TS EdCET 2024 : రేపే తెలంగాణ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష – హాల్‌ టికెట్ల లింక్‌ ఇదే

Best Web Hosting Provider In India 2024

TS EdCET 2024 Updates : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష మే 23వ తేదీన జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ  ఏడాది ప్రవేశ పరీక్ష కోసం రాష్టవ్యాప్తంగా మొత్తం 79 సెంటర్లను ఏర్పాటు చేశారు.

Steps to download TS EdCET 2024 hall ticket: హాల్ టికెట్లు విడుదల

  • తెలంగాణ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష 2024 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://edcet.tsche.ac.in/  వెబ్ సైట్ నుంచి వీటిని పొందవచ్చు
  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://edcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి  TS EdCET Hall Ticket 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. 
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ప్రవేశపరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు పేపర్‌ను నిర్వహిస్తారు. అంటే రెండు సెషన్లలో ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.

మూడు విభాగాలుగా ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఎలో ఇంగ్లిష్, పార్ట్ బిలో టీచింగ్ ఆప్టిట్యూడ్, పార్ట్ సిలో మెథడాలజీపై ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు పార్ట్ సి కోసం ఒక సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా… రెండేళ్ల బీఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షను కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు.

తెలంగాణ ఎడ్ సెట్  పరీక్షకు 33,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఈ ఎంట్రెన్స్ పరీక్షను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. తెలంగాణలోని పలు పట్టణాలతోపాటు ఏపీలో విజయవాడ, కర్నూల్‌లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.

IPL_Entry_Point

టాపిక్

Ap EdcetTelangana NewsTrending TelanganaEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024