Star Maa New Serial: స్టార్ మాలో సరికొత్త సీరియల్ నిన్ను కోరి.. ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే?

Best Web Hosting Provider In India 2024

Star Maa New Serial: సరికొత్త సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ మా ఛానెల్ ఇప్పుడు మరో సీరియల్ తో రాబోతోంది. ఈ సీరియల్ పేరు నిన్ను కోరి. ఈ సీరియల్ అనౌన్స్‌మెంట్ ను గురువారం (మే 30) స్టార్ మా ఛానెల్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా సీరియల్ లీడ్ రోల్ ను పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

నిన్ను కోరి సీరియల్ ఎప్పటి నుంచంటే..

స్టార్ మా ఛానెల్లో ఇప్పటికే ఎన్నో ప్రేక్షకులకు నచ్చిన సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. టీఆర్పీ రేటింగ్స్ విషయంలోనూ ఈ సీరియల్స్ హవానే కొనసాగుతోంది. ఇక ఇప్పుడు నిన్ను కోరి పేరుతో సరికొత్త సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ సీరియల్ వచ్చే సోమవారం (జూన్ 3) నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు టెలికాస్ట్ కానుంది.

ఈ రిలీజ్ డేట్ చెబుతూ స్టార్ ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో సీరియల్ లీడ్ రోల్ విరాట్ పాత్రను పరిచయం చేసింది. ఆ వీడియోలో అతడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. “నేను విరాట్.. నాకు వర్క్, టైమ్. ప్రపంచంలో ఇవి రెండే చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అదే నాకు సక్సెస్ ఇస్తుంది. నిన్ను కోరి.. మీ స్టార్ మాలో” అని అతడు చెప్పాడు.

అటు ఫిమేల్ లీడ్ చంద్రకళ పాత్రను కూడా పరిచయం చేశారు. తనకు పెళ్లి చూపులని, అయితే తనకు పెళ్లి అంటే ఇష్టం లేదంటూ ఆ అమ్మాయి చెబుతూ వెళ్తుంది.

నిన్ను కోరి స్టోరీ ఏంటి?

విదేశీ పెళ్లికొడుకుల పైన కలలు, అక్కడి అబ్బాయిల పెళ్లి సంబంధాల గురించి అపోహలు, అసలు నిజాలు, దాచిపెట్టిన వాస్తవాలు తెలిసిన తరవాత తలకిందులవుతున్న అమ్మాయిల జీవితాలు.. ఈ సరికొత్త కథకి మూల స్తంభాలు ఇవే. తెల్లారి లేచింది మొదలు టీవీలో, న్యూస్ పేపర్స్ లో ఇలాంటి విషయాలు వింటూనే వున్నాం, చూస్తూనే వున్నాం.

అలాంటి సున్నితమైన భావోద్వేగాల కథే “నిన్ను కోరి”. పరువు ప్రతిష్ట, కుటుంబ గౌరవం కోసం ఎంతో తపన పడే ఒక పల్లెటూరి పెద్ద ఇంట్లో జరిగే సంఘటనల సమాహారం ఈ కథ. ఏ పాత్ర ఏ సందర్భంలో ఎలా స్పందిస్తుందో, ఏ క్యారెక్టర్ ఎంత ధైర్యంగా నిలబడుతుందో.. ఏ క్యారెక్టర్ ఎలాంటి కన్విక్షన్ తో ఉంటుందో.. స్పష్టంగా ప్రతి క్యారెక్టర్ కి ఒక స్పష్టమైన పంథా ఉంటుంది.

సందర్భాలు కూడా నిజజీవితం నుంచి వచ్చినవే. ఒక అమ్మాయి జీవితం గురించి, పెళ్లి గురించి ఎలా ఆలోచించాలి, ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి ఎలాంటి అవకాశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి, బయటి ప్రపంచాన్ని ఎంత వరకు లెక్కలోకి తీసుకోవాలి.. లాంటి ఎన్నో విషయాలు ఈ కథలో అంతర్భాగంగా ఉండడం ఈ కథ ప్రత్యేకత. మరి జూన్ 3 నుంచి టెలికాస్ట్ కానున్న ఈ నిన్ను కోరి సీరియల్ ను చూసేయండి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024