Kalki 2898 AD Record: ఒకే మల్టీప్లెక్స్‌లో 42 షోలు.. అన్నీ హౌజ్‌ఫుల్.. కల్కి 2898 ఏడీ మూవీ సరికొత్త రికార్డు

Best Web Hosting Provider In India 2024


Kalki 2898 AD Record: ఇప్పుడు ప్రపంచాన్ని కల్కి 2898 ఏడీ మూవీ మానియా చుట్టుముట్టేసింది. ఎటు చూసినా ఈ సినిమాపైనే చర్చ. గురువారం (జూన్ 27) రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఎన్నో రికార్డులను చెరిపేస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో మాత్రం చాలా అరుదైన రికార్డు నమోదైంది.

ఒకే మల్టీప్లెక్స్‌లో 42 షోలు..

రెబల్ స్టార్ ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో కల్కి 2898 ఏడీ మూవీ మరోసారి నిరూపిస్తోంది. ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని తొలి రోజే చూడటానికి ఫ్యాన్సే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఎగబడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి. అయితే హైదరాబాద్ లోని అపర్ణ సినిమాస్ మాత్రం ఓ కొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది.

కొత్తగా ఓపెన్ అయిన ఈ మల్టీప్లెక్స్ లో కల్కి 2898 ఏడీ తొలి రోజే ఏకంగా 42 షోలు ఏర్పాటు చేయడం ఓ విశేషమైతే.. అన్ని షోల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. దీనిని బట్టే ప్రభాస్ కు, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మల్టీప్లెక్స్ లో ఉదయం 5.30 గంటల నుంచే షోలు ప్రారంభం కానున్నాయి.

బిగ్గెస్ట్ ఫిల్మ్ కు అత్యధిక షోలు అంటూ అపర్ణ సినిమాస్ ఈ విషయాన్ని వెల్లడించింది. గురువారం (జూన్ 27) రిలీజ్ నాడే ఉదయం 5.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా అక్కడి మల్టీప్లెక్స్ లలో 42 షోలు నడవనున్నాయి. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నల్లగండ్లలో ఈ అపర్ణ సినిమాస్ కొత్తగా ప్రారంభమైంది. అపర్ణ సినిమాస్ తోపాటు సిటీలోని మిగతా అన్నీ మల్టీప్లెక్స్ లలోనూ కల్కి 2898 ఏడీ మూవీ లెక్కకు మించి షోలు వేయనున్నారు.

బెనిఫిట్ షోలతోపాటు టికెట్ల ధరలు పెంచుకోవడానికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించడంతో మేకర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల పంట పండిందనే చెప్పాలి. ఈ లెక్కన ఈ ప్రభాస్ మూవీకి ఇండియాలోనే రికార్డు ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా 2డీతోపాటు 3డీ, ఐమ్యాక్స్, 4డీఎక్స్ ఫార్మాట్లలోనూ రిలీజ్ కానుండటం విశేషం.

హిందీలోనూ ధమాకా..

కల్కి 2898 ఏడీ మూవీ హిందీ వెర్షన్ కూడా భారీ ఓపెనింగ్స్ తెచ్చేలా కనిపిస్తోంది. నార్త్ లోనూ ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.1.5 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఈ లెక్కన తొలి రోజు రూ.20 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. తెలుగు వెర్షన్ కు అయితే అసలు తిరుగులేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ అమెరికాలోనూ అన్ని రికార్డులు బ్రేకవడం ఖాయం.

ఇక ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే 3 గంటల 56 సెకన్ల నిడివి ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఫస్ట్ హాఫ్ ఒక గంట 34 నిమిషాల పాటు ఉండనుండగా.. సెకండాఫ్ కాస్త తక్కువ ఉండటం విశేషం.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024