Vizag Steel Plant : అలాంటి ప్రశ్నే లేదు…! వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రి కీలక ప్రకటన

Best Web Hosting Provider In India 2024


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో  కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… కీలక ప్రకటన చేశారు.  విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని తోసిపుచ్చారు. అలాంటి ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. 

 పరిశ్రమ పునరుద్దరణకు ప్రధానికి నోట్‌ సమర్పిస్తానని కేంద్రమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని అర్థమైందని వ్యాఖ్యానించారు. అధ్యయనం కోసం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు వచ్చానని చెప్పిన ఆయన… స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితిని ప్రధానికి నివేదిస్తానని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించడం తమ బాధ్యత అని అన్నారు.  త్వరలోనే ప్రధానికి నివేదిక సమర్పించి ఆయన ద్వారా సానుకూల నిర్ణయానికి కృషి చేస్తామని వివరించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన అవసరం లేదని కుమారస్వామి చెప్పారు. వంద శాతం ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాంట్ కొనసాగుతుందన్నారు. అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పుకొచ్చారు. 

 

WhatsApp channel

టాపిక్

Andhra Pradesh NewsVizag

Source / Credits

Best Web Hosting Provider In India 2024