Manchu Lakshmi: దేవత అయినా దెయ్యం అయినా నన్నే అడుగుతున్నారు.. మంచు లక్ష్మి కామెంట్స్

Best Web Hosting Provider In India 2024


Manchu Lakshmi Adiparvam Song Launch: మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ఆదిపర్వం”. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోన్హా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో పీరియాడిక్ డ్రామాగా “ఆదిపర్వం” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంజీవ్ మోగోటి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆదిపర్వం” సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. “ఆదిపర్వం లాంటి భారీ చిత్రాన్ని ఇంత త్వరగా సీజీ వర్క్‌తో సహా కంప్లీట్ చేస్తారని నేను అనుకోలేదు. ఈ సినిమాకు ఒక భగీరథ ప్రయత్నం చేశారు మా దర్శకుడు సంజీవ్ గారు. ఆయన థ్యాంక్స్ చెబుతున్నా. టీమ్ అంతా ప్యాషన్‌తో కష్టపడి పనిచేశారు” అని మంచు లక్ష్మీ తెలిపారు.

 

“నేను లాస్ట్ ఇయర్ మొత్తం గాలిలోనే రోప్స్‌పై స్టంట్స్ చేస్తూ ఉన్నాను. అంత యాక్షన్ చేయించారు ఈ సినిమాకు. మూడు లొకేషన్స్‌లో వర్క్ చేశాను. ఆదిపర్వం టీమ్ అందరికీ థ్యాంక్స్. ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాం అంటే అది మన నేల గొప్పదనం. ఈ శక్తవంతమైన గడ్డ మీద ఉన్నాం కాబట్టే ఇలాంటి నేపథ్యాలతో సినిమాలు చేయగలుగుతున్నాం” అని మంచు లక్ష్మీ అన్నారు.

 

“ఔట్ ఆఫ్ ది వరల్డ్ క్యారెక్టర్స్ కథలు అంటే నా దగ్గరకే వస్తున్నారు. రీసెంట్‌గా యక్షిణి వెబ్ సిరీస్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆదిపర్వం చేశాను. దేవత అయినా దెయ్యం అయినా నన్నే అప్రోచ్ అవుతున్నారు. ఆదిపర్వం మీ అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పగలను” అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

అలాగే లిరిసిస్ట్ సాగర్ నారాయణ్ మాట్లాడుతూ.. “ఆదిపర్వంలో సాహిత్యాన్ని అందించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సంజీవ్ గారికి థ్యాంక్స్. ఆయన ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇస్తుంటారు. ఆదిపర్వం ట్రైలర్ చూశాక మా డైరెక్టర్ గారికి ఫోన్ చేశాను. ట్రైలర్ ఇంత బాగుంటే సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్‌లో చూద్దామా అనిపిస్తోంది” అని తెలిపారు.

 

“ఈ సినిమాలో నేను సర్వశక్తి దాయం అనే పాట కంపోజ్ చేయడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. ఆదిపర్వం సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్” అని మ్యూజిక్ డైరెక్టర్ దొంతం ప్రవీణ్ చెప్పుకొచ్చారు.

 

“నేను ఆదిపర్వం సినిమాలో రెండు సాంగ్స్ చేశాను. రెండు సాంగ్స్ బాగా వచ్చాయి. నాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇది ఫస్ట్ మూవీ. తొలి చిత్రంతోనే నా అభిమాన నటి మంచు లక్ష్మి సినిమాకు వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆదిపర్వం చాలా బాగుంటుంది. డైరెక్టర్ సంజీవ్ గారికి థ్యాంక్స్” అని సినిమాకు పని చేసిన మరో సంగీత దర్శకుడు మాధవ్ సైబా తెలిపారు.

 

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024