AP PECET Results : ఏపీ పీఈసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల కోసం డైరెక్ట్ లింక్ ఇదే

Best Web Hosting Provider In India 2024

AP PECET Results : ఆంధ్రప్రదేశ్ లో వ్యాయామ విద్య కోర్సులైన బీపీఈడీ (రెండేళ్లు), యూజీడీపీఈడీ (రెండేళ్లు) కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీఈసెట్)- 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తాత్కాలిక రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సంధ్య కోల్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి. జాన్సన్ మాట్లాడుతూ జూన్ 24 నుంచి 27 వరకు విశ్వవిద్యాలయం క్యాంపస్ లో నిర్వహించిన పీఈసెట్ పరీక్షల ఫలితాలు విడుదల చేశామని పేర్కొన్నారు.

ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,641 మంది దరఖాస్తు చేసుకోగా, 1,124 మంది హాజరయ్యారు. వారిలో 784 మంది పురుషులు, 340 మంది మహిళ అభ్యర్థులు పరీక్షలకు వచ్చినట్లు పేర్కొన్నారు. వారిలో 1,064 మంది 95.11 శాతం అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. అందులో 754 (96.56 శాతం) పురుషులు, 310 (91.76 శాతం) మహిళలు అర్హత సాధించారు.

అందులో ఆంధ్ర యూనివర్శిటీ (ఏయూ) పరిధిలో 702 (95.64 శాతం) మంది అర్హత సాధించారు. అందులో 501 (97.47 శాతం) మంది పురుషులు, 201 (91.36 శాతం) మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ) పరిధిలో 341 (93.94 శాతం) మంది అర్హత సాధించారు. అందులో 239 (94.84 శాతం) మంది పురుషులు, 102 (91.89 శాతం) మంది మహిళ అభ్యర్థులు ఉన్నారు. నాన్ లోకల్స్ 26 (96.30 శాతం) మంది అర్హత సాధించారు. అందులో 17 (94.44 శాతం) మంది పురుషులు, 9 (100 శాతం) మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

అభ్యర్థులు ఏపీ పీఈసెట్ వెబ్‌సైట్‌ డైరెక్ట్ లింక్ https://cets.apsche.ap.gov.in/PECET/PECET/PECET_Get_Rank_Card.aspx నుండి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉన్నత విద్యామండలి ఆదేశానుసారం త్వరలో ప్రవేశాల వివరాలు వెల్లడిస్తామని ప్రొఫెసర్ జాన్సన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ పీసెట్ కన్వీనర్ డాక్టర్ డి .సూర్యనారాయణ వ్యాయామ విద్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel

Source / Credits

Best Web Hosting Provider In India 2024