Best Web Hosting Provider In India 2024
స్పష్టం చేసిన ఎగ్జిట్ పోల్స్
గుంటూరు: వైయస్ఆర్‌సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించి మళ్లీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. వైయస్ఆర్‌సీపీ విజయ భేరి మోగించనుందని స్పష్టం చేశాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం జగన్ ప్రభుత్వానికే మరోసారి జనం జై కొట్టనున్నారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
వైయస్ఆర్‌సీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆరా సంస్థ తేల్చింది. 94 నుంచి 104 స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ గెలవబోతుందని ఆరా మస్తాన్ తెలిపారు. 13-15 లోక్‌సభ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ గెలవబోతుందని ఆరా అంచనా వేసింది. షర్మిలకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆరా మస్తాన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ కి 98 నుంచి 116 వరకు.. టీడీపీ 59-77 వస్తాయని ఆత్మసాక్షి సంస్థ అంచనా వేసింది. వైయస్ఆర్‌సీపీకి 117 నుంచి 120.. టీడీపీకి 48 నుంచి 50 సీట్లు దక్కవచ్చని రేస్ తెలిపింది.
ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్:
ఆత్మసాక్షి:
వైయస్ఆర్‌సీపీ: 98-116
టీడీపీ 59-77
రేస్:
వైయస్ఆర్‌సీపీ-117-120
టీడీపీ-48-50
పోల్ స్ట్రాటజీ గ్రూప్:
వైయస్ఆర్‌సీపీ– 115-125
టీడీపీ- 50-60
ఆపరేషన్ చాణక్య:
వైయస్ఆర్‌సీపీ: 95-102
టీడీపీ: 64-68
చాణక్య పార్థదాస్:
వైయస్ఆర్‌సీపీ: 110-120
టీడీపీ: 55-65
పోల్ స్ట్రాటజీ గ్రూప్:
వైయస్ఆర్‌సీపీ: 115-125
టీడీపీ: 50-60
జన్‌మత్:
వైయస్ఆర్‌సీపీ: 95-103
టీడీపీ: 67-75
అగ్నివీర్:
వైయస్ఆర్‌సీపీ: 124-128
టీడీపీ: 46-49
పోల్ లాబొరేటరీ:
వైయస్ఆర్‌సీపీ: 108
టీడీపీ: 67
WRAP స్ట్రాటజీస్:
వైయస్ఆర్‌సీపీ: 158-171
టీడీపీ-0-4
ఏబీపీ- సీ ఓటర్:
వైయస్ఆర్‌సీపీ 97-108
టీడీపీ 67-78
ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్:
ఆరా మస్తాన్:
వైయస్ఆర్‌సీపీ: 13-15
టీడీపీ:10-12
ఆత్మసాక్షి:
వైయస్ఆర్‌సీపీ: 17
టీడీపీ: 08
రేస్:
వైయస్ఆర్‌సీపీ-19
టీడీపీ- 06
టైమ్స్ నౌ-ఈటీజీ:
వైయస్ఆర్‌సీపీ: 14
టీడీపీ-11
2019 ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేయడంతో పేదవర్గాల్లో అధికార వైఎస్సార్‌సీపీకి ఆదరణ మరింత పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైయస్ఆర్‌సీపీకి అవకాశం కల్పించారని ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చెబుతున్నాయి.