Best Web Hosting Provider In India 2024
TS LAWCET 2024 Key: తెలంగాణ లాసెట్ – 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవలే పరీక్షలు పూర్తి కాగా…తాజాగా అన్సర్ కీ విడుదలైంది. అంతేకాకుండా పరీక్ష రాసిన అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
TS LAWCET 2024 Key Download: టీఎస్ లాసెట్ కీ విడుదల
- తెలంగాణ లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే TG LAWCET & TG PGLCET QUESTION PAPERS ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మూడేళ్ల లా కోర్సు, ఐదేళ్ల కోర్సుతో పాటు ఎల్ఎల్ ఎం కోర్సు ప్రశ్నాపత్రాల ఆప్షన్లు కనిపిస్తాయి.
- ఇందులో మీరు రాసిన పరీక్ష పేపర్ పై క్లిక్ చేస్తే… కీ తో కూడిన ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
TS LAWCET 2024 Response Sheets : రెస్పాన్స్ షీట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి…
- తెలంగాణ లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే Response Sheets అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ Registration Number, LAWCET/PGLCET Hallticket No ను ఎంట్రీ చేయాలి.
- గెట్ రెస్పాన్స్ షీట్ పై నొక్కితే రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
టాపిక్
Ts LawcetAp LawcetTelangana NewsTrending TelanganaEducation