AP IAS IPS Officers: చంద్రబాబు నివాసానికి ఆ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, అనుమతించని చంద్రబాబు సెక్యూరిటీ

Best Web Hosting Provider In India 2024

AP IAS IPS Officers: ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద గరువారం పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు భంగపాటు తప్పలేదు. ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబు భద్రతా సిబ్బంది అనుమతించ లేదు.

సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నేతలు, అధికారులు పెద్ద ఎత్తున గురువారం తరలి వచ్చారు. చంద్రబాబు నివాసానికి మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వచ్చారు. కొత్త ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చంద్రబాబు నివాసం దగ్గర భద్రత పెంచారు. సందర్శకులు, టీడీపీ శ్రేణుల రాకతో ఉండవల్లి కరకట్ట మార్గంలో రద్దీ ఏర్పడింది.

ఆ అధికారులకు అనుమతి నిరాకరణ…

మరోవైపు చంద్రబాబును కలిసేందుకు వచ్చిన పలువురు అధికారులకు భంగపాటు తప్పలేదు. చంద్రబాబును కలిసేందుకు వచ్చే వారిలో కొందరిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు వచ్చిన పీఎస్‍ఆర్ ఆంజనేయులుకు భద్రతా సిబ్బంది అపాయింట్‌మెంట్‌ లేదని తిరస్కరించారు.

ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత డీజీ ఇంటెలిజెన్స్ పదవి నుంచి పిఎస్సార్‌ ఆంజనేయులును తప్పించారు. అపాయింట్‍మెంట్ లేదని చెప్పడంతో చంద్రబాబు నివాసం వద్ద నుంచి పీఎస్‍ఆర్ ఆంజనేయులు వెనుదిరిగి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో వైసీపీ కోసం పనిచేసిన అధికారుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం నేపథ్యంలో పిఎస్సార్ ఆంజనేయులును ఇంటెలిజెన్స్‌ బాధ్యతల నుంచి ఎన్నికల సంఘం తప్పించింది.

స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. మర్యాద పూర్వక భేటీ పేరుతో చంద్రబాబును కలిసేందుకు వచ్చిన కొల్లి రఘురామిరెడ్డికి భద్రతా సిబ్బంది అనుమతి నిరాకరించారు.

గత ఏడాది నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. NSG నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు తలుపు డోర్ కొట్టి అరెస్ట‌ చేశారు. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభియోగాలతో అన్ని శాఖల బాధ్యతల నుంచి తప్పిస్తూ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సీఐడీ చీఫ్ సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. కరకట్ట ప్రధాన గేట్ వద్ద సంజయ్ కారుని ఆపి వెనక్కి పంపారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాలు రాగానే విదేశాలకు వెళ్లేందుకు సెలవు పెట్టారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో సెలవు రద్దు చేసుకున్నారు. మర్యాదపూర్వక భేటీ పేరుతో చంద్రబాబు నివాసానికి వచ్చిన సంజయ్‌కు అనుమతి లేదని స్పష్టమైన ఆదేశాలు రావడంతో భద్రతా సిబ్బంది వెనక్కి పంపారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ నిరాకరించారు. దీంతో ఆయన వెనుదిరిగారు.

సిఎస్‌ ఎంపికపై కసరత్తు…

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సిఎస్‌ మార్పు జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సిఎస్‌ జవహర్‌ రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా సూచించినట్టు అనధికారిక వార్తలు వెలువడుతున్నాయి. బుధవారం చంద్రబాబుతో సిఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్‌ గుప్తా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సిఎస్‌ను కొనసాగింపు ఉండకపోవచ్చని ఆయన స్థానంలో సీనియర్లకు అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. ఆర్పీ సిసోడియా, నీరబ్ కుమార్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఎంపీలతో చంద్రబాబు తొలి భేటీ…

ఉండవల్లి నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న ఎంపీలతో ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. అందుబాటులో లేని ఎంపీలు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు ఎంపీలకు చంద్రబాబు శుభాకాంక్షలు -తెలిపారు. శుక్రవారం జరిగే ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరుకానున్న టీడీపీ ఎంపీలు హాజరు కానున్నారు.

IPL_Entry_Point

టాపిక్

Ap PoliticsGovernment Of Andhra PradeshAp PoliceTdpYsrcp
Source / Credits

Best Web Hosting Provider In India 2024