
Best Web Hosting Provider In India 2024

RevanthReddy In Tirumala: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. బుధవారం వేకువ జామున రేవంత్ రెడ్డి మనుమడికి పుట్టు వెంట్రుకలు సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
టాపిక్
Cm Revanth ReddyTelangana NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsTirumalaTirumala Tickets