PM Kisan Yojana : పీఎం కిసాన్ పథకం దరఖాస్తు విధానం ఇలా?- ఈ కేవైసీ, స్టేటస్ చెక్కింగ్ వివరాలివే?

Best Web Hosting Provider In India 2024


PM Kisan Yojana : కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తొలి సంతకం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలపై చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత విడుదలకు ప్రధాని మోదీ అనుమతి ఇచ్చారు. అయితే కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM KISAN) 17వ విడత ఆర్థిక సాయం పొందేందుకు రైతులు ఈ-కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతులు 17వ విడత ఆర్థిక సాయం పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ యోజన ఆన్ లైన్ దరఖాస్తు ఇలా?

Step1 : పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లో ‘ఫార్మర్ కార్నర్’ పై క్లిక్ చేయండి.

Step2 : ‘New Farmer Registration’పై క్లిక్ చేసి ఆధార్ నంబర్‌ నమోదు చేయాలి.

Step3 : అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి Yes option పై క్లిక్ చేయండి

Step4 : పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి సమాచారాన్ని సేవ్ చేయండి. దానిని ప్రింటౌట్ కూడా తీసుకోండి.

పీఎం కిసాన్ ఓటీపీ e-KYC ఎలా?

1. ఈ డైరెక్ట్ https://fw.pmkisan.gov.in/aadharekyc.aspx లింక్ పై క్లిక్ చేయండి.

2. OTP ఆధారిత e-KYC పై క్లిక్ చేయండి.

3. రైతు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి

4. ‘GET OTP’ బటన్ క్లిక్ చేయండి

5. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

6. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి సబ్మిట్ పై నమోదు చేయండి.

ఈ-కేవైసీ చేయించుకోకపోతే పీఎం కిసాన్‌తో తదుపరి విడత ఆర్థిక సాయం పొందలేరు. ఈ-కేవైసీ కోసం ముందుగా ఆన్ లైన్ లో ఓటీపీ, ఆ తర్వాత సీఎస్సీ కేంద్రాల్లో వేలిముద్ర వేసి, అనంతరం ఫేస్ ఐడీ స్కాన్ చేయాల్సి ఉంటుంది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN Yojana) పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయంగా ఏటా రూ.6000 వేలు మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

పీఎం కిసాన్ నిధి స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

పీఎం కిసాన్ పోర్టల్ https://pmkisan.gov.in/ ని సందర్శించి, బెనిఫిషియరీ జాబితాను, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత స్టేటస్ ను చెక్ చేయవచ్చు. మీ ఖాతాకు డబ్బు వచ్చిందో లేదో తనిఖీ చేయవచ్చు. మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే హెల్ప్‌లైన్ (1800-115-5525)ని సంప్రదించవచ్చు.

పీఎం కిసాన్ సమ్మాన్ నగదు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి?

  • మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ పై క్లిక్ చేయండి.
  • ఇందులో ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. ఈ పేజీలో పీఎం కిసాన్ స్టేటస్ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్‌ను ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ పొందుతారు.
  • తర్వాతి పేజీలో రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
  • స్క్రీన్ పై పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ గురించి సమాచారాన్ని చూడవచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్

Pm Kisan SchemeFarmersAndhra Pradesh NewsTelangana NewsTelugu NewsNarendra Modi

Source / Credits

Best Web Hosting Provider In India 2024