Parenting Tips: స్కూలు నుంచి వచ్చాక పిల్లల్ని తల్లిదండ్రులు అడగాల్సిన ప్రశ్నలు ఇవే

Best Web Hosting Provider In India 2024


పిల్లల్ని స్కూలుకి పంపిన తరువాత వారు వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనగా వారి కోసం వెయిట్ చేస్తున్నారు. వారు పాఠశాలలో ఎలా ఉంటున్నారో, తింటున్నారో లేదో అన్న ఆలోచనలు మీలో వస్తాయి. మీ పిల్లలకు స్కూలు నచ్చిందో లేదో, అతను స్కూల్లో ఎలా ఫీలవుతున్నాడో తెలుసుకునేందుకు మీరు ప్రతిరోజూ మీ పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే, తల్లిదండ్రులు వారితో కొన్ని విషయాలు చర్చించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమాన్ని, వారి శ్రేయస్సును కోరకునే వారైతే స్కూలు నుంచి పిల్లలు వచ్చాక కచ్చితంగా వారితో కొన్ని విషయాలు మాట్లాడాలి. మంచి పెంపకంలో ఇది కూడా భాగమే. మీ బిడ్డను ప్రశ్నలు అడిగాక వారు చెప్పిన సమాధానాల నుంచే వారు స్కూల్లో ఎలా ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఆహారానికి సంబంధించి

ముందుగా పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చాక వారి యూనిఫారం మారుస్తూ మాటలు కలపండి. ఈరోజు పెట్టిన ఫుడ్ నచ్చిందా అని అడగండి. అలాగే వారికి ఏం తినాలనిపిస్తుందో అడగండి. ఈ రోజు పాఠశాలలో తోటి పిల్లలు ఫుడ్ ఏం తీసుకువచ్చారో తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలకు ఏం నచ్చుతాయో తెలుసుకోవడంతో పాటూ, తోటి పిల్లలు ఎలాంటి ఆహారాన్ని తెచ్చుకుంటున్నారో మీరు తెలుసుకోవచ్చు. దీని వల్ల మీరు పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని పెట్టాలో కూడా అర్థమవుతుంది.

మీ పిల్లల స్నేహితుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పిల్లవాడు ఎటువంటి పిల్లలతో ఉంటున్నారో మీరు తెలుసుకోగలుగుతారు. మీ పిల్లలు స్నేహితులు ఎలా మాట్లాడుతారు? వారు ఎక్కడ ఎక్కడ నివసిస్తున్నారు? వారి తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ పిల్లవాడు పాఠశాలలో ఎలాంటి పిల్లలతో సమయం గడుపుతున్నారో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు మీకు అవకాశం ఇస్తాయి.

మంచి క్షణం గురించి అడగండి

పిల్లవాడు ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే వారు పాఠశాలలో తను అందుకున్న కాంప్లిమెంట్ గురించి తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇష్టపడతారు. కాబట్టి అతను చెప్పేది మీరు వినండి. అతని మాట వినడానికి బదులుగా, మొదట బట్టలు మార్చడం, ఆహారం పెట్టడం వంటి విషయాలలో నిమగ్నం కాకండి. దీని వల్ల తల్లిదండ్రులు తన గురంచి ఏమీ పట్టించుకోవడం లేదని అతను భావించే అవకాశం ఉంది. ఇలా పదేపదే చేయడం వల్ల పిల్లవాడు క్రమంగా మీతో విషయాలు పంచుకోవడం మానేస్తాడు. కాబట్టి పిల్లవాడు ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే, మొదట పాఠశాలలో తనకు ఎదురైన మంచి అనుభవం గురించి చెబుతున్నప్పుడు ఓపికగా విని ప్రశంసించాలి.

హోంవర్క్ సంబంధిత ప్రశ్నలు

పిల్లవాడు పాఠశాల నుండి వచ్చిన వెంటనే, ఆరోజు ఇచ్చిన హోంవర్క్ గురించి అతడిని అడగండి. తద్వారా మీరు పిల్లల హోంవర్క్ ను సకాలంలో పూర్తి చేయవచ్చు.

పిల్లవాడిని కౌగిలించుకోండి –

పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి రాగానే, మొదట అతన్ని ప్రేమతో కౌగిలించుకోండి. ఇలా చేయడం వల్ల బిడ్డకు మంచి అనుభూతి కలగడమే కాకుండా హ్యాపీగా ఫీలవుతారు. తన తల్లిదండ్రులు తనను ఎంతగానో ప్రేమిస్తారనే నమ్మకంతో ఉంటాడు.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024