Temple: ఆ దేవాలయంలోకి పురుషులు వెళ్లాలంటే చీర కట్టుకోవాల్సిందే, పువ్వులు పెట్టుకోవాల్సిందే

Best Web Hosting Provider In India 2024

Temple: ప్రతి ఏడాది కేరళలోని కొల్లం జిల్లాలో ఉన్న కొట్టంకులంగర శ్రీదేవి ఆలయంలో ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాన్ని చేసేందుకు కేరళ నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. అయితే ఈ ఉత్సవంలో ఆ దేవి ఆలయంలోకి పురుషులు అడుగు పెట్టాలంటే స్త్రీల వేషధారణలో మాత్రమే వెళ్లాలి. ఈ పండుగను 10 నుంచి 12 రోజులు నిర్వహించుకుంటారు. పురుషులు వయసుతో సంబంధం లేకుండా స్త్రీలలాగా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకుని, పువ్వులు పెట్టుకొని ఆ దేవతను ఆరాధించటానికి వెళతారు. ఐదు వత్తులతో దీపాలను వెలిగిస్తారు.

ఇలా చీర కట్టుకొని పూజ చేసే సంప్రదాయం. ఈనాటిది కాదు శతాబ్దాలుగా ఆ గుడిలో అదే జరుగుతోంది. దీని వెనక ఒక కథ కూడా ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో చిన్న రాయిని ఆవుల కాపరులు దేవతగా పూజించేవారట. ఆ దేవత కోసం తాము కూడా ఆడపిల్లల్లా వేషం వేసుకొని ఆ రాయి చుట్టూ ఆడుకునేవారట. ఒకరోజు దేవి ఆ రాయి నుండి ప్రత్యక్షమైందని అంటారు. అప్పటినుంచి ఆ రాయి దగ్గరే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆవుల కాపరుల్లాగే పురుషులు… స్త్రీల వేషధారణలు వేసుకుని దేవతకు నైవేద్యం సమర్పించడం, దీపం వెలిగించడం వంటివి చేయడం మొదలుపెట్టారు.

ఈ ఆలయంలోకి లింగమార్పిడి చేసుకున్న ట్రాన్స్ జెండర్లు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక సాధారణ మగవారు మీసం, గెడ్డం వంటివి పూర్తిగా షేవ్ చేసుకొని, మేకప్ వేసుకొని రంగురంగుల చీరలు కట్టుకొని, పువ్వులు పెట్టుకొని అక్కడికి వస్తారు. వారిని చూసేందుకే ఎంతోమంది పర్యాటకులు ఆ గుడికి వస్తూ ఉంటారు. మగవారు వేసుకొని చీరలు, నగలు చాలా చాలా అందంగా ఉంటాయి. అవి అందరికీ చాలా నచ్చుతాయి. పదేళ్ల కంటే తక్కువ వయసున్న అబ్బాయిలు, అమ్మాయిల్లాగే దుస్తులు ధరించి దీపాలను పట్టుకుని నడుస్తారు. ఇలా మగవారు చీరలు కట్టుకొని దేవతను పూజించడం వల్ల వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుందని, అప్పులు బాధలు తీరుతాయని నమ్ముతారు. ఉదయం తెల్లవారుజామున రెండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఈ ఆలయానికి దగ్గరలోనే బ్యూటీషియన్లు గుడిసెలు వేసుకొని తాత్కాలికంగా ఉంటారు. ఎందుకంటే పురుషులకు దుస్తులు ధరించడంలో సహాయపడటం, వారికి మేకప్ వేయడం వంటివి చేయడం ద్వారా మీరు డబ్బులు సంపాదిస్తారు.

సాధారణంగా మగవారు ఆడవారుల చీరలు కట్టుకొని రోడ్డు మీదకు వస్తే అందరూ నవ్వడం వంటివి చేస్తారు. కానీ ఈ ఆలయం చుట్టుపక్కల అలాంటివి కనబడవు. చీర కట్టుకున్న మగవారిని ఎంతో గౌరవిస్తారు. వారు దేవతని పూజించి వచ్చాక వారిని ఎంతో గొప్పగా చూస్తారు. ఆ ఇంట్లోనే స్త్రీలు వీలైనప్పుడు కేరళలోని ఈ ఆలయానికి వెళ్లి చూడండి. ముఖ్యంగా పండుగ సమయంలో వెళితేనే ఈ మగవారి వేషధారణలు కనిపిస్తాయి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024