Best Web Hosting Provider In India 2024

AP TET Notification 2024 : ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మెగా డీఎస్సీపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తొలి సంతకం కూడా మెగా డీఎస్సీ దస్త్రంపైనే సంతకం చేశారు. దీంతో విద్యాశాఖ కూడా కసరత్తు షురూ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.
మరోసారి టెట్ నోటిఫికేషన్….?
ఏపీలో ఇప్పటికే నిర్వహించిన టెట్ (ఫిబ్రవరి 2024)ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఫలితాల విడుదలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఫైల్స్ ముందుకు కదులుతున్న నేపథ్యంలో… ఏ క్షణమైనా టెట్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
పాత నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా మెగా డీఎస్సీకి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మరోసారి టెట్ ప్రకటన ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఫలితంగా మరికొంత మందికి కూడా డీఎస్సీకి అర్హత పొందే ఛాన్స్ దక్కుతుంది. ఇదే విషయంపై పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు…. శనివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. మెగా డీఎస్సీ నేపథ్యంలో మరింత మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని కోరారు. దీనిపై చర్చించి… నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే విద్యాశాఖ నుంచి క్లారిటీ వచ్చే అకాశం ఉంది.
మొత్తం డీఎస్సీ ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే టెట్ ను కూడా నిర్వహించే అవకాశాలపై కసరత్తు చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఇస్తే… కొత్త అభ్యర్థులతో పాటు గతంలో అర్హత సాధించనివారికి కూడా ఛాన్స్ దొరికినట్లు అవుతుంది. రాష్ట్రంలోని పలువురు నిరుద్యోగులు కూడా టెట్ పరీక్షను మరోసారి నిర్వహించాలని కూడా కోరుతున్నారు.
మెగా డీఎస్సీ పోస్టుల వివరాలు…
తాజాగా వచ్చే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.
- స్కూల్ అసిస్టెంట్ – 7,725
- ఎస్‌జీటీ – 6371
- టీజీటీ – 1781
- పీజీటీ – 286
- పీఈటీ – 132
- ప్రిన్సిపల్స్ – 52
వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి.
విద్యాశాఖ కొత్తగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీ ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయక్కర్లేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్