TTD Darshanam: తిరుమలలో పెద్దిరెడ్డి అనుచరుడికి సిఎంఓ అధికారి ప్రద్యుమ్న సిఫార్సుతో సుప్రభాత దర్శనం

Best Web Hosting Provider In India 2024

TTD Darshanam: ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ ముఖ్య నాయకుల హవా కొనసాగుతోంది. తాజాగా తిరుమల ఆర్జిత సేవల్లో చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడికి ఆర్జిత సేవ టిక్కెట్లను కేటాయించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సిఫార్సు లేఖలతో ఆర్జిత సేవ టిక్కెట్లు ఎవరికైనా కేటాయించే అవకాశమున్నా పెద్దిరెడ్డి అనుచరులకు టిక్కెట్ల కేటాయింపు చేయడంపై విమర్శలు చెలరేగాయి. వారికి దర్శనం టిక్కెట్లను సిఫార్సు లేఖను సిఎంఓలో పనిచేస్తున్నఐఏఎస్ అధికారి మంజూరు చేయడం వివాదాస్పదంగా మారింది. వైసీపీ నాయకులుగా ఉన్న వారికి టీటీడీ సుప్రభాత దర్శనం టిక్కెట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సిఫార్సుతో కేటాయించారు.

సిఎంఓలో కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న చిత్తూరు జిల్లాకు చెందిన ఓ న్యాయవాదితో పాటు మరో ఐదుగురికి ఆర్జిత సేవ టిక్కెట్లను కేటాయించాలని సిఫార్సు చేయడంతో పి.అమర్‌నాథ్‌ రెడ్డితో పాటు మరో ఐదుగురికి దర్శనం టిక్కెట్లను కేటాయించారు. జూలై 9వ తేదీ తెల్లవారుజామున 2గంటలకు ఆర్జిత సేవ కోసం వారిని టిక్కెట్లు కేటాయించారు. రూ.1440లనుకార్డు ద్వారా చెల్లించి టిక్కెట్లను పొందారు.

శ్రీవారి టిక్కెట్లను కేటాయించిన తర్వాత దర్శనం చేసుకున్న వారు వైసీపీ నాయకులు కావడంతో వారి ఫోటోలు వైరల్ అయ్యాయి. మంత్రి పెద్దిరెడ్డితో కలిసి ఉన్న ఫోటోలు, సిఎం కార్యదర్శి సిఫార్సు లేఖ ప్రత్యక్షమైంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రమేయం ఉండకపోవచ్చని, ఆయన సతీమణి వైసీపీ లీగల్‌ సెల్‌లో పనిచేసి ఉండటంతో పాత పరిచయాలతో దర్శనానికి సిఫార్సు చేసి ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

WhatsApp channel

టాపిక్

TtdIas OfficersTdpChandrababu NaiduAp Politics
Source / Credits

Best Web Hosting Provider In India 2024