Revanth Reddy: విద్యార్థులు, నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్-ఫీజు రియంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ పై కీలక ప్రకటన

Best Web Hosting Provider In India 2024

CM Revanth Reddy : విద్యా సంస్థలు పట్టాలు చేతిలో పెట్టి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా మారడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం అంగీకారం కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో కాలేజీలు ప్రస్తుత కాలానికి తగినట్టుగా సరికొత్త ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో శనివారం ‘తెలంగాణలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యాబోధన’ అంశంపై ఆయా కాలేజీల యాజమాన్యాలు, కాలేజీల ప్రిన్సిపల్స్, డీన్స్, హెచ్‌వోడీలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. విద్యార్థుల నైపుణ్యతను పెంచాలన్న సంకల్పంతోనే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.

ఫీజు రియంబర్స్మెంట్ పై కీలక వ్యాఖ్యలు

గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా పెండింగ్ పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఒకేసారి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేలా మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ విషయంపై ఆర్థిక శాఖతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు.

కోర్టు చిక్కులు లేకుండా ఉద్యోగాల భర్తీ

ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ క్రమంలోనే ఇంజినీరింగ్ విద్యను మరింత పటిష్టం చేసి, ఉన్నత నాణ్యతా ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రాథమిక స్థాయిలో 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్న విషయాన్ని వివరించారు. తెలంగాణ ఆకాంక్షకు ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు చిక్కులు, ఇతర గందరగోళాలను పరిష్కరించి ఇప్పటిదాకా 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ ప్రక్రియలోనూ నిబంధనల ప్రకారం, కోర్టు చిక్కులు తలెత్తకుండా, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ లో ఏఐ గ్లోబల్ సమ్మిట్

ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. వచ్చే సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ప్రపంచ నలుమూలల్లోని కృత్రిమ మేథా రంగ నిష్టాతులు, ఐటీ నిపుణులను ఏఐ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యా బోధన అంశంపై జేఎన్‌టీయూలో జరిగిన సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ఏఐ గ్లోబల్ సమ్మిట్ గోను ఆవిష్కరించారు.

అనంతరం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌పై అంతర్జాతీయ స్థాయి సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడాలన్న ఉద్దేశంతో కాకుండా తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎదగాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కోసం 200 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsCm Revanth ReddyJobsHyderabadGovernment Of TelanganaTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024