మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం

Best Web Hosting Provider In India 2024

ఐప్యాక్‌ ప్రతినిధుల భేటీలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

విజయవాడ: ఐప్యాక్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. బెంజ్‌ సర్కిల్‌లోని ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైయస్‌ జగన్‌.. వారితో కాసేపు ముచ్చటించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని, మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలు గెలిచామని, 2024 ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మనవైపు చూస్తుందన్నారు. ఈసారి 151 అసెంబ్లీకు పైనే గెలవబోతున్నామని, 22కు పైగా లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నామని చెప్పారు. 
 

Best Web Hosting Provider In India 2024