Krishna mukunda murari serial: కథ క్లైమాక్స్ కి వచ్చింది, కృష్ణ సూపర్ ప్లాన్.. ముకుంద చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial today june 6th episode: అందరూ భోజనం చేస్తుంటే కృష్ణ మాత్రం దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. అసలు ఏమి పట్టనట్టు ఏం జరగనట్టు ఎలా భోజనం చేస్తున్నారని అడుగుతుంది. లేకపోతే మీ భార్యాభర్తలు చేసిన ఘనకార్యానికి తిండి తిప్పలు మానేసి పస్తులు ఉండమంటావా? అని ఆదర్శ్ కోపంగా అడుగుతాడు.

 

కృష్ణ ఆవేదన

నన్ను దోషిలా చూస్తూ నేరస్థురాలిగా లెక్కకడుతున్నారా అని కృష్ణ భవానీని నిలదీస్తుంది. ఆమె మౌనంగా ఉండటంతో కృష్ణ కోపంగా అరుస్తుంది. ఎందుకంత ఆవేశమని మధు అంటాడు. తన కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని చెప్తున్నా వినకుండా మోసం చేసిన దాన్ని పక్కనే కూర్చోబెట్టుకుని తింటున్నారని కృష్ణ అరుస్తుంది.

మీరందరూ నన్ను నమ్మడం లేదు కదా తనని నమ్ముతున్నట్టే కదా. తనతో కలిసి భోజనం చేస్తే తనని నమ్మినట్టా అని సుమలత అంటుంది. కృష్ణకి కావాల్సింది మీరంతా నన్ను అసహ్యించుకోవడం నన్ను నేరస్థురాలిగా చూడటమని ముకుంద అంటుంది.

చూడటం ఏంటి నువ్వు నేరస్థురాలివే, నా భర్తని దక్కించుకోవడానికి నా బిడ్డను నీ బిడ్డ చేసుకోవడం కోసం నా భర్తతో లేని సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేయాలని చూస్తున్నావ్. నువ్వు నేరస్థురాలివే అని కృష్ణ గట్టిగా అంటుంది. ఇందుకే నేను వెళ్లిపోతానని అన్నాను కానీ ఇంట్లో ఉంచి సాధిస్తున్నారని ముకుంద డ్రామా ఆడుతుంది.

మురారి ముకుంద భర్తగానే కనిపిస్తాడు

తల్లి కాబోతున్న నేను ఎంత ప్రశాంతంగా ఉండాలి. కానీ మీరు నన్ను ఇలా మాటలు అంటుంటే నాతో పాటు నా కడుపులోని బిడ్డ ఏమవుతుందని అంటుంది. నీ నంగనాచి వేషాలు ఆపమని కృష్ణ ఆవేశంగా మాట్లాడుతుంది. తప్పు చేసిన వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారని ఆదర్శ్ అంటే కృష్ణ తన నోరు మూయిస్తుంది.

 

నువ్వు నమ్మింది నిజమయినప్పుడు అది బయట పడేవరకు మౌనంగా ఉండమని రేవతి సర్ది చెప్తుంది. ఒక పక్క నా భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఇంకో పక్క నా మాటలు మీరెవరు నమ్మడం లేదని కృష్ణ ఏడుస్తుంది. మురారి మీ కంట పడటం అంటూ జరిగితే అది ఈ ముకుంద భర్తగానే అని ముకుంద మనసులో అనుకుంటుంది.

కృష్ణ బయటకు వెళ్లాలని రేవతి, మధుని రమ్మని పిలుస్తుంది. ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని భవానీ అపుతుంది. మీరు నన్ను నమ్మాలి అంటే ఏం చేయాలని కృష్ణ కన్నీళ్ళతో అడుగుతుంది. ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.

తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను

నా ప్రయత్నంలో నేను ఉన్నాను. నిజానిజాలు ఏంటో నేను తేలుస్తాను. ఎవరి తప్పు అని తెలిస్తే వాళ్ళని మాత్రం ఊరికే వదలనని భవానీ హెచ్చరిస్తుంది. మధు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలని అనుకుంటున్నావని కృష్ణని అడుగుతాడు.

కృష్ణ ఇంట్లో అందరికీ కాఫీ ఇచ్చి మీరా దగ్గరకు వచ్చి పాలు తీసుకోమని అంటుంది. పొద్దు పొద్దునే నా మీద ప్రేమ చూపిస్తుంది ఏంటని అనుకుంటున్నావా? ఇంట్లో నిన్ను అందరూ నమ్ముతున్నారు. నేను మాత్రం ఎందుకు ద్వేషం చూపించాలి. నన్ను చూడకుండా ఏసీపీ సర్ ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు.

 

అందుకే నువ్వు చెప్పేది అందరూ నమ్మడంలో తప్పు లేదు. అంటే మురారి తప్పు చేసినట్టు నువ్వు నమ్ముతున్నావా కృష్ణ అని సుమలత అడుగుతుంది. అందరూ నమ్ముతున్నారు కదా. నమ్మకపోతే ఏసీపీ సర్ ఏమైపోయారో అనే టెన్షన్ ఉండేది. కానీ అందరూ కూల్ గా ఉన్నారు.

కృష్ణ సూపర్ ప్లాన్

అంటే అందరూ ఏసీపీ సర్ తప్పు చేసి ఎక్కడో దాక్కున్నారని నమ్ముతున్నారు కదా. ఏసీపీ సర్ ఎక్కడ ఉన్నారో ఇంట్లో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా తెలుసు అందుకే ఇంత ధైర్యంగా ఉన్నారు. అందుకే నీ మీద ద్వేషంతో ఉండటం తప్పు అని అంటుంది.

కృష్ణ ఇలా నమ్మితే చాలు అందరూ మురారి వల్లే నేను తల్లిని అయ్యానని నమ్ముతారని అనుకుంటుంది. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా అని కృష్ణ మీరాని అడుగుతుంది. ఒకసారి నువ్వు వాడే ట్యాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్తుంది. ఏమైంది నీకు ఏదేదో మాట్లాడుతున్నావ్ అంటే మురారి ఎక్కడ ఉన్నాడో తెలిసి కూడా చెప్పడం లేదని అనుకుంటున్నావా? అని రేవతి అడుగుతుంది.

ఇప్పటికైనా దారిలోకి వచ్చావ్

ఇదే నిజం కన్న కొడుకు కనిపించకుండా పోతే మీరు ఎలా ఉండగలుగుతున్నారు. ఏసీపీ సర్ అంటే పెద్దత్తయ్యకు ప్రాణం. మరి అత్తయ్య ఎందుకు మౌనంగా ఉన్నారని అనేసరికి భవానీ కృష్ణని తిడుతుంది. ఏంటి నీ ఉద్దేశం అన్ని తెలిసి నీకు చెప్పడం లేదని అనుమానిస్తున్నావా? అని భవానీ అడుగుతుంది.

 

మరి మీరేందుకు నన్ను అనుమానిస్తున్నారు. నేను చెప్పే ఒక్క మాట కూడా మీరు నమ్మడం లేదని కృష్ణ బాధపడుతుంది. మీరా తను వాడుతున్న ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి చూపిస్తుంది. వాటిని చూసి అన్నీ తప్పకుండా వాడమని చెప్తుంది. ఇప్పటికైనా దారిలోకి వచ్చినందుకు సంతోషమని ముకుంద కృష్ణతో అంటుంది.

మధు వచ్చి అసలు ఏం చేస్తున్నావ్ మీరా, మురారికి సంబంధం ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావా అని కృష్ణని నిలదీస్తాడు. పెద్దమ్మ అయినా మురారిని అనుమానిస్తుంది కానీ నువ్వు మాత్రం అనుమానించవు మరి ఎందుకు అలా మాట్లాడావని అడుగుతాడు.

మురారి కోసమే

కృష్ణ ట్యాబ్లెట్స్ చూపిస్తుంది. ఇవి ఇందాక మీరా దగ్గర తీసుకున్నాను. కడుపుతో ఉన్న వాళ్ళు వాడేవి కావు. ఎముకలు ఇరిగితే వాటిని స్ట్రాంగ్ చేసేందుకు వాడే ట్యాబ్లెట్స్ అని చెప్తుంది. ఇవి మీరా దగ్గర ఎందుకు ఉన్నాయని మధు అంటాడు. ఈ మందులు ఎవరికోసం తీసుకున్నట్టు. ఒకవేళ మురారి కోసం తీసుకుందేమో అని అనుమానపడతారు.

ఆయన వచ్చే పరిస్థితి ఉంటే ఇంతకాలం రాకుండా ఉండరు. ఆయన దగ్గరే ఉండి ఉంటారని కృష్ణ డౌట్ పడుతుంది. అంత భయపడే పరిస్థితి ఉండదు, ఒకవేళ అలా ఉంటే మీరా ఇంత కూల్ గా ఉండదు. ఈ మధ్య మీరా ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్తుందని మధు అంటాడు.

 

ఇక నుంచి మీరా మీద కన్నేసి ఉంచాలి. ఏసీపీ సర్ దొరుకుతారు. దాని బండారం బయటపడుతుందని కృష్ణ ప్లాన్ వేస్తుంది. మురారి ఎలా ఉన్నాడో ఏంటో ట్యాబ్లెట్స్ వేసే టైమ్ అవుతుందని ముకుంద బయటకు వెళ్లేందుకు చూస్తుంది. గేటు దగ్గర భవానీ ఉంటుంది.

ముకుందని ప్రశ్నించిన భవానీ

నెలతప్పిన దానివి కదా అంత హడావుడిగా నడుస్తున్నావ్ ఏంటని భవానీ అడుగుతుంది. డాక్టర్ అపాయింట్ మెంట్ ఉందని టైమ్ అవుతుందని చెప్తుంది. కడుపుతో ఉన్న దానివి అంత కంగారుగా ఎందుకు వెళ్ళడం, కృష్ణ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పింది కదా మళ్ళీ వెళ్ళడం ఎందుకని అడుగుతుంది.

కొన్ని టెస్ట్ లు చేశారు రిపోర్ట్స్ ఈరోజు వస్తాయని వాటిని తీసుకుని ఇక రానని చెప్పి వస్తానని అంటుంది. ఆ అవసరం కూడా లేదని కృష్ణ ఫోన్ చేస్తే ఇంటికి పంపిస్తారని భవానీ చెప్తుంది. వెళ్ళు డాక్టర్ తో చెప్పి వస్తానని అన్నావ్ కదాని పంపిస్తుంది. ముకుంద దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలని మురారి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ ముకుంద ను ఫాలో అయి మురారి దగ్గరకు చేరుకుంటుంది.

IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024