Blink OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న కన్నడ సై-ఫి థ్రిల్లర్.. రికార్డు టైమ్‌లోనే.. మీరు చూశారా లేదా?

Best Web Hosting Provider In India 2024

Blink OTT: ఓటీటీలో ఇప్పుడో కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సంచలనం రేపుతోంది. కర్ణాటకలో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించిన తర్వాత ఈ మధ్యే ఓటీటీలోకి అడుగుపెట్టిన బ్లింక్ (Blink) మూవీని ఎగబడి చూసేస్తున్నారు. ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. దసరా మూవీలో నటించిన దీక్షిత్ శెట్టి ఇందులో లీడ్ రోల్ పోషించాడు.

ఓటీటీలో బ్లింక్ రికార్డులు

కన్నడ మూవీ అయిన బ్లింక్ ఇండియా కంటే ముందుగా ఓవర్సీస్ లోనే డిజిటల్ ప్రీమియర్ వచ్చింది. దీంతో ఆ మూవీ హైక్వాలిటీ ప్రింట్ ఆన్‌లైన్లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చేసింది. ఆ తర్వాత మెల్లగా ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఫ్రీగా చూసే వీలున్నప్పుడు దాని ప్రభావం ఓటీటీ స్ట్రీమింగ్ పై పడుతుందని అందరూ భావించారు.

కానీ బ్లింక్ విషయంలో అలా జరగలేదు. ప్రైమ్ వీడియోలోనూ ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈ మూవీ ఇప్పటికే కోటి స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ అందుకున్నట్లు మంగళవారం (మే 21) ప్రొడ్యూసర్ రవిచంద్ర చెప్పడం విశేషం. థియేటర్లలోనూ మొదట్లో మెల్లగా మొదలైన బ్లింక్ ప్రభంజనం.. తర్వాత ఓ రేంజ్ లో సాగింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే కొనసాగుతోంది.

బ్లింక్ టీమ్ ఎంత సంపాదించిందంటే..

బ్లింక్ మూవీకి ప్రైమ్ వీడియోలో మంచి రెస్పాన్స్ వస్తోంది. కోటి స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ అందుకుంది. దీంతో ప్రొడ్యూసర్లపై కాసుల వర్షం కురుస్తుందనుకుంటే పొరపాటే.

ఈ కోటి స్ట్రీమింగ్ మినట్స్ తర్వాత టీమ్ కు వచ్చేది రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలే అని గతంలో ఓటీటీప్లే వెల్లడించింది. ఈ స్ట్రీమింగ్ మినట్స్ పెరిగినకొద్దీ వాళ్లకు డబ్బులు వస్తుంటాయి.

అసలేంటీ బ్లింక్ మూవీ?

బ్లింక్ అనేది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ సినిమాలో అపూర్వ అనే ఓ పీజీ స్టూడెంట్ పాత్రలో దీక్షిత్ శెట్టి కనిపించాడు. శ్రీనిధి బెంగళూరు ఈ మూవీని డైరెక్ట్ చేసింది. ఆమెకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. తండ్రి గురించి వెల్ల‌డైన ఓ ర‌హ‌స్యం కార‌ణంగా సాఫీగా సాగిపోతున్న అపూర్వ జీవితం మొత్తం త‌ల‌క్రిందులు అవుతుంది.

కంటిరెప్ప‌ల‌ను మూయ‌కుండా నియ‌త్రించే శ‌క్తి అపూర్వ‌కు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? అదే అత‌డి లైఫ్‌ను ఎలా క‌ష్టాల్లోకి నెట్టింది? కంటి రెప్ప‌ల‌ను మూసిన మ‌రుక్ష‌ణం టైమ్ ట్రావెల్‌లో అత‌డు ముందుకు…వెన‌క్కి ఎలా వెళ్లాడు అన్న‌దే బ్లింక్ మూవీ క‌థ‌. 1996, 2001, 2021, 2035 కాలాన్ని చూపిస్తూ మొత్తం నాలుగు టైమ్ పీరియ‌డ్స్ నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లేతో ఈ మూవీ సాగుతుంది.

ఈ సినిమాలో దీక్షిత్ శెట్టికి జోడీగా మందాత హీరోయిన్‌గా న‌టించింది. చైత్ర జే ఆచార్ కీల‌క పాత్ర పోషించింది. మార్చి 8న ఈ క‌న్న‌డ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. తొలుత యాభై లోపు థియేట‌ర్లు మాత్ర‌మే ఈ సినిమాకు దొరికాయి. మౌత్‌టాక్ బాగుండ‌టంతో థియేట‌ర్లు పెరిగాయి. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు దీక్షిత్ శెట్టి యాక్టింగ్‌, డైరెక్ట‌ర్ శ్రీనిధి టేకింగ్‌పై ప్ర‌శంస‌లు కురిశాయి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024