Best Web Hosting Provider In India 2024
Maidaan OTT: అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ మైదాన్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో మైదాన్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. జూన్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు అందరికి మైదాన్ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండబోతున్నట్లు సమాచారం.
ఫుట్‌బాల్ కోచ్ జీవితం ఆధారంగా…
హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ జీవితం ఆధారంగా మైదాన్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో సయ్యద్ రహీమ్ పాత్రలో అజయ్‌దేవ్‌గణ్ నటించాడు. ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది.
235 కోట్ల బడ్జెట్…
దాదాపు 235 కోట్ల బడ్జెట్‌తో జీ స్టూడియోస్‌తో కలిసి బోణీ కపూర్ మైదాన్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. కథ, కథనాలతో పాటు అజయ్‌దేవ్‌గణ్ నటనకు ప్రశంసలు దక్కినా కమర్షియల్‌గా మాత్రం మైదాన్ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ కేవలం 67 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నిర్మాతలకు 160 కోట్లకుపైగా నష్టాలను మైదాన్ మూవీ మిగిల్చింది.
మైదాన్ కథ ఇదే…
1950 దశకంలో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా రహీమ్ (అజయ్ దేవ్‌గణ్) నియమితుడవుతాడు. కానీ ఫుట్‌బాట్ ఆటలో బెంగాళ్‌దే ఆధిపత్యం కావడంతో రహీమ్ కోచ్‌గా సెలెక్ట్ కావడం నచ్చిన కొందరు బెంగాళీయులు కుట్రలు పన్నుతారు. రహీమ్ కోచ్ పదవి పోయేలా చేశారు. ఆ సమస్య నుంచి రహీమ్ ఎలా బయటపడ్డాడు? తిరిగి కోచ్‌గా నియమితుడు కావడానికి రహీమ్‌కు సాయం చేసింది ఎవరు? రహీమ్ మార్గదర్శనంలో ఎన్నో అడ్డంకులను దాటుకొని ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ ఏషియన్ గేమ్స్‌లో ఎలా పతకం గెలిచింది అన్నదే మైదాన్ మూవీ కథ.
రహీమ్ గురించి తెలిసిన కథ…
రహీమ్ గురించి అందరికి తెలిసిన కథనే మైదాన్‌లో చెప్పడంతో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఫుట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ ఆడియెన్స్‌ను అలరించాయి.
2019లోనే మైదాన్ మూవీ షూటింగ్ మొదలైంది. కానీ కొవిడ్‌తో పాటు ఇతర సమస్యల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. 2022లో షూటింగ్ పూర్తయినా రిలీజ్‌కు కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. .ఏడెనిమిదిసార్లు రిలీజ్ వాయిదాపడింది
కీర్తి సురేష్ హీరోయిన్…
మైదాన్ మూవీతో కీర్తి సురేష్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. ప్రియమణి పాత్ర కోసం తొలుత కీర్తిసురేష్‌ను తీసుకున్నారు. కానీ రహీమ్ భార్య రోల్‌కు కీర్తిసురేష్ యాప్ట్ కాదనే ఆలోచనతో ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకున్నారు.
సైతాన్‌తో బ్లాక్‌బస్టర్…
జయాపజయాలకు అతీతంగా మూడు, నాలుగు నెలలకు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అజయ్ దేవ్‌గణ్. అతడు హీరోగా ఇటీవల రిలీజైన హారర్ మూవీ సైతాన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన తెలుగు మూవీ ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవ్గణ్ కీలక పాత్రలో నటించాడు.