Thriller Telugu Web Series: తెలుగులో మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024


Thriller Web Series: ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. అది కూడా తెలుగులో. ఈ కొత్త సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గురువారం (జూన్ 20) తమ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. ఈ మధ్యే యక్షిణి అనే హారర్ వెబ్ సిరీస్ ను హాట్‌స్టార్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అగ్నిసాక్షి.. థ్రిల్లర్ వెబ్ సిరీస్

తాజాగా హాట్‌స్టార్.. అగ్నిసాక్షి అనే టైటిల్ తో కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో ఓ జంట క్లోజ్‌గా ఉండటం చూడొచ్చు. అగ్నిసాక్షి అనే ఇంగ్లిష్ టైటిల్లో చివరి అక్షరం అయిన ‘ఐ’ని ఓ కత్తి రూపంలో ఉంచారు. ఇక దీనికి ఫైర్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్‌లైన్ పెట్టడం విశేషం. దీనిని చూస్తుంటే ఇదో థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా అనిపిస్తోంది.

ఇక ఇదే పోస్టర్ లో కింద.. కొత్త జీవితం, కొత్త కథ, కొత్త కేరాఫ్ అడ్రెస్ అనే లైన్స్ ఉంచారు. ఓ ప్రేమ జంట చుట్టూ తిరిగే కథలా ఈ వెబ్ సిరీస్ కనిపిస్తోంది. ఇక ఈ సిరీస్ లో లీడ్ రోల్స్ ఎవరు పోషిస్తున్నారన్న విషయం కూడా హాట్‌స్టార్ వెల్లడించలేదు. అంతేకాదు ఈ సిరీస్ అసలు కథ ఏంటన్నదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

“ప్రతి ఒక్కరి ఫేవరెట్ జంట తిరిగి వస్తోంది.. వాళ్లు ఎవరో గెస్ చేయగలరా?” అనే క్యాప్షన్ తో ఈ సిరీస్ ను హాట్ స్టార్ అనౌన్స్ చేయడం విశేషం. వాళ్లు ఎవరన్న సస్పెన్స్ ను అలాగే ఉంచారు. దీంతో ఫ్యాన్స్ ఆ స్టార్ కపుల్ ఎవరో ఊహించే పనిలో ఉన్నారు.

ఏంటీ అగ్నిసాక్షి వెబ్ సిరీస్?

ఈ అగ్నిసాక్షి వెబ్ సిరీస్ కథేంటి అన్నదానిపై హాట్‌స్టార్ ప్రస్తుతానికి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అంతేకాదు ఇందులో లీడ్ రోల్స్ ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ మధ్యే యక్షిణి వెబ్ సిరీస్ తీసుకొచ్చిన హాట్‌స్టార్ ఓటీటీ ఇప్పుడీ కొత్త వెబ్ సిరీస్ ను కూడా మంచి బడ్జెట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ మధ్యే వచ్చిన యక్షిణి వెబ్ సిరీస్ చూస్తే అందులో లీడ్ రోల్లో మంచు లక్ష్మి, వేదిక, అజయ్ లాంటి వాళ్లు నటించారు. ఇదొక హారర్ సిరీస్. దీనిని హాట్ స్టార్ ఓటీటీ బాగానే ప్రమోట్ చేసినా ఆశించిన రీతిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఆర్కా మీడియా ఈ సిరీస్ ను ప్రొడ్యూస్ చేసింది.

జూన్ 14 అంటే శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో యక్షిణి ప్రసారం అవుతోంది. అదికూడా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది యక్షిణి వెబ్ సిరీస్. ఫాంటసీ, హారర్ జోనర్స్ ఇష్టపడేవారికి ఈ వెబ్ సిరీస్ మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇస్తుంది. ఫాంటసీ జోనర్‌కు హారర్, లవ్, రొమాన్స్ ఎలిమెంట్స్ యాడ్ చేసి డైరెక్టర్ తేజ మార్ని తెరకెక్కించారు.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024