Brahmamudi June 14th Episode: బ్రహ్మముడి- కావ్యపై పశ్చాత్తాపంతో కుమిలిపోయిన అపర్ణ.. తన జోలికి రావొద్దని కోడలికి ఆర్డర్

Best Web Hosting Provider In India 2024


Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అపర్ణ బాధపడేలా రుద్రాణి మాట్లాడుతుంటే కావ్య అరుస్తుంది. ఇంకోసారి మీ నోటి నుంచి మాట వస్తే నేను మాట్లాడాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఏదో ముందు జాగ్రత్త కోసం మంచి చెప్పాను. నచ్చకపోతే వదిలేయండి అని రుద్రాణి అంటుంది. మీరు ఏ మంచి చెప్పాల్సిన అవసరం లేదు. పైకి వెళ్లి మీ పని మీరు చూసుకోండి. అపర్ణ ఆంటీ చుట్టూ మీరు కనిపిస్తే అత్తవని కూడా చూడను అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది.

 

చీదరించుకున్న అపర్ణ

దాంతో రుద్రాణి పైకి వెళ్లిపోతుంది. రుద్రాణి మాటలకు అపర్ణ బాధపడుతుంటే.. ఏంటీ మామ్ ఇది. ముందు నీ ఆరోగ్యం కుదుటపడాలి అని రాజ్ అంటాడు. నా రూమ్‍‌కు తీసుకెళ్లు అని అపర్ణ అంటే.. రాజ్ తీసుకెళ్తుంటాడు. అపర్ణ పడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. అపర్ణ కోప్పడుతుంది. సుభాష్ డోర్ తీస్తుంటే అపర్ణ చూసి చీదరించుకుంటుంది. దాంతో సుభాష్ ఇంటి బయటకు దూరంగా వెళ్లిపోతాడు. తర్వాత కావ్య దగ్గరికి వెళ్లిన రాజ్ కోప్పడతాడు.

 

ఇక మాయ గురించి పట్టించుకోవద్దని, నువ్ చేసిన పని వల్ల మామ్‌ హాస్పిటల్ పాలైందని అంటాడు. కానీ, కావ్య మాత్రం వినదు. అసలు మాయను పట్టుకుని గుట్టు విప్పితే కానీ దీనికి శాశ్వత పరిష్కారం దొరకదు. అసలు విషయం తెలిస్తే అత్తయ్య గారి మనసు కుదుటపడుతుంది. మావయ్యను క్షమించవచ్చు. నెలకు పది లక్షలు తీసుకునే ఆడది సడెన్‌గా ఊడిపడితే. అప్పుడు అత్తయ్య ఆరోగ్యానికి ఇబ్బందికాదా అని కావ్య అంటుంది.

 

ఏడ్చేసిన అపర్ణ

నీకు మెంటలా అని రాజ్ అంటే.. ఇప్పటివరకు లేదు కొత్తగా ఎక్కించకండి అని కోపంగా వెళ్లిపోతుంది కావ్య. రాత్రిపూట తన బెడ్‌పై కూర్చున్న అపర్ణ కోడలు కావ్యను అన్న మాటలను తలుచుకుంటూ బాధపడిపోతుంది. ఇంటి కోడలిగా అడుగు పెట్టినప్పటి నుంచి నగలు మాయకు ఇచ్చేవరకు జరిగింది తలుచుకుని ఏడుస్తుంది. బాధతో కళ్లు మూసుకుంటుంది. ఇంతలో కావ్య జ్యూస్ తీసుకొస్తూ పిలుస్తుంది. కాలు అడుగుపెట్టకముందే ఆగమని చెబుతుంది అపర్ణ.

 

నువ్ నాకు ఎదురుపడటానికి వీళ్లేదు అని అపర్ణ అంటుంది. నేను మీకు ఎప్పటికీ నచ్చనని, నన్ను క్షమించరని తెలుసు. అది నా దురదృష్టం. అది మీ ఇష్టం. కానీ, నేను మీ కొడుకు భార్యను. అత్త ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోడలిగా నా బాధ్యత. మీ ఇష్టాన్ని గౌరవిస్తాను. నా కర్తవ్యాన్ని నన్ను చేయనివ్వండని కావ్య అడుగుపెడుతుంటే మళ్లీ వీళ్లేదని అంటుంది అపర్ణ. ఎందుకు అత్తయ్య అని కావ్య అడుగుతుంది. ఎందుకంటే నేనే నీకే ఎదురుపడలేను కాబట్టి అని అపర్ణ అంటుంది.

 

నేను తలవంచను

నువ్ నాకు ఎదురుపడుతుంటే ఈ కుటుంబం కోసం నువ్ ఎన్ని త్యాగాలు చేశావో తెలుసా అని ప్రశ్నించినట్లు ఉంటుంది. నేను నిన్ను అన్ని మాటలు అన్నదానికి, నా సంస్కారాన్ని ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది అని అపర్ణ కన్నీళ్లతో అంటుంది. మీ ముందు నేను ఎంత అని కావ్య అంటుంది. నేనెంత నేనెంత అంటూనే ఎక్కడికో వెళ్లిపోయావో నీకు తెలియదు. ఇప్పుడు నేను పైనున్న నిన్ను చూసి కొనియాడాలా. అది ఎప్పటికీ జరగదు. నేను ఎప్పటికీ తలవంచను అని అపర్ణ అంటుంది.

 

ఇంకా ఎక్కడ ఎందుకు ఉన్నావ్. నన్నింకా అపరాధభావనలోకి నెట్టకు. నేను ఎప్పుడు బయటపడను. నువ్వు ఎప్పుడు మోసం చేసిన కనకం కూతురువే. అలాగే ఉండాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండాలి. నేను నీ విషయంలో అన్యాయమే చేశాను. కానీ, అది నీ ముందు ఒప్పుకోను. నేను దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిని. అస్సలు తగ్గను అని అపర్ణ పశ్చాత్తాపంతో అంటుంది. మీరు ఎప్పుడు నాకు అక్కడ ఉంటారు. కానీ, డాక్టర్స్ మిమ్మల్ని చూసుకోమ్మని చెప్పారు. తొందరగా కోలుకోవాలి. కాబట్టి నేను చెప్పిన మాట వినాలి అని కావ్య అంటుంది.

 

నా జోలికైతే రాకు

వినను. నేను నీ మాట వినడమేంటీ నాన్సెన్స్. విన్నాను అంటే నేను ఓడిపోయినట్లే. నేను ఓడిపోను. ఇంకా ఎందుకు నిలబడి వాదన పెట్టుకుంటున్నావ్. ఎంత ధైర్యం నీకు. చాతనైతే నీ మూర్ఖత్వపు మొగుడుని మార్చుకో. ఇంకా ఎందుకు నిన్ను దూరం పెడుతున్నాడో అడుగు. అంతేకానీ నా జోలికి అయితే రాకమ్మా. నేను పుట్టెడు దుఖంలో ఉన్నాను. నీ మొగుడు తప్పు చేశాడని ఎన్ని శిక్షలు వేశాను. ఇప్పుడు నా మొగుడే తప్పు చేశాడని తెలిసాకా ఎన్ని శిక్షలు వేయాలి అని అపర్ణ కుమిలిపోతుంది.

 

అసలే నా గుండె బలహీనంగా ఉంది. నేను ఏది ఆలోచించే పరిస్థితిలో లేను. నన్ను కదిలించకు. వెళ్లిపో అని అపర్ణ అంటుంది. మీ మాట నేనెప్పుడు కాదనను అని లోపలికి వచ్చి జ్యూస్ పెడుతుంది కావ్య. వెళ్లమంటే లోపలికి వచ్చావేంటీ. నా మాట అంటే లెక్కలేదా అని అపర్ణ అంటుంది. ఉంది. మళ్లీ భోజనం తీసుకొస్తాను. మీరు ఎన్నిసార్లు వెళ్లగొట్టిన వెళ్లిపోతాను. మీ ఆరోగ్యం బాగయ్యే వరకు వస్తూనే ఉంటాను అని వెళ్లిపోతుంది కావ్య.

 

నువ్విచ్చిన ఆస్తే కదా

కావ్య వైపు పశ్చాత్తాపంగా చూస్తుంది అపర్ణ. తర్వాత కావ్యకు కాల్ చేసి అపర్ణ గురించి అడుగుతుంది. అత్తయ్య గారి ఆరోగ్యం బాగుండాలని పూజ పెట్టుకుంటున్నారట కదా. నన్ను రమ్మన్నారు. కానీ, వస్తే ఏదైనా గొడవ జరుగుతుందేమో అని భయంగా ఉంది. ఏదో ఒక కారణం చెప్పి అని కనకం అంటే.. ఈ పరిస్థితుల్లో రాకుంటేనే తప్పు అవుతుంది అని కావ్య అంటుంది. వస్తూ కట్నం తీసుకొస్తే తీసుకురా అని కావ్య అంటే.. హా మీ నాన్న తీసుకొచ్చిన ఆస్తి ఉంది మరి కనకం అంటే.. ఏం ఇవ్వకుంటేనే నా మాట వినట్లేదు. ఇచ్చుంటే ఇంకెలా ఉండేదో అని కావ్య అంటుంది.

 

మాటకు మాట చెప్పడం బాగా అలవాటు అయిందే నీకు అని కనకం అంటే.. అది నువ్విచ్చిన ఆస్తే కదా అని కావ్య అంటుంది. కట్ చేస్తే.. బయట అపర్ణ కూర్చుని ఉంటే రాజ్ వెళ్లి మాట్లాడుతాడు. నేను మోసగాళ్లతో మాట్లాడను అని అపర్ణ అంటే.. పోని పోట్లాడు అని రాజ్ అంటాడు. నాకు ఓపిక లేదని అపర్ణ అంటే.. బలవంతంగా వాకింగ్ చేపిస్తాడు రాజ్. మీరంతా పెద్దవాళ్లైపోయార్రా. తల్లికి జరిగిన అన్యాయం కంటే తండ్రి పరువు ముఖ్యమైంది కదరా నీకు అని అపర్ణ అంటుంది.

 

గుండె మంటను ఇంకా పెంచకు

ఈ టైమ్‌లో అవెందుకు అని రాజ్ అంటాడు. నా జీవితం నుంచి ఒక అధ్యాయం తుడిచేసాను. మీ నాన్న. కట్టుకున్న భార్యను మోసం చేసిన మనిషిని జీవితంలో క్షమించకూడదు. అసలు మొహం కూడా చూడకూడదు అని అపర్ణ అంటుంది. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు ఇంత ద్వేషం పెట్టుకోకు. ఏదైనా అనిపిస్తే అనేసేయ్. అప్పుడే ప్రశాంతంగా ఉంటుందని రాజ్ అంటాడు. నేను బాబును తీసుకొచ్చి కొడుకని చెబితే కళావతి కూడా అలాగే అనుకోవాలి కదా. నా వ్యక్తిత్వం మీద తనకున్న నమ్మకం. అలా నీకు డాడ్‌ మీద ఎందుకు లేదని రాజ్ అడుగుతాడు.

 

రాజ్ నా గుండె మంటను ఇంకా పెంచకు అని అపర్ణ అంటుంది. తర్వాత ఇంకా నడవలేను అని కూర్చుంటుంది అపర్ణ. ఇంతలో కావ్య సూప్ తెస్తుంది. నిన్ను ఎదురుపడకూడదని చెప్పాను కదా అని అపర్ణ అంటే.. సూప్ తాగితే మీరు ఉండమన్న ఉండను అని కావ్య అంటుంది. రాజ్ కూడా అనడంతో ఏంటీ మీరిద్దరు నాతో ఆడుకుంటున్నారా. నేను నీ భార్య చేసిన సూప్ తాగనురా అని అపర్ణ చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

 

 

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024