Allu Arjun at Dhaba: దాబాలో భార్యతో కలిసి అల్లు అర్జున్ లంచ్.. ఫొటోలు వైరల్.. ఎక్కడో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Allu Arjun at Dhaba: అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియాలోనూ పెద్ద స్టార్ హీరో. అలాంటి వ్యక్తి స్టార్ హోటల్స్ లో తప్ప బయట తినడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఆ అరుదైన సందర్భం ఇప్పుడు వచ్చినట్లుంది. బన్నీ తన భార్య స్నేహతో కలిసి ఓ దాబాలో భోజనం చేస్తున్న ఫొటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయింది.

దాబాలో అల్లు అర్జున్ లంచ్

ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఓ దాబాలో ఇలా లంచ్ చేస్తూ కనిపించాడు. అతడు మొబైల్లో బిజీగా ఎవరితోనూ మాట్లాడుతూ భోజనం చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. ఆ పక్కనే అతని భార్య అల్లు స్నేహా రెడ్డి కూడా ఉండటం ఈ ఫొటోలో చూడొచ్చు. అతడు ఎప్పుడు ఇలా దాబాకు వెళ్లాడన్న సమాచారం లేదు.

అయితే ఆ మధ్య ఏపీ ఎన్నికలకు ముందు నంద్యాలలో తన స్నేహితుడికి మద్దతివ్వడానికి వెళ్లిన సంగతి తెలుసు కదా. అప్పుడే మధ్యలో ఇలా దాబాలో బన్నీ లంచ్ చేసినట్లు కొందరు భావిస్తున్నారు. అంత పెద్ద స్టార్ ఇలా సింపుల్ గా ఓ దాబాలో తినడం అతని సింప్లిసిటీకి నిదర్శనం అంటూ ఈ ఫొటోను చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ దాబా ఎక్కడ? ఎప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వెళ్లాడు అంటూ మరికొందరు ఆరా తీస్తున్నారు.

అల్లు అర్జున్ నంద్యాల టూర్

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు నంద్యాల నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతివ్వడానికి అల్లు అర్జున్ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని చూడటానికి భారీ ఎత్తున జనం అక్కడికి వచ్చారు. అయితే తన మామ పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ప్రత్యర్థి కూటమి నుంచి పోటీ చేస్తుండగా.. బన్నీ ఇలా చేయడం వివాదానికి దారి తీసింది.

దీనిపై అతడు వివరణ కూడా ఇచ్చాడు. తన వాళ్లు ఏ పార్టీలో ఉన్నా మద్దతిస్తానని, తాను ఏ పార్టీకీ మద్దతివ్వడం లేదని స్పష్టం చేశాడు. అయినా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అతన్ని దారుణంగా ట్రోల్ చేశారు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే” అని నాగబాబు ట్వీట్ చేయడంతో ఈ గొడవ మరింత ముదిరింది.

అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ మరింత ఉధృతంగా బన్నీపై దాడి మొదలు పెట్టారు. దీనికి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి కూడా గట్టిగానే కౌంటర్ వచ్చింది. కొన్ని రోజుల పాటు ఈ మీమ్స్ దాడి కొనసాగింది. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో భారీ బిజినెస్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024