AP CID Raids: ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు

Best Web Hosting Provider In India 2024

AP CID Raids: ఏపీలో ఐదేళ్లుగా మద్యం వ్యాపారాన్ని, లిక్కర్ డిస్టిలరీ సిండికేట్లను నడిపించారనే అభియోగాలతో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సిఐడి సోదాలు నిర్వహిస్తోంది. రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్‌ పదవి నుంచి తప్పించింది.

ఏపీలో మద్యం ధరల్ని పెంచడం, ఊరు పేరు లేని మద్యం బ్రాండ్లను విక్రయించడంలో వేల కోట్ల రుపాయల అక్రమాలు జరిగాయని ఐదేళ్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో మద్యం పాలసీ పేరుతో మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి, తమకు అనుకూలంగా ఉన్న బ్రాండ్లను మాత్రమే ఐదేళ్లుగా విక్రయించడం ద్వారా ప్రభుత్వం వేల కోట్ల అక్రమాలకు పాల్పడిందని బీజేపీ పలుమార్లు ఫిర్యాదు చేసింది.

బేవరేజెస్‌ కార్పొరేషన్ ఆదాయాన్ని చూపించి వేల కోట్ల రుణాలను తీసుకున్నారని, ఆర్ధిక అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయని ఎన్నికలకు ముందు పలుమార్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. బేవరేజెస్‌ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి వాటిలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే డిస్టిలరీల్లో తయారైన నాసిరకం మద్యాన్ని విక్రయించారని, బాట్లింగ్ ధరకు, విక్రయ ధరకు భారీ వ్యత్యాసం ద్వారా వేల కోట్లు పక్కదారి పట్టాయని విపక్షాలు ఆరోపించాయి.

రాజకీయ పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ వెలువడిన వెంటనే ఆయనపై వేటు పడింది. ఎన్నికలకు ముందే తన మాతృ సంస్థకు వెళ‌్ళిపోయేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రభుత్వ పెద్దలు ఆయన్ని రిలీవ్ చేయకుండా ఉంచారు. ఎన్నికల సంఘం వేటు వేయడంతో ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో గురువారం ఉదయం నుంచి సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ నానక్‍రామ్‍గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి.

జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం దోపిడీకి పూర్తి సహకారం అందించడం ద్వారా అక్రమాలను ముందుండి నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. డిస్టిలరీను స్వాధీనం చేసుకోవడం, మద్యం తయారీ సంస్థల్ని నయానో భయానో లొంగదీసుకోవడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాసుదేవ రెడ్డి నివాసంలో సిఐడి సోదాలు కలకలం రేపాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 2019లో సంపూర్ణ మద్య నిషేధం నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ .. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మద్యం ధరల్ని రెండురెట్లు పెంచింది. రూ.110 ఉన్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌ ధరను రూ.330కు పెంచింది. అప్పటి వరకు వినియోగంలో ఉన్న పాపులర్ బ్రాండ్లను దెబ్బతీసేలా కొత్త బ్రాండ్లను తెరపైకి తెచ్చారు. మద్యం అక్రమ రవాణా కట్టడికి సెబ్ పేరుతో ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకుంది.

కల్తీ సారా, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా పెరిగిపోవడంతో అనివార్య పరిస్థితుల్లో ధరల్ని సగానికి తగ్గించారు. 2019తో పోలిస్తే ప్రస్తుతం 110శాతం ధరల్ని పెంచి ఏపీలో విక్రయిస్తున్నారు. ధరలు పెంచినా నాణ్యత మాత్రం గణనీయంగా పడిపోయింది. ఏ రోజు ఏ బ్రాండ్ మద్యాన్ని విక్రయిస్తారో తెలీని పరిస్థితులు కల్పించారు.

ఫలితంగా మద్యం కొనుగోలు చేసే వారు బ్రాండ్ల స్థానంలో ధరలను బట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితులు కల్పించారు. 2019 నాటికి 16వేల కోట్ల రుపాయలు మద్యం ద్వారా ఆదాయంగా వస్తే ప్రస్తుతంద అది 34వేల కోట్లకు చేరింది. ప్రజల నుంచి వసూలు చేసిన మద్యం సొమ్ముతోనే ఏపీలో అమ్మొడి వంటి పథకాలను నిధులను అందిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Ap CidAp PoliceTdpYsrcpYsrcp Vs TdpLiquorLiquor Scam
Source / Credits

Best Web Hosting Provider In India 2024