NNS July 9th Episode: అమర్​పై భాగీకి ప్రేమ- నిజం దాచేసిన మిస్సమ్మ- మనోహరికి వీడియోతో బ్లాక్​ మెయిల్​- 50 లక్షలు డిమాండ్

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 9th July Episode) మనోహరి విషం కలిపిన అన్నం తిని పిల్లలకి ఏమైందోనని కంగారు పడుతుంది అరుంధతి. గుప్త గీసిన రక్షణ రేఖ వల్లే తాను ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోయానని బాధపడుతుంది.

హాస్పిటల్‌లో రామ్మూర్తి

మీరు చేసిన పని వల్ల నేను వెళ్లి పిల్లల్ని కాపాడలేకపోయాను.. అసలేం జరిగిందో తెలుసా మీకు అని గుప్తని నిలదీస్తుంది. అసలేం జరిగింది అంటాడు గుప్త. అంతా తెలిసి ఏం జరుగుతుందని అడుగుతున్నారా? అని అరుంధతి గుప్త వెంటపడుతుంది. ఒక్క నిమిషం ఆగు అంటూ ఏం జరిగిందోనని చూస్తాడు. మనోహరి విషం కలిపిన భోజనాన్ని పిల్లలు తినకుండా మిస్సమ్మ కాపాడింది. కానీ, అప్పటికే రామ్మూర్తి తినడం వల్ల హాస్పిటల్ పాలయ్యాడని తెలుసుకుంటాడు గుప్తా.

ఏం జరిగిందో చెప్పండి గుప్త గారు.. అత్తయ్య, మామయ్య కంగారుగా బయల్దేరి వెళ్లారు. ఎవరికి ఏం జరిగిందోనని భయంగా ఉంది అంటుంది అరుంధతి. నీ పిల్లలకి ఏం కాలేదు.. మిస్సమ్మ వెళ్లి వాళ్లు ఆ భోజనం తినకుండా వారించింది. కానీ, ఆమె తండ్రిని మాత్రం కాపాడుకోలేకపోయింది అంటాడు గుప్త. అయ్యో.. నాన్నకి ఎలా ఉంది అంటుంది అరుంధతి. అదేంటి.. మిస్సమ్మ వాళ్ల నాన్నని నేను నాన్న అన్నానేంటి అని ఆశ్చర్యపోతుంది అరుంధతి.

కోపంగా మనోహరి

అదే.. ఆ బాలికను నువ్వు చెల్లి అనుకుంటావు కదా.. అందుకే అలా అని ఉంటావు అని నచ్చజెప్పుతాడు గుప్త. సరే గానీ.. నేను నా పిల్లల్ని చూడటానికి వెళ్లాలి త్వరగా ఆ రక్షణ రేఖ చెరిపేయండి అని అడుగుతుంది అరుంధతి. అవసరం లేదు.. వాళ్లే వస్తున్నారు చూడు అంటాడు గుప్త. అమర్, భాగీ, పిల్లలు, మనోహరి, రాథోడ్​ అందరూ వస్తారు. మనోహరి కోపంగా కారు దిగి ఇంట్లోకి వెళ్తుంది.

అంతా దీనివల్లేనండి.. అని మనోహరిని కోపంగా అరుస్తుంది అరుంధతి. రాథోడ్​తో మాట్లాడుతున్న అమర్​ని ఆరాధనగా చూస్తూ ఉంటుంది భాగీ. అరుంధతిని పిలిచి ఆమెని చూడమంటాడు గుప్త. అదేంటి.. భాగీ మా ఆయనని అలా చూస్తుంది అని అడుగుతుంది అరుంధతి. నీ భర్త ఆ బాలిక తండ్రి వైద్యానికి పెద్దసాయం చేస్తున్నాడు అంటాడు గుప్త. ఆనందపడుతుంది అరుంధతి.

సీసా ఏంటో తెలుసా

కానీ, అంతలోనే అంటే.. మిస్సమ్మ మా ఆయనని ప్రేమిస్తోందా? అని అడుగుతుంది అరుంధతి. అవును నువ్వు అన్నది నిజమే అంటాడు గుప్త. అందరూ ఇంట్లోకి వెళ్లగానే ఇంతకీ ఫుడ్​ పాయిజన్​ ఎలా జరిగింది అంటాడు అమర్​. ఎంత ప్రమాదం తప్పింది. ఇంతకీ కిచెన్​లో దొరికిన సీసా ఏంటో తెలిసిందా? అని అడుగుతుంది నిర్మల. ఎంటది.. అంటాడు అమర్​. తన గురించి చెబుతుందేమో అని భయపడుతుంది మనోహరి.

అదేం లేదు అత్తయ్య.. అది వట్టి మందు మాత్రమే అంటుంది మిస్సమ్మ. మరి తప్పెక్కడ జరిగిందంటావు? నువ్వే వంట చేసి బాక్సులు పెట్టావు కదా.. అందుకే నిన్ను అడుగుతున్నాను అంటాడు అమర్. తప్పు ఇంట్లోనే జరిగిందండి.. కూరగాయలకి ఎక్కువ పురుగు మందులు కొట్టడం వల్ల కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. నేనే కూరలని ఉప్పు నీళ్లలో నానబెట్టి వండాల్సింది అంటుంది మిస్సమ్మ.

ఒకే దెబ్బ గట్టిగా కొట్టాలి

సరే అయితే.. నీల వచ్చేవరకు వేరే వంటమనిషిని పెట్టుకోండి అంటాడు అమర్. వద్దండి.. నేనే జాగ్రత్తగా ఉంటాను. కొన్ని క్రీముల్ని చంపాలంటే నేనే వంట చేయాలి అంటుంది మిస్సమ్మ. సరే నీ ఇష్టం.. అని లోపలికి వెళ్తాడు అమర్​. అందరూ లోపలకి వెళ్లడంతో అదేంటి మిస్సమ్మ.. విషం కలిపింది మనోహరి అని ఎందుకు చెప్పలేదు అంటాడు రాథోడ్​.

మనోహరి మామూలు పాము కాదు రాథోడ్​.. దెబ్బ మీద దెబ్బ కొట్టడం కాదు ఒకే దెబ్బ గట్టిగా కొట్టాలి అంటుంది మిస్సమ్మ. భాగీ మనోహరి గురించి ఆయనకు చెప్పకుండా ఎందుకు దాచింది అంటుంది అరుంధతి. ఆ బాలిక మనోహరి నాశనం కోసం ప్రయత్నిస్తోంది. చెడ్డవారిని చెడ్డవారిగా నిరూపించడం కష్టం కాదు గానీ మంచివారి ముసుగులో ఉన్న చెడ్డవారిని గుర్తించడం చాలా కష్టం అని వివరిస్తాడు గుప్తా.

50 లక్షలు డిమాండ్

అవును నేనే చిన్నప్పటినుంచి పక్కన ఉండి కనిపెట్టలేకపోయా అనుకుంటుంది అరుంధతి. అసలు తనను వీడియో తీసి బ్లాక్​మెయిల్​ చేస్తుంది ఎవరు? అని ఘోరా, బాబ్జీని పిలిచి అడుగుతుంది మనోహరి. వాళ్లిద్దరూ మేము కాదని చెప్పడంతో ఆలోచనలో పడుతుంది. ఇంతలో ఆ వ్యక్తి ఫోన్​ చేసి యాభై లక్షలు కావాలని బేరం పెడతాడు. నిర్మల, శివరామ్​ హాల్లో కూర్చొని ఉండగా కరుణ వస్తుంది.

ఎఫ్​ఎమ్​లో పనుంది త్వరగా వెళ్లాలి అంటుంది. ఆర్జే భాగీనే తమ కోడలు మిస్సమ్మ అని అమర్ తల్లిదండ్రులకు తెలుస్తుందా? అరుంధతి చనిపోయిన విషయం మిస్సమ్మకు తెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే జులై 10న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024