రషీద్ కుటుంబ స‌భ్యుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

Best Web Hosting Provider In India 2024

ర‌షీద్ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించిన మాజీ ముఖ్య‌మంత్రి

వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో పోటెత్తిన వినుకొండ ప‌ట్ట‌ణం

ప‌ల్నాడు: టీడీపీ గూండాల చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడిరో­డ్డుపై దారుణంగా హత్యకు గురైన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. రషీద్‌ చిత్రపటానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. రషీద్‌ తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దు..అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

కాగా ఉద‌యం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరిన వైయ‌స్ జ‌గ‌న్‌ గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్‌ మీదుగా వినుకొండ చేరుకున్నారు.  మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైయ‌స్‌ జగన్‌కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాన్ని కేటాయించింది. రిపేర్‌లో ఉన్న బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనం నుంచి దిగిన వైయ‌స్‌ జగన్‌.. మరో వాహనంలో వినుకొండకు వెళ్లారు.

రోడ్డుకు ఇరువైపులా భారీగా ఉన్న కార్యకర్తలు, ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జోరుగా వ‌ర్షం కురుస్తున్నా జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చి వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చి ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జగన్ కారు దిగి‌ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా ఉద్దేశ్యపూర్వకంగా పోలీసులు ఆటంకాలు క‌ల్పించారు. వైయ‌స్ జగన్ వెంట నాయకుల వాహనాలు రాకుండా  పోలీసులు అడ్డుకున్నారు. 15 సార్లు వైయ‌స్ జగన్ కాన్వాయ్ కి ఆటంకాలు కలిగించారు. పోలీసులు ఆంక్షలు, ఆటంకాలు తో ఆలస్యంగా వైయ‌స్‌ జగన్ వినుకొండ చేరుకున్నారు. జ‌న‌నేత రాక‌తో వినుకొండ ప‌ట్ట‌ణం పోటెత్తింది.   

Ys Jagan Visit Rashid Family Vinukonda Updates

Best Web Hosting Provider In India 2024