన అరణ్మనై 4 సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద సూపర్ జోరు చూపిస్తోంది. ఇండియాలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. Sacnilk.com ప్రకారం ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 18 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇప్పుడు అంటే రెండో వీకెండ్‌కు ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ కంప్లీట్ చేసుకును మరింత దూకుడుగా ముందుకు పోతోంది. తెలుగులో అరిగిపోయిన హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తమిళంలో మాత్రం జోరు చూపిస్తోంది. ఈ సినిమాను తమిళ ఆడియెన్స్ ఎగబడి చూస్తున్నారు.

కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ దక్కలేదు. మొదటి వారంలో రూ. 2.8 కోట్ల రేంజ్‌లో గ్రాస్ అందుకున్న ఈ సినిమా 3 రోజుల్లో రూ. 75 లక్షల గ్రాస్ అందుకుంది. పది రోజుల్లో తెలుగులో రూ. 3.55 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకోగా రూ. 1.8 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. రూ. 2.5 కోట్ల రేంజ్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకా రూ. 70 లక్షల మార్క్ అందుకోవాల్సి ఉంది.

అరణ్మనై 4 సినిమా పది రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే.. తమిళనాడులో రూ. 41.60 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 3.55 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.95 కోట్లు, ఓవర్సీస్‌లో 5.10 కోట్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్‌గా రూ. 54.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, రూ. 26.25 కోట్ల షేర్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.

బాక్సాఫీస్ బరిలోకి రూ. 18 కోట్ల రేంజ్ టార్గెట్‌తో బరిలోకి దిగిన అరణ్మనై 4 ఇంకా రూ. 8.25 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. ఇంకా లాంగ్ రన్‌లో మరింత లాభాలు అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

సుందర్ సి. డైరెక్ట్ చేసిన అరణ్మనై 4 చిత్రంలో సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా, వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, యోగి బాబు, జయప్రకాష్, కెఎస్ రవికుమార్, కోవై సరళ, విటివి గణేష్, ఢిల్లీ గణేష్, రాజేంద్రన్, సింగంపులి తదితరులు నటించారు.

మొదట ఈ సినిమాను ఏప్రిల్ 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ వేసవి సెలవుల్లో రిలీజ్ చేస్తే థియేటర్ ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుదన్న కారణంతో మే 3న రిలీజ్ చేశారు. అవనీ సినీమాక్స్ పతాకంపై ఖుష్బూ సుందర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది అరణ్మనై సినిమా సిరీస్‌లో నాలుగో చిత్రంగా వచ్చింది. ఇది 2021 లో విడుదలైన అరణ్మనై 3 కు సీక్వెల్. కాగా తెలుగులో బాక్ టైటిల్‌తో రిలీజ్ చేశారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024