IRCTC Shirdi Tour : ఈ నెలలో షిర్డీ, శనిశిగ్నాపూర్ ట్రిప్ ప్లాన్ ఉందా? విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది! వివరాలివే

Best Web Hosting Provider In India 2024

IRCTC Shirdi Vijayawada Tour : అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా….? తక్కువ ధరలోనే మీ సొంత ప్రాంతాల నుంచి వెళ్లి… కొత్త ప్రదేశాలను చూసి రావొచ్చు.  ఈ తరహా ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరలోనే ప్రకటిస్తోంది. 

 తాజాగా విజయవాడ నుంచి షిర్డీ వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని జులై 30, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీలో కుదరకపోతే మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. https://www.irctctourism.com/p  వెబ్ సైట్ లోకి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ప్యాకేజీ వివరాలు:

  • విజయవాడ నుంచి షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
  • “SAI SANNIDHI EX VIJAYAWADA” పేరుతో  IRCTC టూరిజం ఈ ప్యాకేజీని ాపరేట్ చేస్తోంది.
  • 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జులై 30, 2024 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీలో మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.
  • ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. 
  • విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా బుకింగ్ చేసుకున్న వాళ్లు రైలు ఎక్కే ఛాన్స్ ఉంటుంది.
  • తొలి రోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. నైట్ అంతా ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 06.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు. సాయిబాబాను దర్శించుకుంటారు.  సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.
  • 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్టీ చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
  • విజయవాడ షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు :  కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 16,165గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10045, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8440 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.
  • స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 5,985గా ధర ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 13705గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 7590గా ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
  • https://www.irctctourism.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరిన్ని ప్యాకేజీలను కూడా ఈ సైట్ లో చూడొచ్చు.
  • విజయవాడ – షిర్డీ టూర్ ప్యాకేజీ డైరెక్ట్ లింక్ – https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR076 
  • విజయవాడనే కాకుండా… విశాఖ, తిరుపతి, రాజమండ్రితో పాటు పలు నగరాల నుంచి పలు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
WhatsApp channel

టాపిక్

IrctcIrctc PackagesTravelTourismAp TourismTelangana Tourism
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024