Hero Dating: కూతురు వయసున్న 20 ఏళ్ల మోడల్‌తో హీరో డేటింగ్.. మాజీ భార్య రియాక్షన్ మాములుగా లేదు!

Best Web Hosting Provider In India 2024

Tobey Maguire Dating: హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫ్రాంఛైజీ స్పైడర్ మ్యాన్ (Spider Man Franchise). సూపర్ హీరో సినిమాలకు మొదటగా ఎక్కువగా క్రేజ్ తీసుకొచ్చిన సినిమాల్లో తొలి స్థానంలో ఉంటుంది ఈ మూవీ. రెండు వేల దశకంలో మూడు పార్టులుగా వచ్చిన ఈ స్పైడర్ మ్యాన్స్ సిరీస్‌ను మూవీ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.

ఈ స్పైడర్ మ్యాన్ 1, 2, 3 సినిమాలతో వరల్డ్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో టోబే మాగైర్ (Tobey Maguire). ప్రస్తుతం 49 ఏళ్ల వయసున్న ఈ హీరో డేటింగ్ రూమర్స్ ఎదుర్కొంటున్నాడు. తన కూతురు కంటే మూడేళ్లు పెద్దదైన, 20 ఏళ్ల మోడల్ లిలీ చీ (Lily Chee)తో టోబే డేటింగ్‌లో ఉన్నట్లు ది ఇండిపెండెట్ వెబ్ సైట్ ప్రచురించింది.

అయితే, తాజాగా ఈ విషయంపై టోబే మాగైర్ మాజీ భార్య జెన్నిఫర్ మేయర్ (Jennifer Meyer) రియాక్ట్ అయ్యారు. దీనిపై తనను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అడిగిన ప్రశ్నకు జెన్నిఫర్ ఇచ్చిన సమాధానం మాములుగా లేదు. “మీ మాజీ భర్త మీ కూతురు కంటే మూడేళ్లు పెద్దదైన అమ్మాయితో ఎందుకు డేటింగ్ చేస్తున్నాడు?” అని ఓ నెటిజన్‌ జెన్నిఫర్ మేయర్‌కు కామెంట్ చేశాడు.

ఆ కామెంట్‌కు జెన్నిఫర్ మేయర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. “సాధారణంగా నేను ఇలాంటి నాన్సెన్స్ వార్తలకు స్పందించను. కానీ, అతను కేవలం తన స్నేహితురాలికి కారు వద్దకు వెళ్లేందుకు సహాయం చేస్తున్నాడు. అతను ఎంతో దయగలిగిన వాడు. మంచి వ్యక్తి. ఇతరులకు సహాయం చేసే మనసతత్వం కలిగినవాడు. కానీ, ఎలాంటి సంబంధం లేని విషయంతో అతనిపై డైటింగ్ రూమర్స్ వచ్చాయి” అని జెన్నిఫర్ మేయర్ రిప్లై ఇచ్చారు.

జెన్నిఫర్ మేయర్ ఇంకా కొనసాగిస్తూ.. “మీ రూడ్ కామెంట్‌కు చాలా థ్యాంక్స్. ఇది ఈరోజు మీకు మంచి అనుభూతిని, సంతోషాన్ని కలిగించిందని నేను ఆశిస్తున్నాను. మీపై ప్రేమ, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను” అని స్ట్రాంగ్‌గా ఆన్సర్ ఇచ్చారు. దీంతో సదరు నెటిజన్ తాను పెట్టిన కామెంట్‌ను వెంటనే డిలీట్ చేసేశాడు. కానీ, జెన్నిఫర్ ఇచ్చిన రిప్లై మాత్రం హాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

అయితే, ఈ విషయంపై టోబే, లిలీ ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే, న్యూయార్క్‌లోని హాంప్‌టోన్స్‌లో ఫెనాటిక్స్ సీఈఓ మైఖేల్ రూబిన్ యాన్యువల్ ఇండిపెండెన్స్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టోబీ మాగైర్, లిలీ చీ కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను లిలీ తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. వీటిలో లిలీ నడుము చుట్టూ టోబే చేతులు వేసి సన్నిహితంగా కనిపించాడు.

అంతేకాకుండా ఇద్దరు సమ్మర్ బాష్‌కు సరిపోయేలా పూర్తి తెల్లటి దుస్తుల్లో దర్శనం ఇచ్చారు. టోబే, లిలీ అలా కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్స్‌కు తెర లేచింది. కాగా ఈ కార్యక్రమానికి వీరితోపాటు మెషిన్ గన్ కెల్లీ, మెగాన్ ఫాక్స్, డ్రేక్, మెగాన్ థీ స్టాలియన్, కిమ్ అండ్ ఖ్లో కర్దాషియాన్, టామ్ బ్రాడీ, రాబ్ గ్రోంకోవ్స్కీ, క్వావో, డ్రూస్కీ, మెగాన్ థీ స్టాలియన్, ఎమిలీ రటాజ్కోవ్స్కీ, లిల్ వేన్ తదితరులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే, టోబే అండ్ జెన్నిఫర్ 2007లో హవాయిలోని కోనాలో వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత 2016లో ఇద్దరూ విడిపోయారు. 2020లో విడాకులు అయ్యాయి. ఈ దంపతులకు 17 ఏళ్ల కుమార్తె రూబీ స్వీట్ హార్ట్ మాగైర్ (Ruby Sweetheart Maguire), 14 ఏళ్ల కుమారుడు ఓటిస్ తోబియాస్ (Otis Tobias Maguire) ఇద్దరు పిల్లలు ఉన్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024