రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ నేతల దాడులు

Best Web Hosting Provider In India 2024

వెంకటగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత తంగా పేచీరాజ్‌పై దాడి

దివ్యాంగుడిపై  టీడీపీ కార్యకర్తల దాడి 

 తిరుపతి: తిరుపతి జిల్లాలో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. వెంకటగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత తంగా పేచీరాజ్‌పై దాడి చేశారు. ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ నేతలు దాడి చేశారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దివ్యాంగుడిపై  టీడీపీ కార్యకర్తల దాడి 
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త, దివ్యాంగుడైన జు­వ్వా­­ది అశోక్‌బాబుపై టీడీపీ శ్రేణులు దాడిచేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచి్చంది. తీవ్రంగా గాయపడిన అశోక్‌బాబు ఆస్పత్రి నుంచి ఇంటికి వ‌చ్చిన‌ తరువాత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ బాలరాంరెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని గణపవరం శాంతినగర్‌కు చెందిన అశోక్‌బాబు నూరుశాతం దివ్యాంగుడు. వీల్‌చైర్‌కే పరిమితం. ఈ నెల ఒకటో తేదీన పింఛను రూ.6 వేలు టీడీపీ నాయకులు అందించారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు మోటార్‌ సైకిల్‌పై అశోక్‌ ఇంటి వద్దకు వచ్చారు. వీల్‌చైర్‌లో ఇంటి గుమ్మం వద్ద అశోక్‌ తలమీద బీరుసీసాతో కొట్టి పరారయ్యారు.

తలకు తీవ్రగాయమైన అతడిని స్థానికులు చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న అశోక్‌బాబు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై జరిగిన దాడి గురించి అశోక్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. గతంలో కూడా తనపై రెండుసార్లు దాడి జరిగిందని, ఎన్నికల ఫలితాల రోజు టీడీపీ కార్యకర్తలు తమ ఇంట్లోకి బీరుసీసాలు విసిరేశారని అశోక్‌ తెలిపారు.  

రాజకీయ కక్షతో నా కుమారుడిపై హత్యాయత్నం
రాజకీయ కక్ష పెట్టుకున్న వ్యక్తులు 24 మంది మారణాయుధాలతో తన కుమారుడు కామిరెడ్డి నర్సింహారావు (నాని)పై హత్యాయత్నానికి తెగబడ్డారని, వారిపై చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన పోస్టు­మాస్టర్‌ కామిరెడ్డి ఆనంద్‌బాబు, కామిరెడ్డి జలజాక్షి.. జిల్లా అడిషనల్‌ ఎస్పీ స్వరూ­పారాణికి ఫిర్యాదు చేశారు.

మంగళవారం ఏలూరు ఎస్పీ కార్యాలయంలో ఈ అంశాలను మీడియాకు వివరించారు. ఈ నెల 7న శ్రీరామవరంలోని తన ఇంట్లోకి 24 మందితో పాటు మరికొంత మంది అక్రమంగా ప్రవేశించారని, తన కుమారుడు వైయ‌స్ఆర్‌సీపీ దెందులూరు మండల అధ్యక్షుడు కామిరెడ్డి నర్సింహారావు (నాని) ఇంట్లో ఉండటాన్ని గమనించి తన కుమారుడిని చంపాలనే ఉద్దేశంతో మారణాయుధాలతో వచ్చారని వివరించారు. వారు తనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారని చెప్పారు.

తన కుమారుడు వెనుక వైపునకు వెళ్లి ఒక గదిలో తలుపు వేసుకుని ఉండగా గదిని పగులగొట్టి తన కుమారుడిని చంపే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు రాగా రాత్రి ఒంటి గంట సమయంలో వారంతా వెళ్లిపోయారన్నారు. ఎప్పటికైనా చంపేస్తామని బెదిరించారని చెప్పారు. తన కుటుంబసభ్యులను కూడా దుర్భాషలాడి భయభ్రాంతులకు గురి చేసి చోడ­వరపు లక్ష్మణరావు అనే వ్యక్తిని కూడా గాయపరిచారన్నారు. తమ ఇంట్లో పోస్టాఫీస్‌ ఫరి్నచర్, తన ఇంటి అద్దాలు, కురీ్చలు, తన కుమారుడి కార్యాలయం ధ్వంసం చేశారని తెలిపారు. తన కుమారుడిపై హత్యాయత్నం చేసిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. తన కుమారుడికి, తమ కుటుంబానికి భద్రత కలి్పంచాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుతో పాటు ఫొటోలు, సీడీలు ఎస్పీకి జతపరిచినట్లు తెలిపారు. 
 

 

Best Web Hosting Provider In India 2024