AP EAPCET 2024: రేపే ఏపీ ఈఏపీ సెట్ 2024, ఏర్పాట్లు పూర్తి చేసిన జేఎన్‌టియూ-కే, 3.61లక్షల మంది దరఖాస్తు

Best Web Hosting Provider In India 2024

AP EAPCET 2024: ఆంధ్రప్రదేశ్‌ ఈ ఏపీఈఏపీ సెట్-2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈఏపీ సెట్‌ నిర్వహ ణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేఎన్టీయూ కాకినాడ వీసీ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు.

ఈఏపీసెట్‌ నిర్వహణపై కాకినాడలో జేఎన్టీ‍యూ అధికారులు సెట్ కన్వీనర్, కో కన్వీనర్లు, కోఆర్డినేటర్లతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈఏపీసెట్‌ నిర్వహణను ఏపీలో 47 కేంద్రాల్లో, హైదరాబాద్ ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లోని రెండు సెంటర్లలో కామన్‌ ఎంట్రన్స్‌ నిర్వహిస్తున్నారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగానికి 18 నుంచి 23 వరకు పరీక్షల నిర్వహిస్తారు. ఇంజినీ రింగ్ విభాగంలో 2,73,010 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 87,419 మంది, రెండు విభాగాల్లో కలిపి 1,211 మంది ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. మొత్తం 3,61,640 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్ధులకు ఏదైనా సందేహాలు ఉంటే 0884-2359599, 2342499 నంబర్లలో సంప్రదించవచ్చని వీసీ తెలిపారు.

ఏపీ ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌లో ఈఏపీ సెట్ 2024 నిర్వహిస్తోంది. ఇప్పటికే హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణను ఈ ఏడాది జేఎన్‌టియూ కాకినాడ నిర్వహిస్తోంది.

హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేయడానికి ఈ లింకును అనుసరించండి. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallticket.aspx

మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ , అనుబంధ కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్-2024 నిర్వహిస్తున్నారు.

మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈఏపీ సెట్‌(AP EAPCET Applications) దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది.

ఈఏపీ సెట్ నిర్వహణకు ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంజినీరింగ్ విభాగంలో ఆన్‌లైన్ పరీక్షలు మే 18 నుంచి మే 22 వరకు జరగాల్సి ఉంది. దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మే 23 తేదీన కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రకటించారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో పరీక్షలు మే 16,17 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీలో మే 13న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఈఏపీ సెట్‌ షెడ్యూల్‌ను మార్చిన సంగతి తెలిసిందే.

ఏపీ ఈఏపీసెట్ కు ఆలస్య రుసుము రూ.1000 తో మే 5వరకు, రూ.5 వేల పెనాల్టీతో మే 10 వరకు, రూ.10 వేల పెనాల్టీతో మే 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది.

హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేయడానికి ఈ లింకును అనుసరించండి. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallticket.aspx

ఈ విభాగాల్లో ప్రవేశాలు…

ఏపీ ఈఏపీ సెట్‌ 2024(AP EAPCET) పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్( డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్/ హార్టీకల్చర్, బీవిఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ(సీఏ అండ్ బీఎం) విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డీమ్డ్ యూనివర్సిటీల్లో కూడా 25 శాతం కోటాలను కూడా ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.

పరీక్ష విధానం ఇలా…

ఈఏపీ సెట్‌-2024 ను ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్ బేస్డ్(Computer Based Exam) పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. వీటిలో మ్యాథ్స్‌ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు.

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. వీటిల్లో బోటనీ నుంచి 40 ప్రశ్నలు, జువాలజీ నుంచి 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీలో 40 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో కనీస అర్హతగా 25 మార్కులు సాధించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అందుబాటులో ఉంటాయి.

అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులకు మే 16 మరియు 17, 2024 తేదీలలో మరియు ఇంజనీరింగ్ కోర్సు మే 18 నుండి మే 23, 2024 వరకు నిర్వహిస్తారు.

IPL_Entry_Point

టాపిక్

Ap EapcetAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024