Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్..కాంచనని మోసం చేస్తున్న శ్రీధర్.. కార్తీక్ గురించి మరో నిజం తెలుసుకున్న పారిజాతం

Best Web Hosting Provider In India 2024

Karthika deepam 2 serial today may 17th episode: జ్యోత్స్న దీప, కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. బయటకు వెళ్దామా అంటుంది. రిక్వెస్ట్ చేస్తావ్ ఏంటి కాబోయే భార్యవి డిమాండ్ చేయాలని సుమిత్ర అంటుంది. మీరంతా ఇలా ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఇష్టం లేదనే మాటని కూడా బయటకు చెప్పలేకపోతున్నానని అనుకుంటాడు.

నిజం తెలుసుకున్న కార్తీక్

అనవసరమైన వాటి గురించి ఆలోచించొద్దని సుమిత్ర జ్యోత్స్నకి మరోసారి చెప్తుంది. నీ సంతోషం కంటే తమకి ఇంకేమీ ముఖ్యం కాదని సుమిత్ర అంటుంది. కారులో వెళ్తుంటే రోడ్డు మీద శౌర్య కనిపిస్తుంది. స్కూల్ కి వెళ్లలేదా అని అడుగుతాడు. వెళ్తున్నానని చెప్పి స్కూల్ చూపిస్తుంది.

మనం అనుకున్నది వేరే స్కూల్ కదా అంటాడు. ఎండగా ఉందని శౌర్యని కారులో కూర్చోబెడతాడు. జ్యోత్స్నకి బాగా కోపం వస్తుంది. అమ్మ నన్ను ఆ స్కూల్ లో చేర్పించడానికి తీసుకెళ్లింది. అందులో చేరాలంటే అమ్మానాన్న బాగా చదువుకోవాలంట కానీ వాళ్ళు చదువుకోలేదు కదా.

కార్తీక్ నాకు ఆ స్కూల్ నచ్చింది. ఇక్కడ బాగోలేదు. నేను బాగా చదువుకుని కలెక్టర్ అవాలంట అమ్మ చెప్పిందని అంటుంది. బావకి నాకంటే మిగతా వాళ్ళు ఎక్కువ అయిపోయారని అనుకుంటుంది. స్కూల్ లో చెరినట్టు అమ్మ ఎవరికీ చెప్పొద్దని శౌర్య భయపడుతుంది.

దీపని తిట్టుకున్న కార్తీక్

నువ్వు చెప్పలేదులే నేనే చూశానని అంటాడు. కార్తీక్ కోపంగా ఉంటాడు. శౌర్య తెలివైనదని పెద్ద స్కూల్ లో చేర్పించమని మరీ మరీ చెప్పాను నేను చేర్పించుకుంటాను నా కూతురు గురించి నాకు తెలియదా అన్నదని కార్తీక్ దీపని తిట్టుకుంటాడు. గ్రాని అన్నట్టు బావ చూపిస్తుంది జాలి కాదు బాధ్యత. నేను ఎందుకు తీసుకొచ్చానో కూడా మర్చిపోయాడని మనసులో అనుకుంటుంది.

సుమిత్రతో ఫోన్లో మాట్లాడుతూ కాంచన తన భర్త శ్రీరామచంద్రుడు అని చెప్తూ తెగ మురిసిపోతుంది. అటు శ్రీధర్ అది అలా అనుకోబట్టే ఇన్నాళ్ళూ అయినా మన ఇద్దరి గురించి తెలియలేదని ఫోన్లో అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. గ్లాసులో పాలు పోస్తూ ఒలికి కాళ్ళ మీద పడతాయి. కాంచన రావడంతో కాల్ కట్ చేస్తాడు.

కావేరీ ఫోన్లో మాట్లాడిన మాటలు వింటే కొంప కొల్లేరు అయ్యేదని అనుకుంటాడు. కార్తీక్ రాగానే అర్జెంట్ గా వంట మనిషిని చూడమని చెప్తుంది. వంట మనిషి ఎందుకు కోడలు ఉంటే సరిపోతుందని శ్రీధర్ అంటాడు. ముహూర్తాలు ఉన్నాయి నువ్వు సరే అంటే పెళ్లి జరిపిద్దామని కాంచన చెప్తుంది.

రెండు నెలల తర్వాత పెళ్లి

సరే అని పరిస్థితి లేదు మీ అందరినీ కూర్చోబెట్టి విషయం చెప్పాలని అనుకుంటాడు. ముహూర్తాలు పెట్టించండి కానీ పెళ్ళికి కాదు రెస్టారెంట్ ఓపెనింగ్ కి. రెండు నెలల్లో అది పూర్తవుతుందని ఆ తర్వాత పెళ్లి గురించి చెప్తానని అంటాడు. రెండు నెలల తర్వాత పెళ్ళికి ఒకే చెప్పాడని కాంచన వాళ్ళు మురిసిపోతారు.

జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. నన్ను కారులో పెట్టి ఆరోజు దీపతో టీ తాగాడు. ఈరోజు శౌర్యని కూర్చోబెట్టుకుని స్కూల్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత నన్ను అడిగాడు ఎక్కడికని కోపం వచ్చింది. బావలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు అన్న మాటలు ఎక్కడ నిజం అవుతాయోనని భయంగా ఉందని చెప్తుంది.

నాకు కావాల్సింది ఈ భయమే నిన్ను అడ్డం పెట్టుకుని ఆ దీపని ఇంట్లో నుంచి బయటకు పంపించేసి కార్తీక్ తో నీ పెళ్లి చేయాలని పారిజాతం అనుకుంటుంది. ముందు శౌర్య, దీపతో మాట్లాడి నిజాలు తెలుసుకోవాలని పారిజాతం చెప్తుంది. బావ లేకపోతే బతకనని అంటుంది.

నోరు జారిన పారిజాతం

నోర్ముయ్ వందల కోట్ల ఆస్తికి వారసురాలివి నువ్వు అని డబ్బు గురించి మాట్లాడుతుంది. నేను బావ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆస్తి అంటావ్ ఏంటని జ్యోత్స్న అడుగుతుంది. ఆస్తి కోసం కాకపోతే నేను ఇదంతా ఎందుకు చేసినట్టు అని పారిజాతం నోరు జారుతుంది.

నాకోసం నువ్వేం చేశావ్ గ్రాని అని జ్యోత్స్న అడుగుతుంది. బాధ్యత, మహారాణి అంటూ ఏదో కవర్ చేసి తప్పించుకుంటుంది. రోజు స్కూల్ కి ఎలా వెళ్లాలని శౌర్య అడుగుతుంది. మెడల మీద ఎక్కించుకుని తీసుకెళ్తానని అంటుంది. ఊరు వెళ్ళి సైకిల్ తెచ్చుకుందామని అంటే కొత్తది కొంటానని దీప చెప్తుంది.

సైకిల్ కావాలన్న శౌర్య

మన కోసం మళ్ళీ జాతర పెడతారా? అప్పుడే కదా మనకి సైకిల్ వచ్చేదని శౌర్య అంటుంది. డబ్బులు వచ్చినప్పుడు సైకిల్ కొంటానని చెప్తుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. దీప పారిజాతానికి ఫుల్ కౌంటర్స్ వేస్తుంది. ఏంటి మీ అమ్మని అడుగుతున్నావ్ అంటుంది.

సైకిల్ కావాలని అడుగుతున్నా అని చెప్పింది. అమ్మ ఊర్లో సైకిల్ గెలిచిందని చెప్తుంది. మా ఊరి జాతరలో సైకిల్ పోటీ పెడితే వెళ్ళి థర్డ్ ప్రైజ్ గెలుచుకుంది. నేను సైకిల్ అడిగానని నా కోసం కావాలని మా అమ్మ థర్డ్ వచ్చిందని చెప్తుంది. మరి ఆ సైకిల్ ఏది అని అడిగితే నానమ్మ అమ్మేసిందని చెప్తుంది.

ఆ సైకిల్ అంటే నాకు చాలా ఇష్టం అది నా ఫ్రెండ్. ఆ సైకిల్ ఇచ్చింది కార్తీక్ అనేసరికి పారిజాతం షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024