Best Web Hosting Provider In India 2024
Lampan OTT Streaming: లంపన్ వెబ్ సిరీస్‍పై చాలా ఆసక్తి ఉంది. మరాఠీ ప్రముఖ రచయిత ప్రకాశ్ నారాయన్ సంత్ రచించిన వనవాస్ పుస్తకం నుంచి ‘లంపన్’ పాత్రతో ఓ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. దీంతో లంపన్‍పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ సిరీస్‍కు నిపున్ అవినాశ్ ధర్మాధికారి దర్శకత్వం వహించారు. ఈ లంపన్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
స్ట్రీమింగ్ ఎక్కడ..
లంపన్ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (మే 16) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మరాఠీతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‍కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ వెబ్ సిరీస్‍లో లంపన్ పాత్ర పోషించారు బాలనటుడు మిహిర్ గోడ్‍బోలే. అతడి నటనకు ఇప్పటికే ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సిరీస్‍లో చంద్రకాంత్ కులకర్ణి, గీతాంజలి కులకర్ణి, కాదంబరి సదమ్, పుష్కరాజ్ చిర్పుక్టర్, అవని భావే కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.
లంపన్‍ను ఓ బాలుడి అనుభవాలను చూపించేలా ఫీల్‍గుడ్ వెబ్ సిరీస్‍లా తెరకెక్కించారు దర్శకుడు నిపుణ్ అవినాశ్. ప్రకాశ్ నారాయణ్ సంత్ రచన ఆధారంగా రూపొందించారు. ఈ సిరీస్ 1947 కాలం బ్యాక్‍డ్రాప్‍లో ఓ గ్రామంలో సాగుతుంది. ఈ వెబ్ సిరీస్ పాటలకు రాహుల్ దేశ్‍పాండే స్వరాలు అందించగా.. సౌరభ్ భలేరావ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. శ్రీరంగ్ గోడ్‍బోలే, హృషికేశ్ దేశ్‍పాండే, అమిత్ పత్వర్ధన్, చింతామని వత్రక్ సంయుక్తంగా నిర్మించారు.
లంపన్ స్టోరీలైన్ ఇదే
పుణెలో ఉండే లంపన్ హఠాత్తుగా ఓ గ్రామంలో ఉండే తన నానమ్మ (గీతాంజలి కులకర్ణి), తాత (చంద్రకాంత్ కులకర్ణి) వద్దకు వెళ్లాల్సి వస్తుంది. అదే గ్రామంలో స్కూల్‍లో చేరతాడు. కొత్త ఊరు, కొత్త స్నేహితులు, కొత్త వాతావరణం అతడికి ఎదురవుతుంది. కొత్త పరిస్థితులను అలవాటు చేసుకొని లంపన్ ఎలా ముందుకు సాగాడన్నది ఈ వెబ్ సిరీస్ కథగా ఉంది.
లంపన్ సిరీస్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సరదాగా సాగిపోతూ హృదయాన్ని హత్తుకునేలా ఉందని అంటున్నారు. తమకు బాల్యం గుర్తుకు వచ్చిందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు. సిరీస్ మొత్తం ఎంగేజింగ్‍గా ఉండటంతో పాటు ఎమోషనల్‍గా సాగతుందని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చని అంటున్నారు. లంపన్ వెబ్ సిరీస్ ఏడు ఎపిసోడ్లుగా సోనీ లివ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
బాహుబలి యానిమేటెడ్ సిరీస్ రేపే..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలు భారీ బ్లాక్‍బస్టర్ అవటంతో పాటు గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయ్యాయి. ఇప్పుడు బాహుబలి ఆధారంగా యానిమేటెడ్ సిరీస్ వస్తోంది. ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ రేపు (మే 17) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. ఈ సిరీస్‍పై హైప్ విపరీతంగా ఉంది. దీంతో రికార్డు స్థాయి వ్యూస్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.