Nandhyala minor girl: నంద్యాలలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం, హత్య

Best Web Hosting Provider In India 2024

Nandhyala minor girl: నంద్యాల జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక‌పై అత్యాచారం చేసి, ఆపై హ‌త్య‌కు ఒడిగ‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు బాలురు నిందితులుగా ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌తో బాలిక త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. అంతేకాకుండా ఈ ఘ‌ట‌న ఆ ప్రాంతంలో సంచ‌ల‌నంగా మారింది.

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌గిడ్యాల మండ‌లం ముచ్చుమ‌ర్రి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం, ఆపై హ‌త్య‌కు గురైంది. ఆదివారం తోటి స్నేహితుల‌తో క‌లిసి పాత ముచ్చుముర్రి లోని పార్కులో ఆడుకున్న చిన్నారి అదృశ్యం అయింది. దీంతో సాయంత్రం నుంచి త‌న బిడ్డ క‌నిపించ‌డం లేద‌ని బాలిక తండ్రి మ‌ద్దిలేటి, త‌ల్లి సుజాత‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో బాలిక అదృశ్యం అయిన‌ట్లు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్ఐ జ‌య‌శేఖ‌ర్ తెలిపారు. అయితే విష‌యం తెలుసుకున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శ‌బ‌రికి తెలిసి, బాలిక ఆచూకీని త్వ‌ర‌గా గుర్తించాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు.

దీంతో సోమ‌వారం డీఎస్పీ శ్రీ‌నివాస‌రావు రంగంలోకి దిగి ఆ గ్రామానికి చేరుకొని విచార‌ణ చేప‌ట్టారు. కుటుంబ స‌భ్యుల‌ను అడిగి స‌మాచారం తెలుసుకున్నారు. బాలిక మిస్సింగ్ మిస్ట‌రీని ఛేదించేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీ‌నివాస‌రావు తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసి, బాలిక ఆచూకీ కోసం మంగ‌ళ‌వారం ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

జూపాడుబంగ్లా, మిడుతూరు, ముచ్చుముర్రి, బ్రాహ్మ‌ణ కొట్కూరు ఎస్ఐల ఆధ్వ‌ర్యంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ్రామ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌ల్లెడ ప‌ట్టారు. అందుకు పోలీసులు జాలిలం (శున‌కం)తో గాలించారు. ఆ పోలీసు జాగిలం స్థానిక ముచ్చుమ‌ర్రి పార్క్ నుంచి ఎత్తిపోత‌ల ప‌థకం పరిస‌రాల్లో తిరిగి పంపుహౌస్ వ‌ద్ద‌కు వ‌చ్చి జాగిలం ఆగిపోయింది.

ఆదివారం సాయంత్రం ఒంట‌రిగా పార్కులో ఉన్న బాలిక‌ను ముగ్గురు బాలురు ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డి, ఆ పై కాలువ‌లోకి తోసేసి హ‌త్యకు పాల్ప‌డిన‌ట్లు నిర్థార‌ణ‌కు పోలీసులు వ‌చ్చారు. 14-16 ఏళ్ల‌లోపు వ‌య‌సున్న ఈ ముగ్గురు బాలురు అత్యాచారం చేసిన విష‌యాన్ని బాలిక ఇంట్లో చెబుతుంద‌న్న భ‌యంతోనే కాలువ‌లోకి తోసేసిన‌ట్లు గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఆ ముగ్గురు బాలురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ సమయంలో బాలల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వారిని పోలీసులు గట్టి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది.

విచారణలో బాలురు అత్యాచార‌, హ‌త్య నేరం తామే చేశామ‌ని ఒప్పుకున్నారు. అంత‌కు ముందు చిన్నారి అదృశ్యం అయిన విష‌యం నంద్యాల ఎంపీ బైరెడ్డి శ‌బ‌రికి తెలిసి,బాలిక ఆచూకీని త్వ‌ర‌గా గుర్తించాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. తండ్రి చేసిన ఫిర్యాదు, ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి చేసిన ఆదేశాల‌తో పోలీసులు గాలింపు చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేశారు. దీంతో మంగ‌ళ‌వారం ఘ‌ట‌నకు సంబంధించి అన్ని వివ‌రాలు తెలుసుకోగా, నిందితుల‌ను కూడా ప‌ట్టుకున్నారు. కాల్వలో నీటి ప్రవాహం ఉండటంతో బాలిక అచూకీ దొరకలేదు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel

టాపిక్

Crime ApCrime NewsAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024