Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వదులుకున్న నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తన కెరీర్లో సాధించినవి తక్కువ విజయాలే అయినా.. ఓ స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందంలాంటి చాలా కొన్ని సినిమాలే అతనికి మంచి పేరు సంపాదించి పెట్టాయి. గత మూడు సినిమాలైతే డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అయితే విజయ్ తన కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయన్న విషయం మీకు తెలుసా?

విజయ్ వదులుకున్న సినిమాలు ఇవే

విజయ్ దేవరకొండ కొన్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాలతోపాటు మరికొన్ని తన తెలుగు హిట్స్ హిందీ రీమేక్స్ కూడా వద్దన్నాడు. ఈ రీమేక్స్ లో అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ లాంటివి ఉన్నాయి. వీటిలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ మంచి హిట్ సాధించింది. ఇవే కాకుండా తెలుగులో అతడు వదులుకున్న కొన్ని సినిమాలు ఇతర హీరోలకు వరంగా మారాయి.

ఆర్ఎక్స్ 100

ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇందులో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నటించారు. అయితే ఈ ఆఫర్ మొదట విజయ్ కే వెళ్లినా అతడు మాత్రం వదులుకున్నాడు. అర్జున్ రెడ్డి పాత్రలాగే ఉందంటూ విజయ్ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. విజయ్ తోపాటు ఈ సినిమాను శర్వానంద్ కూడా మరీ బోల్డ్ గా ఉందంటూ వద్దని చెప్పాడట.

నితిన్ భీష్మ

నితిన్ నటించిన భీష్మ కూడా మంచి హిట్ సాధించింది. రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా స్క్రిప్ట్ విజయ్ కు నచ్చలేదట. దీంతో అతడు వదులుకున్నాడు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా నితిన్ కెరీర్లో మరో హిట్ గా నిలిచింది. సేంద్రీయ సాగు ప్రాముఖ్యతను చాటే సినిమా ఇది.

ఇస్మార్ట్ శంకర్

ఇక విజయ్ వదులుకున్న మరో సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రామ్ పోతినేనికి చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందించింది. మూవీలో అతడు డ్యుయల్ రోల్ పోషించాడు. ఇదే విజయ్ కూడా ఈ సినిమాను నిరాకరించడానికి కారణంగా తెలుస్తోంది. అప్పుడా సినిమా వద్దనుకున్నా.. తర్వాత ఈ ఇద్దరూ లైగర్ తీశారు. అయితే అది విజయ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఉప్పెన

తెలుగులో భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన లవ్ స్టోరీ ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెసైంది. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబుకు నేషనల్ అవార్డు కూడా సాధించి పెట్టింది. కానీ ఇలాంటి సినిమాను కూడా విజయ్ వద్దన్నాడు.

ఈ సినిమా కథను అంతకు చాలా రోజుల ముందే విజయ్ కు బుచ్చిబాబు చెప్పాడు. అప్పటికి అతడు ఇండస్ట్రీలో అంతగా పేరు సంపాదించలేదు. అయితే ఈ సినిమాను తీసే సమయానికి విజయ్ స్టార్ హీరోగా మారిపోవడంతో ఈ స్క్రిప్ట్ అతని స్థాయికి తగినట్లుగా లేదనిపించింది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024