Best Web Hosting Provider In India 2024

Cine Producers Meets Pawan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్‌తో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశమయ్యారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను నిర్మాతలుపవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్‌తో సమావేశానికి హాజరైన నిర్మాతలలో అల్లు అరవింద్, చలసాని అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు,బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్,వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్