
Best Web Hosting Provider In India 2024

ఇప్పుడు ఎక్కువ గంటలు కూర్చునే ఉద్యోగాలు ఎక్కువ. ఇలాంటి నిశ్చల జీవన శైలి కారణంగా పొట్ట దగ్గర కొవ్వు పెరిపోతుంది. డయాబెటిస్ వంటి రోగాలు కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది. వ్యాయామం, యోగా వంటివి ప్రతిరోజూ చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. మీరు కూడా మీ బిజీ లైఫ్ స్టైల్ రొటీన్ కారణంగా డయాబెటిస్, బెల్లీ ఫ్యాట్ సమస్యను ఎదుర్కొంటుంటే ప్రతిరోజూ మండూకాసనం వేయడం అలవాటు చేసుకోండి. రోజులో మూడు నుంచి నాలుగు సార్లు ఈ మండూకాసనం వేస్తే మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
మండుకాసనాన్ని కప్ప భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం మధుమేహం, పొట్ట సంబంధ వ్యాధులకు దివ్యౌషధంగా భావిస్తారు. మండుకాసనం వేసినప్పుడు శరీరం కప్పలా కనిపిస్తుంది. తరచూ పొట్ట సమస్యలతో బాధపడేవారికి ఈ యోగాసనం ఒక వరం. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల గ్యాస్, అజీర్ణం, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
మండుకాసనం ఎలా వేయాలి?
ముందుగా వజ్రాసనంలో కూర్చొని పిడికిలి బిగించి నాభి, తొడ దగ్గర చేతి పిడికిళ్లు పెట్టుకుని వేళ్లు పొట్ట వైపు ఉండేలా ఉంచాలి. ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటూ ముందుకు వంగి ఉండండి. ఇలా చేసేటప్పుడు, మీ ఛాతీని తొడలపై విశ్రాంతి తీసుకునే విధంగా కిందికి తీసుకురండి. నాభిపై ఎక్కువ ఒత్తిడి ఉండే విధంగా మీరు ముందుకు వంగి ఉండాలి. ఇలా చేసేటప్పుడు తల, మెడను పైకి లేపి ఉంచాలి. ఇలా చేసేటప్పుడు మీరు తాబేలులా కనిపిస్తారు. ఈ ఆసనం వేశాక నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ ఉండండి. దీని తరువాత, మీ సాధారణ స్థితికి వచ్చి తిరిగి శ్వాస తీసుకోండి. మళ్లీ మండూకాసనం వేయండి. ఇలా ఈ ఆసనాన్ని మూడు నుంచి ఐదు సార్లు చేయవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది.
మండుకాసనం వల్ల ప్రయోజనాలు…
బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది
క్రమం తప్పకుండా మండుకాసనం సాధన చేయడం వల్ల పొట్ట పై ఒత్తిడి కలిగిస్తుంది. దీని వల్ల పొట్ట తగ్గే అవకాశం ఉంది. ఈ ఆసనం చేయడం వల్ల పొత్తికడుపు కండరాలు ఉత్తేజితమై బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
డయాబెటిస్
డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ అయిదు సార్లు మండుకాసనం చేయడం ఎంతో మంచిది. దీన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. చక్కెర వ్యాధితో బాధపడే వారు వేయాల్సిన ఆసనాల్లో మండూకాసనం ముఖ్యమైనది.
పీరియడ్స్ పెయిన్
మహిళలు క్రమం తప్పకుండా మండుకాసనం వేయడం మంచిది. దీనివల్ల మహిళల్లో వచ్చే పీరియడ్స్ నొప్పి, తిమ్మిరి సమస్య చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఆడపిల్లలు ప్రతిరోజూ కాసేపు మండూకాసనం వేయడం అలవాటు చేసుకోండి.